9, జులై 2011, శనివారం

తెల్లారింది.. లేగండో..సిరివెన్నెల సాహిత్యం,గళం




తెల్లారింది  లేగండో ..

పాట  సాహిత్యం :

తెల్లారింది.. లేగండో .. కొక్కొరో కో..
మంచాలింక  దిగండో..కొక్కొరో కో..
పాములాంటి చీకటి  పడగ  దించి పోయింది
భయం లేదు   ఒయం లేదు నిదుర ముసుగు తీయండి.
చావులాటి  సీకటి  చూరు దాటి పోయింది
.భయం లేదు ఒయం లేదు చాపలు చుట్టేయండి.
ముడుసుకున్న రెక్కలిప్పి పిట్ట  చెట్టు ఇడిసింది
మూసుకున్న రెక్క లిరిసి  చూపులెగారనీయండి... (తెల్లారింది)

చురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
చులకనై పోయింది లోకం చీకటికి (చు)
కునుకు వచ్చి తూలిందా చల్లబడ్డ  దీపం
ఎనక రెచ్చిపోయింది  అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా చూసే కన్ను
ముసురుకో దాకా మైకం మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి
కాంతులు ఎల్లువ  గంతులు వేసి..(తెల్లారింది)

ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి  చూసిందా సూరీడు చూపుల బాణం
 కాలి బూదిధైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో  నిలబడుతుంద చిక్కని పాపాల నీడ

చెమట బొట్టు చమురుగా సూరెడుని  వెలిగిద్దాం
వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గి పూలు పూయిద్దాం(చెమట)
వేకువ చెట్టుల కత్తులు  దూసి
రేతిరి మంచును ముద్దలు చేసి  (తెల్లారింది)
ఇది సిరివెన్నెల సాహిత్యం,గళం..రెండూ.. కలిపి..ఒక పాట.

కళ్ళు లేని వారికే కాదు..కళ్ళు ఉన్నవారికి.. కూడా.. ఓ..వెలుగుపూల బాట.
కళ్ళు chiత్రానికి..ఈ..పాట ను వ్రాసారు. జానపద గీతం లా అనిపిస్తుంది. ఎస్.పి.బాలసుబ్ర మణ్యం గారు..ఈ చిత్రానికి..సంగీతం అందించారు.1988 లో..ఈ చిత్రం వచ్చింది.

సిరివెన్నెల గురించి తెలియడానికి ఈ పాట సాహిత్యం ఒక్కటి చాలు.అంతకు ముందు సిరివెన్నెల గురించి తెలిసిన వారికి ఇప్పుడు వారిపై.. ఈ పాట విన్నాక మరింత అభిమానం పెరుగుతుంధి సాహిత్యపరంగా ఈ పాట చాలా గొప్ప పాట సాహిత్యం వింటూ లిరిక్స్ వ్రాసుకున్నాను.వివరణమరొకసారి.

  

1 కామెంట్‌:

ahmisaran చెప్పారు...

గతం లో చాలా వేకువల్లో నా మిత్రులకి నేనిచ్చే SMS ఈ పాట...
మొదట్లో అర్ధం కాక తన్నుకునేవాళ్ళు
తర్వాతర్వాత వీడింతే మారడు అని చదవటం కూడా మా(రే)నేశారు,
కాలం కట్టిన గంతలు
కలం పట్టిన చేతులే విప్పాలి
అయన (సివెసిరాశా) ముట్టిన కాగితాలు
విరిసిన పద సౌరభాలు !!