ఈ రోజు.. ఒక ఆసక్తికరమైన సంగతి విన్నాను .
వేయి పున్నములు..వేయి అమావాస్యలు.. చూడటం.. అన్న సంగతి. నేను ఇప్పటివరకు ఈ..విషయం వినలేదు. ఆలోచించి చూస్తే అదేం గొప్ప విషయమో.. క్రొత్త విషయమో..కాదు.
"సహస్ర చంద్ర ధర్శనం " అంటారు కదా! అదే!!
మన ఇంట్లో..పెద్దవాళ్ళు ఉంటె ఇలాటి సంగతులు..మనకి..ఎప్పుడో ఒకప్పుడు.. తెలుస్తుంటాయి.
కొంచెం విషాదం ఏమిటంటే.. ఈ.. విషయం తెలుసుకునేందుకు..వేయి పున్నములు,వేయి అమావాస్యలు.. చూసిన పెద్దాయన ..ఈ రోజు..మరణించారు. ఆయన ..మా అత్తమ్మకి..అన్నయ్య అవుతారు.
మరణించారని తెలిసాక ఉదయం నేను..కడసారి చూపు కొరకు వెళ్ళాను..
పోలవరపు చలపతిరావు గారు.. ఆయన పేరు. అభ్యుదయ భావాలు కల్గిన వ్యక్తి. పెనమలూరు లో..80 సంవత్సరాల క్రితం కట్టిన స్కూలో..చదువుకుని.. ఉద్యోగాలు చేయలేదు కానీ..పూర్వీకుల నుండి వచ్చిన భూమిని నమ్ముకుని.. వ్యవసాయం చేసుకుంటూ.. తన ముగ్గురు ఆడ పిల్లలని చదివించి ఆత్మ విశ్వాసం తో.. నిలబడే టట్టు చూసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు.. మనుమలు,మనుమరాండ్రు..సంపూర్ణ జీవితమును..అనుభవింఛి 85 .ఏళ్ళు.. లో.. వేయి పున్నములు..వేయి అమావాస్యలు కాంచి .ఈ మధ్యే.. ఆవిషయాన్ని అందరి కి ..చెపుతూ..వేడుక చేసుకున్నారు..అని చెపుతున్నారు. వింటూ..ఆయన వయసుని నెలలుని..భాగించి చూసాను..నిజమే..! ఈ..కాలం వాళ్ళు అలా..అన్ని ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకగాల్గుతారా?అనిపించింది.
ఆయన మామూలు వ్యక్తి అయితే ఈ పోస్ట్ వ్రాసి ఉండేదాన్ని కాదు. ..చాలా విశాల భావాలతో.. ..ఉండేవారు..స్వాతంత్ర సమరం కి..ప్రత్యక్ష సాక్షి...మహాత్మా గాంధీ గారు..పెనమలూరు వచ్చినప్పుడు.. వారి ఇంటికి దగ్గరలోనే..ఉన్నారు. అక్కడ ఒక భవనం ఉండేది. ఆ భవనం లో మహాత్ముడు ..విడిది చేసినందుకు గాను..ఆ భవనాన్ని.."గాంధీ ఘర్ " అంటారు.. ఆ భవనంలో..ఇప్పుడు.. ప్రైమరీ స్కూల్ నడుపుతున్నారు.
నేను ఎప్పుడు అయినా వెళ్ళినప్పుడు.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పేవారు. నెహ్రు-గాంధీ ఆలోచన విధానములు గురించి.. రేడియో..గురించి.. భారత్-రష్యా మైత్రి గురించి.. ఎంతో..విపులంగా .చెప్పేవారు. ఎప్పుడు రేడియో వింటూనో,పత్రికలూ చదువుకుంటూనో.. పిల్లలతో ..మాట్లాడుతూనో .. కాలం గడిపువారు. లక్షలు ఖరీదు పలికే..భూములు, స్థలాలు ఉన్నా.. కష్టపడి బ్రతకాలి అన్న ఉద్దేశ్యంతో .. పూర్వీకుల ఆస్తులని.. అలాగే నిలబెట్టుకుని.. ఆయన..సాదాగా బతికి.. పిల్లలని అలాగే బతకమని.. చెప్పడం.. అందరికి..నచ్చదేమో కానీ. అదే మంచిదని పిస్తుంది. ఆమ్మడం అంటూ..మొదలైతే.. కష్ట పడటం..మరచిపోవడం...ఈ తరం వంతు అయింది. కదా!.
ఆ పెద్దాయనలో..నాకు నచ్చిన విషయం ఏమంటే.. ఆయన తల్లిదండ్రులు కి..ఇచ్చిన మాట ప్రకారం..ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా.. ఎప్పుడో.. పెనమలూరు.. ఊరిలో..కట్టిన మొట్టమొదటి..డాబా ఇల్లుని..పాతిక సెంట్లు స్థలాన్ని.. అలాగే కాపాడుకుంటూ...వచ్చి..ఆ ఇంట్లోనే..ఆఖరి శ్వాస వదిలారు. నిజం చెప్పాలంటే..ఆ ఇంటికి వెళ్ళడానికి..నాకు ఏదోలా ఉండేది.. దొడ్డి నిండా గేదెలు.. పేడ వాసన, పట్టపగలు దోమలతో..సహవాసం ..పాతది..రంగురూపు లేని ఇల్లు.. ఆ ఇంటి నిండా ఎప్పుడు..జనం ..ఇలా ఉండేది. కానీ.. ఆ పెద్దాయనతో .. సంభాషణ నాకు చాలా ఇష్టంగా ఉండేది. నన్ను మెచ్చుకునే వారు కూడా..బాగా మాట్లాడతావు అమ్మా.. ఏ టాపిక్ అయినా అనర్ఘళం...అని మెచ్చుకునేవారు. మా పాప కోడలు చూడు..ఎంత బాగా మాట్లాడుతుందో..అని ఇంట్లో వాళ్ళని పిలిచి వినిపించేవారట. (అందుకనేమో !నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని)
అలా ..ఆయన గురించి ఓ..గౌరవ భావం.. ఉండిపోయింది. ఆయనని ఆఖరి చూపు చూసుకోవడానికి వీలు కానే కాని ఇద్దరు మనుమరాళ్ళు.. పది నిమిషములకి..ఒక సారి పోన్ చేస్తూ..భాధపడటం బాధ అనిపించింది..ఈ రోజే..దహన కార్యక్రమాలు..నిర్వహించారు. ఆ.. అమ్మాయిలు రావడానికి..వాళ్ళు ఉండేది..భారత దేశం కాదు..అమెరికా సంయుక్తరాష్ట్రాలు మరి. అదే మగపిల్లలైతే.. వాళ్ళు వచ్చే దాకా ఉంచడం తప్పేది కాదు.. అని వినబడ్డ మాటలు.. కొంచెం బాధ అనిపించాయి.. వారసులు..అన్న వివక్ష ఏమో! రక్త సంబంధీకుల మద్య ప్రేమ ఎవరికైనా ఉంటుంది. ఆయన ప్రభావం మాత్రం.. అందరి పై ఉండదు కదా....ఆ ఆడ పిల్లలు.. చనిపోయిన ఆ తాతయ్య కోసం ఎంత ఏడ్చి ఉంటారో! ప్చ్..పాపం అనిపించింది.
ఏ తరం వారి కైనా ..ముందు తరం వారి మాటలు.. అనుభవాలు..ముందు చూపు.. ఎంతో ఉపయోగకరం. నిబద్దత,సాధారణంగా ఉండటం,ఇచ్చిన మాట నిలుపుకోవడం,కష్టపడటం, వివేకం . ఇవన్నీ.. ఆ పెద్దయనలో.. మంచి లక్షణాలు.. అందుకే ..ఆయన .. సాధారణంగా కనబడుతూ.అసాధారణమైన వ్యక్య్హిగా మా మద్య మిగిలారు. వేయి పున్నములుని,వేయి అమావస్యలని సమంగా ఆస్వాదించారు. .ఆయన ఆత్మకి..శాంతి కలగాలని ప్రార్ధిస్తూ.. మంచి మనిషి.కి.. పాదాభివందనములతో ..ఈ పోస్ట్ .
1 కామెంట్:
ముందుగా మీ పెద్దనాన్నగారి మరణాని సంతాపాలు!
"ఏ తరం వారి కైనా ..ముందు తరం వారి మాటలు.. అనుభవాలు..ముందు చూపు.. ఎంతో ఉపయోగకరం."
అందుకేనేమో, అంపశయ్య మీదున్న భీష్ముని వద్దకు ధర్మజున్ని తీసుకెళ్ళి "తాతా నీ మనవడికి ధర్మ సిద్ధాంతాలు బోధించు" అంటాడు కృష్ణుడు. అప్పుడు భీష్ముడు "కృష్ణా, జగత్గురువు నువ్వుండగా నేనా వీడి పాఠాలు నేర్పవలసింది?" అని అడుగుతాడు.
"తాతా, నేను జగత్గురువే కావచ్చు అయినా మీ అనుభవ పాఠాలకు సరి రాదు నేను చెప్పే పాఠం"అంటాడు భారతంలో కృష్ణుడు.
కృష్ణుడిలంటీ జగత్గురువుకూడా పెద్దల మాటలకు ఎంత విలువనిచ్చాడో అన్న విషయాన్ని స్ట్రెస్ చేస్తుంది భారతం. ఈ తరం పిల్లలు తెలుసుకోవలసింది ఇది. అవ్వా, తాతలతో సమయం గడపడం ఎంత అదృష్టమో అన్నది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి