ఆడ పిల్లలు మెకానిక్ కోర్సెస్ చదివి ఏం చేస్తారు? అని చాలా మంది యెగతాళి చేస్తారు.
అది ఒకప్పటి మాట.
నేటి కాలం లో మెకానికల్,ఆటో మొబైల్ బ్రాంచ్ లని కోరి తీసుకుని ఇష్టంగా చదువుతున్న ఆమ్మాయిలని చూస్తున్నాం.
పురుషులకి మాత్రమే పరిమితమైన రంగాలలో స్త్రీలు ప్రవేశించడం చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభం అయింది.
ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పబోతూ ఈ ఉపోద్ఘాతం అన్నమాట.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఒక యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి విదేశాలకి వెళ్లి అక్కడ కంప్యుటర్ సైన్స్ లో డాక్టరేట్ సాధించాలని ఆశయం తో ఉంది.
అప్పటికి ఆమె చదువుతున్న తరగతిలో ఒకే ఒక స్త్రీ ఆమె.
ఒక రోజు నోటీస్ బోర్డ్లో ఒక ఉద్యోగ ప్రకటన కనిపించింది.
టెల్కో ఆటో మొబైల్ సంస్థ జారీ చేసిన ఆ ప్రకటన లో యువకులు,తెలివికలవారు,కష్టించి పనిచేసేవాళ్ళు,అత్యున్నత విద్యా ప్రమాణ నేపధ్యం ఉన్న ఇంజినీర్లు కావలెను. స్త్రీ అభ్యర్ధులు దరఖాస్తు పంపనవసరం లేదు అని చదివిన ఆమెకి ఉవెత్తున కోపం ముంచుకు వచ్చింది. స్త్రీ అభ్యర్ధులు ఎందుకు అర్హులు కాదో తెలుసుకోవాలనుకుని ఆ విషయాన్ని సవాల్ గా తీసుకుంది. ఆ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుని నిర్ణయించుకుని
టాటా గ్రూప్ అధిపతి జే.ఆర్.డి.టాటా. గారికి ఓ పోస్ట్ కార్డు పై ఇలా వ్రాసి పోస్ట్ చేసింది.
"భారత దేశంలో టాటాలు ఎన్నిటికో ఆధ్యులు. ఇనుము-ఉక్కుకర్మాగారం,రసాయనాలు,వస్త్రాలు,రైలింజనాలు,ఇంకా అనేక పరిశ్రమలు స్తాపించారు. ఉన్నత విద్య కోసం ఇనిస్టి ట్యూషన్స్ ఎన్నో స్తాపించారు. నా అదృష్టం కొద్ది నేను అక్కడే చదువుకున్నాను. అలాంటి మీరు స్త్రీ-పురుషుల మధ్య వివక్షని మీ కంపెనీలో పాటిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది".అని వ్రాసి పోస్ట్ చేసారు.
పదిరోజులకి ఆమెకి ఓ టెలిగ్రాం వచ్చింది. టెల్కో పూనే లో మీరు ఇంటర్వ్యూ కి హాజరు కావాలని. ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమెకి ఆ ఉద్యోగం లభించింది.టెల్కో ప్లోర్ లో పని జేసిన మొట్టమొదటి మహిళ ఆమె నని చెపాల్సిన పనిలేదు కదా!
కొన్ని వందల ఉత్తరాలలో ఒక పోస్ట్ కార్డ్ కి విలువనిచ్చిన వ్యక్తీ ఓ ప్రముఖ వ్యక్తితో మాట్లాడింది కూడా! ఆయన అప్రో జే.ఆర్.డి.టాటా. (అప్రో అనేది గుజరాతీ పదం. అప్రో..అంటే "మన" అని అర్ధం.)
ఆమెకి ఓ రోజు రాత్రి పోద్దుపోయిన తర్వాత ఆమె భర్త వచ్చి ఆమెతో కలసి వెళ్ళేవరకు ఆమెకి రక్షణగా నిలబడ్డారు. అలాగే ఆమె 1982 లో టెల్కో ఉద్యోగం కి రాజీ చేసిన రోజు అప్రో జే.ఆర్.డి.టాటా తో మాట్లాడింది.
'ఇప్పుడు ఏం చేద్దామనుకున్తున్నావ్ మిసెస్ కులకర్ణీ"!? అని అడిగారు.
అప్పుడు ఆమె నా భర్త ఇన్ఫోసిస్ కంపెనీ ప్రారంభిస్తున్నారు. నేను పూనే కి మారాలి అని చెప్పారు ఆమె.
ఇప్పుడు అర్ధం అయిందా!? ఆమె సుధా కులకర్ణి. (సుధా నారాయణ మూర్తి or సుధా మూర్తి)
తర్వాత ఇన్ప్ఫోసిస్ కంపెనీ పురోగమన వృద్దిని ఆయన చూడాలని ఆమె కోరుకుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. కానీ ప్రతి రోజు ఆమె తన ఆఫీస్ లో అడుగుపెట్టగానే అప్రో ఫోటో ని చూసి నమస్కరించుకుంటుంది.
ఈనాడు దేశంలో ఎంతో మంది ఆడపిల్లలు పురుషులతో సమానంగా ఉన్నారంటే అది వారు వేసిన బాటే కదా!
ఈ స్పూర్తికరమైన విషయం ప్రస్తుతం ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరంలో పాఠ్యభాగంగా ఉంది.
అలాగే ఆమె చెప్పిన ఎన్నో విలువైన విషయాలు" How I taught My Grand Mother.". అనే పుస్తకంలో కథలుగా చదువుకోవచ్చు. తెలుగులో "అమ్మమ్మచదువు " పుస్తకంలో చదవవచ్చు.
తెలుగు అనువాదం:ద్వారక, అలకనంద ప్రచురణలు. తప్పక చదవండి.
10 కామెంట్‌లు:
వనజగారూ ఆవిడ పుస్తకాలు చాలా చదివానండీ..అమ్మమ్మ చదువు చాలా మంచి పుస్తకం.
మీకసలు ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయి అండి?Thanks for sharing the information about Sudha gaaru and the book.
Good,Inspiring post!! such great people life stories will help to build strong personality and Individuality.
Thanks
Madhu.
Good Inspiring post Vanaja Garu..
Thanks.
madhu
మంచి విషయాలు చెప్పారు. ఎవ్వరూ టచ్ చేయని
ముఖ్య విషయాలను అందిస్తున్నందుకు అభినందనలు!
INSPIRING
Good sharing Vanaja garu
వనజ గారు మంచి విషయం తెలియ పరచినారు.. ధన్యవాదములు...
ఆమె మహిళలకు స్పూర్తి ప్రదాత!ప్రస్తుతం ఆమె మంచి రచయిత మరియు కేవలం భర్త కోసం గృహానికే పరిమితం అయి పిల్లలను చూసుకుంటూ(ఇది బార్యాభార్తలమధ్య ఒప్పందం అట )రచయితగా ఎదిగిన మానవతాముర్తి.అన్ని వేలకోట్లు ఆస్తి వున్నా ఒక చిన్న ఇంట్లో వుంటూ తన ఇంటి అవసరాలు తనేచూసు కుంటూ బజారు కి వెళ్లి అన్ని తెచ్చుకుంటుందట !ఇవన్ని ఆమె గురించి వచ్చిన వ్యాసాలలోనివి .వారిది అన్యోన్య దాంపత్యం.మంచి విషయాన్ని ప్రస్తావించారు.
జ్యోతిర్మయి గారు .. అవునండీ! మంచి స్పూర్తికరమైన వ్యక్తి. మంచి రచనలు చేసారు ఆవిడ . స్పందించి వ్యాఖ్య చేసినందుకు ధన్యవాదములు.
@ జలతారు వెన్నెల గారు:) ధన్యవాదములు.
@ కాయల నాగేంద్ర గారు ధన్యవాదములు.
@ మధు గారు ధన్యవాదములు.
@పురాణపండ ఫణి గారు..ధన్యవాదములు.
@శేఖర్ గారు ధన్యవాదములు.
@ప్రిన్స్ :) బాలు గారు..ధన్యవాదములు.
@రవి శేఖర్ గారు.. ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి