నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు అసలే కరంట్ కోత. రెండవ వేసవి కాలం తలపిస్తున్న రోజులు. కాస్త గాలి పోసుకుందామని దినపత్రిక చేతిలో పట్టుకుని వరండాలోకి వచ్చాను.
ఇంటిముందు నుండి "సోది చెపుతానమ్మ సోది" అని సాగదీసి పలుకుతూ.. రిపీట్ గా భలే రిధమిక్ గా అనుకుంటూ వెళుతుంది సోది అమ్మి. వెళుతున్న ఆమె వైపు నేను ఆసక్తిగా చూడటం గమనించి.. సోది చెబుతాను బిడ్డా!రమ్మంటావా? అనడిగింది. ఉహు..వద్దు ! తల అడ్డంగా తిప్పుతూ అన్నాను. ఆమె ముందుకు కదిలింది.

మా చిన్నప్పుడు సంగతి గుర్తుకు వచ్చింది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా పందిట్లో బిచాణా పెట్టి మరీ అమ్మలక్కలు సోది చెప్పించుకునేవాళ్ళు. నమ్మనివాళ్ళు నవ్వుకోవడం,నమ్మినవాళ్ళు సంతోష పడటమో, దిగులుపడటమో గుర్తుకొచ్చింది.
సాధారణంగా పల్లెలలో గేదె సరిగ్గా పాలు ఇవ్వకపోయినా, బుడ్డోడికి జ్వరం తగిలినా సోది అడగడం సోది అమ్మి ఏం చెప్పిందో అలాగే చెప్పినట్లు చేయడం చేసేవారు.
"అమ్మ కూడా అప్పుడప్పుడు సోది దగ్గర కూర్చునేది. ఆమె సోదిలోకి ఎప్పుడూ.. మా చనిపోయిన మేనత్త వచ్చి ఆమెని మర్చిపోయారని పండగకి చీర కూడా పెట్టడంలేదని ఆక్షేపించేది.
అప్పుడు అమ్మ ఒక కొత్త చీర కొనడం ఆమె పేరిట దేవుడి దగ్గర పెట్టడం తర్వాత ఎవరైనా ముత్తయిదవ కి ఆ చీర ఇవ్వడం చేసేది.
ఒకోసారి మా నాన్న గారి మేనత్త సోదిలోకి వచ్చేది. ఆమె వచ్చిందంటే ఏడుపుతోనే మొదలు. మా నానమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. ఐదుగురు అన్నదమ్ముల మద్య ఒకే ఆడపడుచు. నూట పాతిక ఎకరాల భూస్వాముల కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగి మా ఊరిలోనే మరో గొప్పింటి కోడలిగా వెళ్లి .కట్న కానుకలు పేచీలవల్ల బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుందట. ఆమె సోదిలోకి వస్తే అందరూ భయపడేవారు.
నాకు అప్పుడప్పుడే..జ్ఞానం వికసించి కాస్త హేతుబద్దమైన ఆలోచనలు పుట్టుకొచ్చి .. "అమ్మా! నిజంగా చనిపోయినవారు అలా సోదిలోకి వస్తారా? వట్టిదే ! నువ్వు నమ్మబాకు, ఆ సోది అమ్మి నోటికొచ్చింది ఏదో చెపుతుంది.. అంతే! అనేదాన్ని. నమ్మడం నమ్మకపోవడం కన్నా..ఆ సోదమ్మికి ఓ నాలుగు రూపాయలు, ఒక చాటెడు నూకలు ఇస్తే ఏం పోద్దిలే! అనేది అమ్మ.

నానమ్మ అయితే.. సాక్షాత్ కలియుగదైవం వెంకటేశ్వర స్వామే ఎరుకల రూపంలో వచ్చి జరగబోయే దాన్ని సోది రూపంలో చెప్పి వెళ్ళాడట. మనకైతే కుల దైవం వస్తాడు. ఇప్పుడు నువ్వలా అనకూడదు, తప్పు అనేది. లెంపలు వేసుకో అనేది కూడా ! సరే, పెద్దవాళ్లకి ఎదురు చెప్పలేం కదా! లెంపలేసుకోకపోయినా మౌనంగా ఉండేదాన్ని.
ఆ సోది అమ్మి చెప్పే మాటలు వింటూ.. ఎవరికి ఏం చెప్పిందా..? వాళ్ళకి చెప్పిందే ఇంకొకరికి ఇంకో రూపంలో..ఎలా చెపుతుందా? గట్టిగా అడిగితే టక్కున చేతిలో మీటుతూ ఉన్న సోది బుర్ర (గుమ్మడికాయ బుర్ర) కింద విసిరి పడేసి పలాయన వాదం చేసేది. డబ్బు దశకం ముందే ఇచ్చేసే వాళ్ళు కాబట్టి మరో మాటకి అవకాశం ఉండేది కాదు.
మా పక్కింటి పిన్నో.. ఎదిరింటి అత్తో.. మేము అనుకున్నది రాలేదు.. సోది దండగ అని తిట్టుకునే వాళ్ళు. అలా తిడితే పాపం తగుల్తుంది, కులదైవం కోప్పడతాడు అని అమాయకంగా ముఖం పెట్టి చురకవేస్తూ హెచ్చరించేదాన్ని. పిల్లలు చదువుకుని చెడిపోతున్నారు..అని దులపరించుకుని వెళ్ళేవారు. ఆ కాసేపూ.. మా పందిరి క్రింద తుఫాను వచ్చి వెలిసినట్టు ఉండేది.

ఇలా నేను ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంటూనే ఉన్నాను. అంతలో మళ్ళీ రిటన్ లో ఇటే వస్తుంది సోది అమ్మి.
తరాలు మారాయి కదా సోది ఏ విదంగా చెపుతుందో.. చూద్దాం అని ఆసక్తి కలిగి సోది చెప్పాలి రామ్మా! అని పిలిచాను.
ఆమె లోపలి వచ్చి కాసిని చల్లని మంచినీళ్ళు అడిగి ఇప్పించుకుని తాగి వరండాలో ఫ్యాన్ కింద తీరిగ్గా కూర్చుంది . మా ఇంటిలో చేట అటకెక్కి కూర్చుంది. మా పక్కింట్లో చేట అడిగి తీసుకుని ఏం పుచ్చుకుంటావు? అడిగాను. పాతిక రూపాయలమ్మా..అంది. రోజుకి ఎన్ని సోదిలు చెబుతావ్ ? అని అడిగి ఆదాయం లెక్క వేయాలనుకుని. మా నానమ్మ మాట తప్పు అలా అడగకూడదు అని చెప్పింది గుర్తుకొచ్చి ఆ చేటలో బియ్యం ఒక కేజీ కి తక్కువ కాకుండా పోస్తూ ఇప్పుడు ఈ సోది అవసరమా? ముప్పయి అయిదు రూపాయల ఖరీదైన బియ్యం ఓ పాతిక రూపాయల ఖర్చు అనుకుంటూనే.. చేట బయటకి తెచ్చి పాతిక రూపాయలు చేటలో పెట్టి ఇంతలోనే ఎన్న చేట ఆలీ డైలాగ్స్ గుర్తుకొచ్చి నవ్వుకుంటూ..
కాస్త పసుపు-కుంకుమ , వక్క పెట్టి.. అమ్మ,నానమ్మ పెట్టిన దణ్ణాలని మనసులో గుర్తు తెచ్చుకుంటూ ఆ చేటని తాకుతూ దణ్ణం పెట్టుకున్నాను.

సోది అమ్మి.. సోది బుర్రని మీటుతూ.. సోది మొదలెట్టింది..
మధుర మీనాక్షి పలుకు
కంచి కామాక్షి పలుకు
బెజవాడ కనక దుర్గమ్మ పలుకు
జొన్నవాడ కామాక్షమ్మ పలుకు
శ్రీ శైల భ్రమరామ్మ పలుకు
సకల దేవతలు పలుకు..
అమ్మ పలక మన్న పలుకు చెప్పటానికే వచ్చా
అడిగింది అడిగినట్లు చెపుతా.. అడగంది అడిగినట్లు చెపుతా..
మాట చెప్పి పోదామనే వచ్చినా బిడ్డా..
అమ్మ పై నమ్మకం పెట్టుకుని అడుగు..
జరగబోయేది చెపుతా జరిగింది చెపుతా.. వినుకోయే తల్లి..
అని నా ఎడమ చేయి అందుకుని..
నీ ఎడమ భుజం తాకిందంటే పుట్టింటి సోది అడుగుతున్నవని అర్ధం,కుడి భుజం తాకిందంటే మెట్టినింటి సోది అని అర్ధం.
నేను చెపుతున్న సోది ఏమంటే..
అంటూ.. నా పుర చేయిని ఎడమ భుజం తాకించి.. ఈ సోది అడుగుతున్నవే బిడ్డా.. ! ఎందుకడుగుతున్నవంటే.. ఈ దినాలు వచ్చిన్నయంటే నన్ను తల్చుకుని కన్నీరు మున్నీరు అవుతావే బిడ్డా!అంది..
నేనేమి తలచుకోవడం లేదు ఎవరు నువ్వు.. ? అడిగాను.
ఎవరని అడుగుతావేటి బిడ్డా.. నన్ను మర్సిపోయావా? ఈ సోది చెప్పేటి చెయ్యి మగవాళ్ళయితే గడ్డం అంటుతుంది. ఆడవాళ్ళైతే మొఖాన ఉన్న బొట్టు అంటుకుంటుంది. నేను చెప్పేటి ఈసోది.. ఆడ కూతురి సోది అంటూ నా నుదుట బొట్టుని అంటించింది.
అయితే నువ్వు ఆడమనిషివా? అయితే నాకు ఏమి అవుతావు..అన్నాను.. నిజంగా ఆ టైం లో నేను పక్కాగా మా అమ్మ సోది అమ్మిని ఎలా ప్రశ్నించేదో అలాగే గుర్తుకు తెచ్చుకుని మరీ అడిగాను అన్నమాట.
ఏమవుతావంటే ఏమి చెప్పెనే బిడ్డా!నువ్వు నాకు బాగా కావల్సినదానివి, నువ్వు ఏటికి ఎదురీదుతున్నావ్ ? నీకు కష్టం వచ్చినప్పు డల్లా నేను నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను.నీకు నీ దారిలో ఎదురేలేదు బిడ్డా! అన్నీ బాగానే ఉన్నా నన్ను మరసి పోయావే బిడ్డా ..మీ పుట్టుకకి కారణం అయిన వారిని పట్టించుకోవడం లేదే బిడ్డా అంది..
“నువ్వు ఎవరు ఎందుకు అలా అంటున్నావ్? నేను ఏటికి ఎదురీదడం లేదు..ఎవరిని పట్టించుకోకుండా ఉండనూ లేదు.. అబద్దం చేపుతున్నావ్ “అన్నాను వాదనగా.
“నేను నిజమే చెపుతున్నా.. బిడ్డా ! నీ ఇంటి ఇలవేలుపు చెపుతున్నాను బిడ్డా!”
“ఎవరు నా ఇంటి ఇలవేలుపు” ..మళ్ళీ ప్రశ్న.
“అడిగిందే అడుగుతున్నావ్? చెప్పింది వినాలి..బిడ్డా ! “
“నీ ఇంటి ఇలవేలుపంటే.. ఆ ముక్కంటి దేవుడే బిడ్డా, ఇది కూడా అబద్దమంటావా? నేను చెప్పింది ఇనుకుని జాగ్రత్త పడాలే బిడ్డా! ఆ శ్రీశైల మల్లికార్జున్డే పలికిస్తా ఉండే, నమ్మవే బిడ్డా! “
నాకు కాస్త కాదు.. బాగానే నమ్మకమే కలిగింది..
“ఏం చెప్పలనుకున్నావు? ఏం చేయాలి నేను.?” అన్నాను.
“నీ బిడ్డని చూసుకున్నట్లే నీకు జనమ ఇచ్చినవాల్లని బాగా చూడాలే బిడ్డా! అత్తమామాలని బాగా చూడాలి బిడ్డా” అంది. అన్నీ మంచి మాటలే చెపుతుంది అనుకున్నాను.
“నీ పాడి పంట నీ బిడ్డల బాగోగులు అన్నీ నేను చూస్తూ ఉంటాను నువ్వు మాత్రం నన్ను మర్సిపోకుండా.. పండగకి పబ్బనికి మాత్రమే కాదు రోజు గురుతు ఉంచుకుంటానే ఉండావ్. నాకు సంతోషంగానే ఉంది బిడ్డా.. నీ తోడబుట్టిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి బిడ్డా.. నీ తోడబుట్టిన వాళ్లకి కోపం ఎక్కువ. నువ్వే సర్దుకుని ఉండాలే బిడ్డా” అని చెపుతూ ..నా ముఖం వంకే చూస్తూ.. సోది పరిసమాప్తి చేద్దామని చూస్తున్నట్లుంది.
“అన్నీ బాగానే ఉన్నాయి, ఇంతకి నువ్వు ఎవరు..నాకేమవుతావు?” అడిగాను మళ్ళీ..
ఈ సారి కోపంగా “ఎన్ని సార్లు అడుగుతావే బిడ్డా! నేను నిన్ను కన్నకడుపే బిడ్డా” అంటూ నా ఉదర భాగాన్ని తాకి చూపి టక్కున సోది బుర్ర కింద పెట్టేసింది. మెల్లగా అన్నీ సర్దుకుని బయలుదేరింది.
ఇంక నాకు మాటలు లేవు.. కళ్ళు రెండు సెలయేరులయ్యాయి. కారుమబ్బులు కరిగినట్లు ధారాపాతంగా కన్నీటి వర్షం.
సోది అమ్మి సోది ని నమ్మానో లేదో తెలియదు కానీ..
అమ్మ గుర్తుకు వచ్చింది.అడుగడునా ఆమె ప్రేమ గుర్తుకు వచ్చింది. ఆమె వేసిన బాట గుర్తుకు వచ్చింది. మా కోసం పడిన కష్టాలు గుర్తుకు వచ్చాయి.మా కోసం పడిన తపన గుర్తుకు వచ్చాయి.
ఈ నెలలోనే అమ్మ మాకు దూరమైన రోజు.. (అక్టోబర్ రెండు ) మా నోటి కి "అమ్మా" అనే పిలుపుకి తాళం పడిన రోజు. అన్నీ గుర్తుకు వచ్చాయి.లోపలి వచ్చి తనివితీరా అమ్మని తల్చుకుని, అమ్మ ప్రేమని తల్చుకుని ఏడ్చాను.
కాసేపటకి కొంచెం గిల్టీ ఫీలింగ్ తో.. నాన్నకి ఫోన్ చేసి పలకరించాను. ఇక్కడిరా నాన్నా !..ఒక పది రోజులు ఉండి వెళ్ళవచ్చు. అని పిలిచాను.
అమ్మ పోయాక ఆయన అక్కడే ఉన్నారు. పుట్టి పెరిగిన వూరు వదిలి ఉండలేనంటూ ఒక వేళ వచ్చినా.. ఒక పూటకే చెప్పుల్లో కాళ్ళు పెడతారు. చూస్తూనే వారించకుండా మేము మౌనం వహిస్తాం. అది కూడా ఎస్కేపిజం అనుకుంటాను.

ఒక ఆసక్తి + ఒక సరదా కలిపి..అమ్మ జ్ఞాపకాల ఊటలో..ముంచివేసింది. ఇది మాత్రం నిజం. అమ్మ గురించి ఇంకొన్ని పోస్ట్ లలో వ్రాస్తాను. ఈ కవిత అమ్మ గురించి వ్రాసుకున్నదే.
సోదమ్మి మాత్రం పొట్టకూటికోసం నాలుగు సరిపడే మాటలు చెప్పి ..
చెప్పి చెప్పకుండా, అర్ధం అయి కానట్టు చెప్పు కుంటూ..నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ.. జనాన్ని మభ్య పెడుతూ ఉండవచ్చు.
వాళ్ళు ఎక్కడో..ఏదో ఒక మాట అదీ.. మనకి అన్వనయిన్చుకునేలా మాటలు చెప్పి వెళుతుంటారు.. కానీ పెద్ద పెద్ద వాళ్ళు స్వామీజీలు వేదాలు, ఉపనిషత్తులు,భారత,భాగవతాలు ఉదహరిస్తూ మంచి మాటలు చెప్పినట్లు చెప్పి మనలని వాళ్ళ మాయా జాలంలోకి లాక్కుని కట్టలు కట్టలు డబ్బులు గుంజే రకం అయితే కాదుగా.. అనుకుంటూ.. నిట్టూర్చాను.

4 కామెంట్లు:
సోది బాఫుంది వనజ గారూ. చిన్ననాటి కబుర్లు చదవగా నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. మీ కుటుంబ చరిత్ర బాగుంది. మధ్యలో కొంత కామెడీ టచ్ కూడా ఇచ్చారు టపాలో :)
చివర్లో అమ్మ జ్ఞాపకాలూ, అమ్మకవితా... బాగున్నాయి!
ఎంద పరంద ఇంద చేట? మనసిలాయిల్లియో? మనసుకి హత్తుకునేలా ఉంది ఈ ఆఖరి వాక్యాలు మాత్రం! ఈ సోది అమ్మేవాళ్ళు నేటికీ వీధుల్లోకి వస్తున్నారంటే ఆశ్చర్యం! మా ఊరిలో గోదారి గట్టున తప్ప వీధిలోకి గత మూడేళ్ళుగా రావడం లేదు!
వనజగారూ సోది చెప్పే వాళ్ళు ఇంకా కనిపిస్తున్నారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అమ్మ గురించి మీరు వ్రాసుకున్న వాక్యాలు కదిలించాయి. నిజమే వనజగారూ అమ్మకు దూరమైన బిడ్డ హృదయం అమ్మ కోసం రోదిస్తూనే ఉంటుంది కదూ..
భాస్కర్ గారు ధన్యవాదములు. బాల్యం యెవరికైనా మధుర జ్ఞాపకమే కదా!. పంచుకొవదానికి చాలానే ఉన్నాయి. మన మనసు పొరల్లొకి తొంగి చూసుకుంటే ఎప్పుడు మదురమే..అప్పుడప్పుడు విషాదం కూడా.
& రసజ్ఞా .. ధన్యవాదములు.& జ్యొతిర్మయి గారు మీకును ధన్యవాదములు.మా వూరు విజయవాడ లొ కలిసి పోయిఉంటుంది. గ్లోబలైజేషన్ లొ కూడా ఇక్కడ చాలా మారలేదు.ఇక్కడ తరచూ సోది చెప్పేవాళ్లు కనబడతారు.అయితే కొన్ని విపరీతమైన మార్పులు వచ్చాయి అనుకోండి. మార్పుల మద్య బ్రతికేస్తూ ఇలా.. స్పందించినందుకు ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి