అనువుకాని వేళ
వయస్సుతో సంబంధం లేకుండా ఆడవారి పై జరిగే అత్యాచారాలని అరికట్టడం ఎవరి పని కావడంలేదు . ఆ అత్యాచారాలని అరికట్టడానికి ఎవరికీ వారు జాగ్రత్తలు తీసుకోవల్సినదే ! మొన్నెప్పుడో నేను ఆడవారికి లైసెన్స్ తుపాకీలు ఇవ్వాలి అప్పుడైయినా భయపడతారని వ్యాఖ్యానించాను . అది కూడా కరక్ట్ కాదు మహిళల చేతుల్లో ఉన్న తుపాకీలు లాక్కుని వారిపై అత్యాచారాలు చేసి చంపేసి పోతారు అని ఒకరు తిరిగి వ్యాఖ్యానించారు
అసలు పగలు రాత్రి తేడానే లేకుండా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయేటప్పుడు ఆడవాళ్ళని బయటకి వెళ్ళ కూడదు అని చెప్పడం కూడా సబబు కాదు ఎందుకంటే ఇల్లు పదిలం కాదని అనిపిస్తుంది కాబట్టి.
రెండేళ్ళ క్రితం ఒకసారి,నాలుగు నెలల క్రితం ఒకసారి .. అసలు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడం గురించి కూడా ఆలోచించుకోవాలి అని అనుకున్నాను కూడా . చిన్నప్పటి నుండి నాతొ పాటు పెరిగి నా స్వభావం తెలిసిన మా చెల్లెలు కూడా నేను విపరీతంగా భయపడటం చూసి ఆశ్చర్యపోయింది .. తర్వాత నేను కూడా అనుకున్నాను అంత అభద్రతా భావం పనికిరాదేమో నేను అనవసరంగా భయపడుతున్నానని.
అలా భయపడటానికి గల కారణం చెపుతాను ..
రెండేళ్ళ క్రితం మా విజయవాడ పట్టణంలో "తెలుగు సినిమా పాట -చరిత్ర " డా॥ పైడిపాల గారి పుస్తకావిష్కరణ జరిగింది .. ఆ సభకి ముఖ్య అతిధులుగా "ఎస్.పీబాలసుబ్రహ్మణ్యం " గారు ,"సిరివెన్నెల " గారు వస్తున్నారు , పైగా ఆ సభని నిర్వహిస్తున్నది "ఎక్సరే సాహితీ సంస్థ " కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలి . అంతకన్నా ఎక్కువగా నేను ఎంతగానో అభిమానించే ..."సిరివెన్నెల " గారిని స్వయంగా చూడటం ,మాట్లాడం అన్నది చేజార్చుకోకూడదని ఆ సభకి వెళ్లాను ..
ఆ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. విజయవంతంగా సభ జరిగింది . నేను సిరివెన్నెల గారితో మాట్లాడి వారి "ఆటోగ్రాఫ్ " ని తీసుకున్నాను . అంతవరకూ సంతోషం. సభ పూర్తీ అయినది . ఎవరి దారి వారిది . ఆ రోజు నేను నా ద్విచక్రవాహనం ని బయటకి తీయలేదు . ఇంటి ముందు బస్ ఎక్కి,కళాక్షేత్రం ముందు బస్సు దిగవచ్చని .. హాయిగా బస్ ప్రయాణం చేసాను. అదే పొరబాటు అయిపొయింది. సభ ముగిసిన తర్వాత నేను బయటకి వచ్చి బస్ స్టాప్ లో నిలబడ్డాను ఎంత సేపటికి బస్ లు రావడం లేదు. ఎందుకో నాకు అర్ధం కాలేదు.అలాగే వేచి చూస్తున్నాను . నా చుట్టూ పోకిరీవాళ్ళు పోగవుతున్నారు. పైకి దైర్యంగా ఉన్నా .. లోపల భయం . వెంటనే .. ఒకరి అడిగాను .. "ఏమండీ బస్ లు రావడం లేదు ఎందుకని ? అండర్ బ్రిడ్జ్ క్రింద పనులు జరుగుతున్నాయి " అటు బస్ లు రావడం లేదు. మీరు బస్ స్టాండ్ కి వెళ్లి బస్ ఎక్కాల్సిందే " అని చెప్పారు . కాస్తంత దూరం నడిస్తే బస్ స్టాండ్ వచ్చేది కదా ! బుద్ది లేకుండా ఇంత సేపు ఇక్కడ నిలబడి ఈ పోకిరీ వాళ్ళ బారిన పడ్డాను అనుకుని గబా గబా బస్ స్టాండ్ వైపుకి దారి తీశాను ఇద్దరు నా వెనుక ఫాలోఅవుతూనే ఉన్నారు . నా తోటీ ప్రయాణికులు అనుకున్నంత తేలికగా .. నేను పైకి దైర్యం కూడా గట్టుకుని .. బస్ స్టాండ్ వైపు వచ్చాను .
విజయ వాడ నగరంలో నడి బొడ్డున , పైగా కూత వేటు దూరంలో పోలీస్ కంట్రోల్ రూమ్,అక్కడే ఉన్న బస్ స్టాప్ లో నిలబడ్డ ఆడవాళ్లకే రక్షణ లేకుండా ఉన్నప్పుడు .. ఇక మారుమూలల్లో ఆడవాళ్ళకి రక్షణ ఎలా ఉంటుంది ?
ఆ అనుభవంతో నేను చాలా భయపడి పోయాను . రాత్రి వేళల్లో జరిగే సభలు సమావేశాలు లాంటి వాటికి వెళ్ళడానికి స్వస్తి చెప్పాను .
ఇలాంటి ఇబ్బందులు ఇవైతే సాహితీ సభలు,సమావేశాలలో సంస్కారం ముసుగు వేసుకున్న వాళ్ళు మరి కొందరు. నా ఫేస్ బుక్ ప్రెండ్ ఒకరు చెప్పారు . ఆమె రాజధాని నగరంలో ఒక విశ్వవిద్యాలయంలో వర్క్ చేసేవారు . ఆమెకి సాహిత్యం పట్ల చాలా ఆసక్తి . కవిత్వం వ్రాస్తారు . సభలు సమావేశాలకి తరచూ వెళుతూ ఉంటుంది . ఒక ప్రముఖ సాహితీ వేత్త .. ఆమెని "నాతో లాంగ్ డ్రైవ్" కి రమ్మని పదే పదే ఆహ్వానించడం,మొబైల్ కి అశ్లీల సంభాషణలు పంపడం మొదలెట్టేసరికి సభలకి వెళ్ళడం మానుకుంది. ఫోన్ నంబర్ మార్చుకుంది . ఇంట్లో భర్తకి చెపితే అవొక ఇబ్బందులు . నిన్ను నేను కవిత్వాలు,కథలు గట్రా వ్రాయమన్నానా !? సభలకి తిరగమన్నానా ..? ఇల్లు వదిలేసి సభలకి సమావేశాలకి తిరిగితే ఇలాగే అంటాడే, వాడేమిటి.. ప్రతి ఒక్కడు అలాగే అంటాడు " అని తిట్టి పోసాడంట ఆమె భర్త . ఆమె ఆవిషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నారు ఆ విషయం అలా ఉంచితే .. ఇక నా రెండో అనుభవం గురించి....
గత మే నెలలో మా బంధువుల అమ్మాయి పెళ్ళి జరిగింది మెహందీ పంక్షన్ కి మా కుటుంబం మొత్తం వెళ్లాం... అందరం ఆడవాళ్ళమే! మెహందీ పంక్షన్ లో పాటలు,డాన్స్ , క్విజ్ కార్యక్రమం ఆస్వాదిస్తూ టైం పదిన్నర అయింది అన్న సంగతి చూసుకోలేదు. టైం చూసుకుని ఉలికి పడి ఎదో గబా గబా కతికి .. ఆ పంక్షన్ హాలు నుండి బయట పడ్డాము. వదిన ,మేనకోడలు ఒక వైపుకి వెళ్ళాలి, నేను చెల్లెలు ఒకవైపుకి రావాలి .. బస్ సౌకర్యం ఉంటె .. ఎవరూ వెహికిల్స్ అంటుకోము. (అదొక మాయ రోగం అని ఇంట్లో మగవాళ్ళు తిడతారు కాని భద్రత సమస్య అని అర్ధం చేసుకోరు )
మేము పంక్షన్ జరిగిన పెద్ద హోటల్ నుండి బయటకి వచ్చి కొంచెం దూరంలో ఉన్న బస్ స్టాప్ వైపు నడుస్తున్నాం. ఒక కారు మా వెనుకనే వస్తుంది మమ్మల్ని దాటి ముందుకు వెళ్లి ఆపి లిఫ్ట్ కావాలా అని అడిగాడతను. మేము పట్టించుకోకుండా ముందుకు నడవసాగాం . మళ్ళీ కారు మమ్మల్ని దాటి వెళ్లి ఆపి .. మాతో మాట్లాడటానికి ప్రయత్నించాడు . ఆ విషయం మా చెల్లెలు తో చెప్పాను . " మనకి తెలిసిన వాళ్ళు ఎవరైననేమో అక్కా.. ఎందుకు అలా భయపడతావ్ !? " అని చిరాకు పడింది . "లేదు మనకి తెలిసిన వాళ్ళు కాదు" అన్నాను . "మనం ఇంత మందిమి ఉన్నాం, ఎవరేమి చేస్తారు? నీకు అన్ని భయాలు ఎక్కువయ్యాయి "అని కోప్పడింది
వదిన వాళ్ళు వెళ్ళాల్సిన వైపు బస్ లే రావడం లేదు . ఆటో లో వెళ్ళండి అని మా చెల్లెలు ,వద్దని నేను అలా వాదన గడచి ఎలాగైతేనేమి బస్ వచ్చింది వాళ్ళు వెళ్ళారు .. "అమ్మయ్య " అనుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాను . మా చెల్లెలు నేను బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాను . తర్వాత మా చెల్లెలు అమ్మాయితో చెపుతుంది ." పెద్దమ్మ .. అదివరకటిలా కాదు విపరీతంగా భయపడుతుంది" అని చెప్పి... నవ్వుతుంది
నా భయాలకి కారణం ఏమిటంటే .. ఆటో వాళ్ళు కూడా చాలా ప్రమాదకరంగా తయారయ్యారు ఒకసారి వదిన, మేనకోడలిని తీసుకుని ఆటోలో వెళుతుంటే వాడు మెయిన్ రోడ్ ప్రయాణం వదిలి వేరే రూట్ల ద్వారా ఆటో నడిపాడని భయ పడింది వదిన . అల్లాగే నా ఫ్రెండ్ ఒకరు హాండ్ ప్రింట్స్, బాతిక్ యూనిట్ నడుపుతూ ఉంటారు . విజయవాడలో అంతగా ఆర్డర్స్ లేవని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు ఇద్దరు ఆడపిల్లలు . వారి చదువులు కూడా అక్కడే ! చాలా కష్ట జీవి. ఆమె ఆర్డర్స్ కోసం హైదరాబాద్ లో చాలా లోపలి ప్రాంతాల లోకి కూడా వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకునే వారు. ఆమె బస్ ప్రయాణమే చేసేవారు . సిటీ అవుట్ స్కర్ట్స్ బస్ స్తాపులలో నిలబడి ఉన్నప్పుడు అంతే.. ప్రక్కనే కారు ఆపి డోర్ తీసి నిలబడే వారట. అలాంటి రెండు మూడు సంఘటనల తర్వాత ఆమె భయపడి పోయి .. పిల్లలని కాలేజ్ హాస్టల్ లో జాయిన్ చేసి మళ్ళీ విజయవాడకి వచ్చేసారు . " ఆడవాళ్ళు నిజాయితీగా బ్రతకడం చాలా కష్టమండి . హైదరాబాద్ అంటేనే భయం వేసింది " అంటారు ఆమె. ఇలా నా చుట్టూ ప్రక్కల వారి అనుభవాలు .., మన చుట్టూరా జరుగుతున్నా సంఘటనలు చూస్తుంటే .. ఎంతో దైర్యవంతురాలినైన నేను ఉలికిపడుతూ ఉంటానన్నది నిజం .
అసలు ఈ విపరీత దోరణులకి కారణం ఏమిటి ? కనిపించిన ప్రతి ఆడవారిని తుచ్చంగా చూసే సంస్కృతీ పెరగడానికి కారణం ఏమిటీ!? ఎటువైపుకి వెళుతున్నాం మనం ..? బాహ్య ప్రపంచంలోకి వెళ్ళకుండా ఎలా ఉండగలరు ? ఎవరి పనులు, ఎవరి ఉద్యోగాలు వారివి . ప్రతి ఒక్కరికి బ్రతుకు పోరాటం, ఒంటరిగా ప్రయాణించక తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. కనిపించిన ప్రతి వారిని కాముక దృష్టితో చూసే ఈ మాయదారి లోకంలో ఎలా బ్రతకడం ?
నేనైతే ఆడపిల్లలని పదే పదే హెచ్చరిస్తూనే ఉంటాను. "వాడికి ఏం పోయిందో ,నాకు అదే పోయింది " అని అనుకుని సరిపెట్టుకుని బ్రతకగల విశాల దృక్పథం మన భారతీయ స్త్రీలలో రాదు, రాదు గాక రాదు. అలా వచ్చిన రోజున ఇన్ని అత్యాచారాల కేసులు పోలీస్ రికార్డ్ లలో నమోదు కావు , దిన పత్రికల నిత్య వార్తలకి బలి అవవు.
"అత్యాచారం అన్నది భౌతిక, మానసిక దాడి" మానసికంగా మనం దృడంగా ఉండగల్గిన పెంపకాలలో పెరగడం లేదు. అనుక్షణం అభద్రతాభావంలో, సమాజం లో నలుగురు ఏమనుకుంటున్నారో అని భయపడుతూ నలుగురి మధ్య మధ్య తరగతి మందహాసంతో పళ్ళ బిగువునా అన్నీ భరిస్తూ .. బ్రతికే మనుషులం . ఖచ్చితంగా చెప్పాలంటే .. భారతీయ సంస్కృతిని నరం నరం జీర్ణించుకుని శారీరక పవిత్రతని కాపాడు కోవాలనుకునే ఆలోచనలు కల్గిన స్త్రీ జాతి వారసులం " అందుకే .. అనువుకాని వేళ బయట తిరగకండి " అని చెపుతాను.
చదువుంది, ఉద్యోగం ఉంది , సమాన హక్కులు ఉన్నాయి, మా వస్త్రధారణ మా ఇష్టం అనుకుని భ్రమపడి మృగాల బారిన పడకండి. మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు కాదు కదా!
ఇలా నేను ఎదుర్కొన్న రెండు సమస్యల వల్ల ఒంటరిగా బయటకి వెళ్ళడం అంటేనే ఆలోచించే స్థితికి వచ్చేసాను . 45 ఏళ్ళు దాటిన నేనే ఇలాంటి పరిస్థితులని చూస్తే .. ఇక యువతుల సంగతి ఏమిటీ?
వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ! ముఖ్యంగా తల్లులకి చెప్పేది ఏమిటంటే .. వాళ్ళే తమ బిడ్డలని కాపాడుకోవాలి తప్పదు
అత్యాచారాలకి బలి కాకుండా ఉండాలంటే .. సాధ్యమైనంత వరకు ఒంటరిగా వెళ్ళడం మానేయాలి అని చెపుతున్నాను
.

4 కామెంట్‌లు:
నిజమే. మీరు చెప్పుకొచ్చిన వ్యక్తిగత అప్రమత్తత అన్నివేళలా అవసరమే. దాంతోపాటుగా సామాజిక చైతన్యం కూడా చాలాచాలా అవసరం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అదే అత్యావశ్యకమేమో! ఇటీవల నిర్భయ సంఘటనలో నేరస్థులకు ఉరిశిక్ష పడడానికి కారణం కూడా దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబుకిన ఆగ్రహమే కారణం. అలాంటి సామాజిక చైతన్యం ఆ స్థాయిలో ఉద్యమరూపంలో ఉవ్వెత్తున ముందుకు రాకపోయుండుంటే, I'm sure, ఆ కేసును ఎప్పుడో క్లోజ్ చేసిపారేసుండేవాళ్లు. అంతగా కుళ్లిపోయింది వ్యవస్థ. అధికారుల్ని, నేతల్ని, పాలకుల్ని ప్రశ్నించి, ప్రతీదానికి రెస్పాన్బిబుల్ చేసే స్థాయికి ప్రజల్లో చైతన్యం పెరిగి, అది ఆర్గనైజ్ అవనంతవరకూ... ఒక్క అత్యాచారాలే కాదు, అన్ని విషయాల్లోనూ అభద్రతకు, అన్యాయానికి గురికాక తప్పదు. వ్యక్తిగతంగా మనం ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మనల్ని మనం ఎంత హెచ్చరించుకున్నప్పటికీ, నిందించుకున్నప్పటికీ... మనం వ్యవస్థలో, సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సామాజికంగా ఉత్పన్నమయ్యే అన్నిరకాల దురాగతాలకు ప్రతిఒక్కరూ గురయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే సామాజిక స్పృహ, చైతన్యం అందరిలో రగలాలి. కలసికట్టుగా ప్రతీదానిని ప్రశ్నించే, నిలదీసే స్థాయికి ప్రజలు ఎదగాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయక తప్పదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం మనందరం నడిసంద్రంలో మునిగిపోతున్న నావలో పయనిస్తున్నాం అనుకోవచ్చు. అలాంటి ఆపద్సమయంలో అందరూ కలసి ఆ నావ (వ్యవస్థ)ను సరిచేసుకుంటేనే తీరాన్ని సురక్షితంగా చేరుతారు తప్ప ఇలాంటి సమయాల్లో వ్యక్తిగత జాగ్రత్తకు, పాత్రకు సాపేక్షికంగా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని నా అభిప్రాయం. మీ ఈ పోస్టు బావుంది. థాంక్యూ!
పచ్చి నిజాలే చెప్పేరు. దీనికంతకూ కారణం మనమే. పిల్లలకి అందునా మగ పిల్లలికి అదుపాజ్ఞలు, భయభక్తులు గురువులూ చెప్పటం లేదు, తల్లితండ్రులస్లే చెప్పటం లేదు. ఎంత పోకిరీ వేషాలేస్తే అంత గొప్పనుకుంటున్నారు. ఇక ఆడ పిల్లలు పోకిరీగా ఉన్నవారినే ఇష్టపడుతున్నారట. సమాజం ఎటుపోతోందో తెలియటం లేదు. ఏదయినా జరిగిన తరవాత హడావుడి పడుతున్నారంతే. వయసుతో నిమిత్తం లేదు. తల్లీ అన్న సంబోధన లేదు. నాకు పిచ్చెక్కిపోతోంది..... మైనర్లు సామూహికంగా అడపిల్లని రేప్ చేశారు. ఆ పిల్ల ఎందుకు ప్రతిఘటించలేదో తెలియటం లేదు. సినిమాలు సాహిత్యం గురించీ, నెట్ గురించీ తలుచుకోకపోవడమే మంచిది. ఇక ఫోటోలు రకరకాల భంగిమలలో ఆడ మగ పిల్లలు తీయించుకుని సోషల్ నెట్ వర్క్ లలో పెట్టుకుంటున్నారు, ఈ మధ్య ఒక పెళ్ళి నిశ్చయమైనది ఇందుకోసం తిరిగిపోయింది. అమ్మో నా వ్యాఖ్య టపా అయేలా ఉంది.
ఇలాంటివి చదివినప్పుడు మనస్సు చాలా బాదగా ఉంటుంది. ఇవి పోవాలంటే చాలా కస్టపడాలి, వ్యవస్థ మారాలి అనుకోవటం కాదు ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి. అమ్మలు తమ వంతు పిల్లల్ని మార్పు దిశగా తీసుకెళ్ళాలి. మంచి ఫొస్ట్ వనజా అభినందనలు మీ కలానికి
పోస్ట్ చాలా బాగుంది.daily చూస్తున్నదే,వింటున్నదే.వ్యవస్థ మారాలీ అంటే ఎలా?ఎవరు మారుస్తారు?ఎలా మారుస్తారు?మొన్నటికి మొన్న చెన్నై లొ కొన్ని కాలేజీలు అమ్మాయిలకు డ్రెస్స్ కోడ్ పెడితే,దానికి అమ్మాయిలే నానా హడావిడి చెయ్యడం చూసి నవ్వుకున్నాను.వనజా గారు మీరు చెప్పింది నిజమే."ముఖ్యంగా తల్లులకి చెప్పేది ఏమిటంటే .. వాళ్ళే తమ బిడ్డలని కాపాడుకోవాలి తప్పదు"ఒకటి మాత్రం నన్ను బాగా బాధపెట్టే విషయం ఏమిటంటే-అసలు ఆ తల్లి ఎలా తన కూతురుని ఇలా వెకిలి మేకప్ లతో,ఎక్స్ పోజింగ్ దుస్తులతో ఎలా బయటకు పంపగలుగుతుందో?నా ఉద్దేశ్యము ఆడవారిదే తప్పనడము లేదు.కీచకులు వున్నారు.But Prevention is better than cure.
కామెంట్‌ను పోస్ట్ చేయండి