కొందరు మొక్కలు గురించి పూల గురించి పిల్లల గురించి భూత దయ గురించి మాట్లాడుతూ ఏదైనా బాధాకరమైన విషయం గురించి మాట్లాడుతూ టన్నుల కొలదీ విచారం వొలకబోస్తూ “అయ్యయ్యో అచ్చెచ్చో ఇలా జరిగివుండకూడదు” అంటూ వుంటారు. నిజానికి ఇటువంటి వారిలో వారి స్పందన చాలా వరకు కొన్ని క్షణాల వ్యవధి. మళ్ళీ వారు మాములైపోతారు. అలాంటి వారు 90% మంది నా చుట్టుపక్కల వుంటారని నాకు స్పష్టమైన అవగాహన ఉంది.
గొప్ప కోసమో లేదా నేను మాత్రమే ప్రత్యేకమైన మనిషిని అని చెప్పుకోవడం కాదు కానీ..
గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు గురించి మాత్రం నేను చాలా గట్టిగా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి ఉద్యమం సమయంలో ఆ ప్రాంత స్త్రీలపై జరిగిన హింస అణచివేత పై చాలా వేదనకు గురయ్యాను. తర్వాత కూడా చాలా హింసాత్మక ఘటనలు చూసాం. చాలామంది వాటినన్నింటిని రాజకీయ కోణంలో కొందరు వ్యతిరేకం గానూ కొందరు లోలోపల నవ్వుకుంటూ అలాగే జరగాలని ఆనందించారు.
వివేకానంద రెడ్డి గారి పాశవిక హత్య అమరావతి స్త్రీల పట్ల హీనంగా హింసాత్మకంగా ప్రవర్తించిన తీరు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వేధింపులు ఇలాంటివి గమనించినప్పుడు ఈ హింస ఎలాంటిది అనే సృహ ప్రపంచంలో వున్న తెలుగు వారందరిని ఆలోచింప చేసింది.
నేనెప్పుడూ నా స్పందన దాచుకోనూ.. రచయిత ముసుగు వేసుకోను. స్పందించేటప్పుడు లాభనష్టాల బేరీజు వేసుకోను. అమరావతి ఉద్యమం లో పాల్గొన్న స్త్రీల పై హింస కి స్పందించాను. Fb లో ఇక్కడే ఒక పోస్ట్ పెట్టాను. పేరు కూడా ఉదహరించలేదు. నా ఫ్రెండ్ లిస్టులో వున్న వాళ్ళే ఆ పోస్ట్ ను వారికి అందించారు. నేను నా ఫోటోలు పబ్లిక్ లో పెడతాను తప్ప పిల్లల ఫోటోలు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు పబ్లిక్ లో పెట్టను. నా ఫోటో పెట్టి ఆ రాకాసి సంతతి troll చేసారు. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియక నన్ను tag చేసిన ఫోటోలు సేకరించి ఆ ఫోటోలు పెట్టి అశ్లీల భాష ప్రదర్శించారు.
నేను వొకటే చెబుతున్నాను. నేను ఆ పోస్ట్ నా తోటి స్త్రీలపై జరిగిన హింస కు అణచివేతకు స్పందించి పెట్టిన పోస్ట్. నేను వాడిన భాష కోపం వచ్చిన ప్రతి స్త్రీ మాట్లాడే భాష. అందులో ఆవేదన తప్ప మరొకటి లేదు.
ఈ సంగతి జరగకముందే మెసెంజర్ లోకి వచ్చి తిట్టి వెళ్ళిన విషయాలు అన్నీ భద్రంగా వున్నాయి.. fb account ID లతో సహా.
ఎవరైతే అసభ్యంగా తిట్టారో పోస్ట్ లు పెట్టారో ఆ పోస్ట్ లను ఇంకో నాలుగు మాటలు తిప్పి share చేసారో.. వారందరికీ శిక్ష వుంటుంది. ఆల్రెడీ నోటీసులు అందుకున్నారు. చిన్నా చితకలు అకౌంట్లు మూసుకుని పోయారు.
నా ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారి వీరాభిమానులు
IPAC సభ్యులు ముసుగు ముఖాలు.. తోటి స్త్రీలను అంత బాధ కు గురిచేస్తే స్పందించని మీరు నన్ను troll చేస్తే నవ్వుకున్న మీరు.. ఒకటి తెలుసుకోవాలి. నేను బాధ పడ్డాను. ఆల్ రైట్. ఆ బాధ తట్టుకోలేక fb నుండి కొద్ది రోజులు నిశ్శబ్దంగా వుండిపోయాను.
ఈ రోజుకు నేను ఈ బాధకు కారణం అయిన పోస్ట్ డిలీట్ చెయ్యలేదు. ఆ పోస్ట్ పెట్టిన కార్యకారణ సంబంధం సత్యమైనది. ఈ పోస్ట్ లో ఆ రోజు నేను పెట్టిన పోస్టు జత చేస్తున్నాను చూడండి. అందులో కనీసం వ్యక్తులను ఉదహరించలేదు. మీరు మాత్రం ఫోటోలు పెట్టి అశ్లీలం గుమ్మరిస్తారు. ఆ రాత లో వున్న వ్యక్తి ఎవరో మీకు అర్థమైనప్పుడు ఆ హింస కూడా అర్థం కావాలి కదా! అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జ్ఞానవంతుల్లారా!?
ఆంధ్రప్రదేశ్ కి “అమరావతి” మాత్రమే రాజధాని. అది సత్యం శాశ్వతం. ఇక చావులు గురించి.. ఎవరికి ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. కొందరు కోపంతోనో ఆవేదనతోనో ఆవేశంతోనో తిడతారు.. అవి నిజం తిట్లు కావు. అమ్మలైన అందరూ కూడా తిడతారు. అంతెందుకు అసలు వాళ్ళ అమ్మ కూడా తిడుతూనే ఉంటుంది అని కొందరు అంటూంటారు.
ఈ అశ్లీల తిట్టుడు కార్యక్రమాలు జరగడం నాతోనే మొదలు కాదు చివర కాదు.. మగవాడి మదాందకారం ఆడదాని అహంకారం నోటి వాచాలత కు మూలకారణం సంస్కార హీనం.
మా భువనమ్మ ను కూడా తిట్టారు కదా అని ఆ పెద్ద గీతతో నా చిన్న గీతను పోల్చుకుని కాస్తంత ఉపశమనం పొందానేమో తప్ప జరిగింది మర్చిపోలేదు. బాకీ మిగిలేవుంది.
అది చట్టపరంగా తీరుతుంది. ఒకొకడిని పెన్సిల్ చెక్కినట్టు చెక్కాలి. Nib విరిగిపోవాలి. మళ్ళీ వెబ్ పేజ్ పై కీ బోర్డు వాడకుండా వెర్బల్ డయేరియా కక్కకుండా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాడు ఎవడైనా సరే!
ఇంకా లిస్టు వుంది.. బాకీ వుంది. సమాజానికి చీడపురుగులు వీరు. పోర్న్ మాదకద్రవ్యాలు లకన్నా ప్రమాదకరమైన వారు వీరు. వీరి ఉనికి ప్రమాదకరమైనది.
PS: స్త్రీలను ఆడపిల్లలను ఎవరు కించపరిచినా.. నేను వొప్పుకోను. అశ్లీలంగా కామెంట్ పెడితే ఊరుకోను. కామెంట్ డిలీట్ చేస్తాను. బ్లాక్ చేస్తాను.