నేను రచయితలని గురువులు అనుకుంటూ చదివేను. రచయిత చెప్పినది ఆలోచించుకోడమే కానీ ఇది ఎందుకిలా రాసేరు అని ప్రశ్నించలేదు. - నిడదవోలు మాలతి
ఇపుడు ప్రశ్నించే తరం మన ముందు వుంది. అది మొన్న తెనాలిలో జరిగిన కొత్తకథ 2019 ఆవిష్కరణ సభలో విద్యార్ధులు చాలా ప్రశ్నలే వేసారు.
నేను కూడా వొక ప్రశ్నతో వచ్చానిపుడు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథల సంకలనం నుండి పొద్దున్నే వొక కథ చదివాను. “పుష్పలత నవ్వింది” అనే కథ. రచయిత కరుణ కుమార్.
రీ టోల్డ్ చేయబడిన యీ మంచి కథలో.. వొక వాక్యం.. ఇదేంటి.. యిలా వ్రాసేరు అని అనుకున్నా.. “పూలు పూయని తులసి మొక్కే నిత్యం పూజలు అందుకుంటుంటే నీకేంటి? దాన్ది పుణ్యమైతే ఈ మార్గం ఎంచుకున్న మన్ది కూడా పుణ్యమే” అంటుంది పుష్పలత తల్లి. ఈ వాక్యం వ్రాసింది “కరుణ కమార్” or ఖదీర్ బాబు?
తులసి మొక్క పూలు పూయకపోవడం యేమిటి? అగ్రికల్చర్ కస్టమ్స్ కళ్ళుకప్పి మరీ వేరే దేశాలకు భారతీయులు తులసి విత్తనాలు తీసుకువెళుతుంటే..
ఇలా రచయితలు నాతో సహా యేదో వొక విషయంలో పరధ్యానంలో పొరబడుతూనే వుంటారు. పాఠకులు ప్రశ్నిస్తూనే వుంటారు అని చెప్పడమే నా వుద్దేశం తప్ప భూతద్దంతో చూడటం కాదు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథలు 26 ఇంతకు ముందే చదివాను. మిగతా కథలు కోసం మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాను. రూపాయలు 150/ యే కానీ.. విలువైన పుస్తకం. అబ్బూరి ఛాయాదేవి గారి రచన “సుఖాంతం” ను మా కిట్టీ పార్టీ సభ్యులకు వినిపించాను కూడా.
సరే మరి... పూలు పూసిన తులసి ని కూడా చూడవచ్చు.
మాటలో మాట ...
మా ఇంట తులసితో నా స్నేహం ... యిలా ..
తులసిపూలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి