ఇటీవల వీక్షకులకి తమ దృష్టి మారుతుంది అననిపిస్తుంది.
ప్రతి ఆదివారం జెమిని చానల్ లో ప్రసారమయ్యే ప్రజావేదిక కార్యక్రమాన్ని చాలా మంది చూస్తున్నారు.
నేను ఎక్కడ మర్చిపోతానో అని..పది ఇళ్ళ అవతల ఉన్న మా చెల్లెలు ఫోను చేసి మరీ గుర్తుచేస్తుంది.
విజయవాడలో జరుగుతున్న ప్రజావేదిక కార్యక్రమానికి నీవు వెళ్ళ లేదే? అని చాలామంది అడుగుతున్నారు..
మరి కొందఱు. అక్కడికి వెళ్ళడం ఆ చర్చాకార్య క్రమం లో.. చర్చించడం కన్నా ముఖ్యమైనది ఏమిటంటే..
మన ఇంట్లో.. ఆ వేదికలో చర్చించాల్సిన అంశాలు పట్ల కాక పోయినా సమస్యల పట్ల అవగాహన పెంచుకున్టున్నామా!? అసలు సమస్య ఉందని మనకి మనమే గుర్తు ఎరిగామా?? ఎందుకంటే సమస్యలు మన ఇంట్లో ఉన్నాయి అని ఒప్పుకోము. సమాజంలో ఉన్నాయి అని అనుకుంటారు.ఇక్కడ "గురువిందగింజ" సామెత గుర్తు తెచ్చుకోవాలి.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రెండు వారాలుగా ప్రసారం అవుతున్నఅంశం.
"యువత అదుపు తప్పి ప్రవర్తిస్తుంది.దానికి కారణం ఎవరు!?"
ఇంకెవరు?మూకుమ్మడి సమాధానం ముమ్మాటికి తల్లి దండ్రులదే!తర్వాత మీడియా. ఇవి అస్త్రాలు.
యువత దేమి తప్పులేదు.పాపం. అసలు యువత లోనే రకరకాల ప్రవర్తనలు. తల్లి తండ్రుల వేదనలు.. ఏమి చేయలేని నిస్సహాయత. అయ్యో.. మా పిల్లలని బాగానే పెంచాము. వాళ్ళు అభివృద్ధి పథంలోకి రావాలని ఎన్నో కష్టాలు అనుభవించాం..రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో ఫీజులు కట్టాం. అడిగినవన్నీ ఇచ్చాం అంటున్నారు.
కానీ యువత మాత్రం చిన్నప్పుడు నుండి పుస్తకాల పురుగులుగా మారి ఆటా-పాట మఱచి ఉన్నత స్థానం కోసం తాపయత్రపడుతూ..అదే బాటలో.. నడిచే వారు క్రమ శిక్షణతో నడుచుకునేవారుగా తప్పక ఉంటున్నారు. వ్యక్తి అభివ్తుద్ధి మాత్రమె వీరు కాంక్షించే ఉత్తమ యువకులు.వీరి గురించి ఎవరికి చింత లేదు.. ఆఖరికి తల్లిదండ్రులకి కూడా..వీళ్ళని నేను హర్శించను. వీళ్ళకి సమాజం తో పని లేదు సమాజం కోసం ఆరాటపడరు..వాళ్ళు చేయగల్గింది మాత్రం ఉద్యోగరీత్యా మాత్రమె సేవ చేయ గలరు..అంతే! వీళ్ళకి సమాజం లో జరిగే అన్ని విషయాలు కావాలి కానీ వారు సమాజానికి ఏమి చేయజాలరు .
ఇక రెండవ రకం వారు.. చదువంటే నిర్లక్ష్యం .. కానీ.. బాగా చదవగలగడం వీరికి తెలుసు. అయినా జీవితం లో.. ఎంజాయ్ చేయడం అంటే విద్యార్ధి దశ లోనే.. అనే అభిప్రాయం తో..నిర్లక్ష్యం.వీళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తే మంచి పౌరులుగా మారడం చాలా తేలిక. ఇలాటి యువతే ఎక్కువ ఉంటుంది. మనందరి పిల్లలు వీళ్ళలోనే ఉంటారు. నాకు గొప్ప నమ్మకం. మంచి మార్గం ని సూచించే వారు కొరవయి మన బిడ్డలతో.. గడపడం తక్కువై.. మన ఆశలని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది.. వాళ్లకి ఇష్టం లేని రంగాల వైపు వారిని మరల్చి..యువతలో..కసిని,హింసాతత్వాన్ని పెంచి పోషిస్తుంది.. ముమ్మాటికి తల్లి తండ్రులే. వాళ్లకి మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే అవి ఇవి కొని ఇస్తామని లంచాల ఆశ చూపి..5 స్టార్ చాక్లెట్ల సంస్కృతి, పుట్టినరోజు పార్టీ ల సంస్కృతి .. బైక్ ల మీద తిరిగే సంస్కృతికి మనమే ఆజ్యం పోశాం. వాళ్ళు తగలబడ కుండా ఆపడం ఎవరి తరం.!? గంజాయి విత్తనాన్ని నాటి తులసి మొక్కలు రమ్మంటే ఎలా వస్తాయి?
పిల్లలు అదుపు తప్పుతున్నారు .. అంటే ఇంట్లో..ఆంక్షలు, వారి పై విపరీతమైన ఆకాంక్షలు.. బయటికి వెళితే ప్రక్కన వాడితో పోల్చుకోవడం...అమ్మ - నాన్న చెప్పిన నీతులకి విరుద్దంగా సమాజం కనబడటం.. ఇలాటి వైరుధ్య భావాల మద్య తిక మక.. తో.. మీడియా చూపే ఆకర్షణ ల వలయంలో.. సమాతరం గా నడుస్తూ..గతి తప్పి ఉన్మాదులుగా మారి.. నాశనం అయిపోతున్నారు. తప్పు వారిది కాదు..తల్లి దండ్రులది,మీడియాది.
తల్లిదండ్రులుగా మనలని మనం సంస్కరించుకుని బిడ్డలకి మంచి సంస్కారాన్ని నేర్పలేకపోవడం అనేది ఖచ్చితంగా వైఫల్యమే!
అందుకే నైతిక విలువలు లోపించిన యువతరాన్ని చూస్తున్నాం.ఆడ-మగ తేడానే లేదు.ఒక్కసారి..రవీంద్రుని కవీంద్రుని మాటలు గుర్తు తెచ్చుకుంటే...మనం తల్లిదండ్రులుగా ఎలా మెలగాలో.. తెలుస్తుంది."ఎక్కడైతే మనసు నిర్భయంగా ,శిరస్సు నిటారుగా ఉంటుందో .. ఎక్కడైతే విజ్ఞానం స్వేచ్చగా మనగల్గుతుందో.. ఎక్కడైతే అడ్డుగోడల అల్పత్వంతో..ఈ లోకం ముక్కలుచెక్కలు కాకుండా ఉంటుందో.. అటువంటి స్వాతంత్ర్య ధామంలోకి ఈ.. దివ్యదాత్రిని మేలుకొలుపు... మహాప్రభూ!అని.. వ్రాసారంటే..
పిల్లల పెంపకం పట్ల, విద్యావిధానాల పట్ల వారి దృకోణం ఎలా ఉందో.. కనీసం మనం అర్ధం చేసుకోగలితే చాలు.
కులం,మతం,అంతస్తుల బేరీజులు, వెనకబాటుతనంతో.. పాశ్చాత్య సంస్కృతి దిగుమతి తో.. విలాస జీవనంలో.. బ్రతుకుతూ..పిల్లకి అదే త్రోవ చూపుతూ..వాళ్ళ మనసులని వికశించ నీయకుండా చేస్తే.. కుహన సంస్కారంతో...పెరిగి పెద్దయి..వికృత మనస్తత్వంతో.. వాళ్లకి ఏం కావాలో తెలియని స్థితిలో.. కొట్టుకుంటున్నారు.
మూలాలు విశ్లేషించ కుండా అదుపు తప్పిన యువత తప్పు ని ఎత్తి చూపడం వలన తల్లితండ్రుల పాత్ర కప్పదాటు పద్దతిని.. అవలంబిస్తే .. ప్రపంచ దేశాలలోకి తలమానికంగా నిలవ గల్గిన యువత 2020 వచ్చేటప్పటికి లార్జెస్ట్ పోటాన్షియల్ స్టేట్ గా నిలవగల్గిన దేశం మత్తుమందుల మైకం లో,రోగగ్రస్త బతుకులతో..అవినీతి వలయంలో..అర్ధాయుషుల..యువతని మనం తయారు చేసుకుంటున్నాం .. ఖచ్చితంగా పెద్దలదే తప్పు..అని నేను చెప్పేదాన్నిఏమో!
ఏమైనా వాస్తవం మాత్రం ఇదే!పోటీలు పడి మరీ అమ్మాయిలు సమానత్వం సాదిస్తున్నారు.. మొబైల్ పోనులు,చాటింగ్‌లు,ప్రేమ పారాయణాలు..ఆనక మౌన ప్రదర్శనలు ..
ఏమిటో..ఈ.. యువత.. ఎన్ని ప్రజావేదికలు పెట్టి వాదించినా...నిజం ..నిప్పులాటిది.తప్పు మీదంటే మీదని తూర్పారబట్టుకోకండి.. జెమిని సాక్షిగా అసహ్యంగా ఉంది.
ఆ వేదికపై చెప్పేది చెబుతున్నది అదే.. ఓ"మాట.అంతే!

1 కామెంట్:
ఇవేళ యువతెలా ఉన్నారు, యువత తల్లిదండ్రులెలా ఉన్నారు అన్నదానిమీద మీ విశ్లేషణ చాలా బాగుంది! ఈ వ్యాసాన్ని పెద్దలూ, పిల్లలూ ఇద్దరూ చదవాలి! మీరెందుకు ఏదైనా పత్రికలో publish చెయ్యకూడదు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి