16, జూన్ 2016, గురువారం

పండుగ అంటే ..సిరివెన్నెల మాట - పాట


తెలుగు సినీ సాహిత్యంలో గొప్ప సాహిత్యం అందించిన వారిలో "సిరివెన్నెల" గారిది ప్రత్యేక శైలి


ఒక పాటని విని ..ఆ పాట లో భావాన్ని అర్ధం చేసుకుంటే...కొంతైనా మానసిక వికాసం కలుగుతుంది.


"'పదుగురి సౌఖ్యం కోరే దినమే పండుగ కాదా ? అని రుద్రవీణ చిత్రం లో పాటలో చెప్పినా..

"పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైనా పెంచలేని ఎడారి కాదా? అని అల్లుడుగారు చిత్రంలో పాటలో చెప్పినా..


మనిషి తత్వం మనసు తనం కనబడాలంటే..మన ఆలోచనా విధానం లో మార్పు రావాలని చెపుతూ..


పాటైనా సరే సాంఘిక ప్రయోజనం ని ఆశిస్తూ..ఆలోచింప జేయాలనే ఆకాంక్షతో.. సిరివెన్నెల గారు వ్రాసిన పాటలు అన్ని మేలేన్నిక కలవే!


కొండంత భావాన్ని గుప్పెడు పదాలలో గుప్పించి వ్రాయడం బహుశా వారికే సాటి ఏమో!


నేను ఎప్పుడో ఎక్కడో చదివిన ..వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి.


"మనమెంత  ఎత్తుకు వెళితే మనచూపు  అంత  విశాలమవుతుంది.

 మన చూపు ఎంత విశాలమయితే మన భావన అంత బలంగా ఉంటుంది

భావనలు ఎంత బలంగా ఉంటే వ్యక్తీకరణ అంత స్పష్టంగా ఉంటుంది

వ్యక్తీకరణలో  స్పష్టత ఏర్పడిన కొలదీ  రచయితకి  సమాజానికీ  అంతరంగిక బంధం మరింత బలీయమవుతుంది 

 వ్యక్తుల ఆచరణ పరస్పర ప్రేరక మవుతుంది."


ఖచ్చితంగా ..సిరివెన్నెల గారి పాటలు చూసినప్పుడు నాకు పై వాక్యాలు కి సరిపోతుంది అనుకుంటాను.


ఇక్కడ ఒక విషయం చెప్పదలచాను.


సిరివెన్నెల గారి భావ సంపద ఎంత ఘనమైనదో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు


వారి ప్రతి..మాట, ప్రతి పాట విన్న,చూసిన శ్రోతకి హృదయానికి హత్తుకుని పోతాయి.


ఒక సందర్భాన్ని వారు చెప్పిన కోణంలో మనం చూడటం నేర్చుకుంటే.. మన లో బూజు పట్టిన భావాలు అన్ని దులిపి పారేసుకున్నట్లే!


ఇటీవల సిరివెన్నెల గారిని, వారి తనయుడు ని ఆతిధులుగా పిలిచి "ఈ టి వి " వారు" జీన్స్" అనే గేం షో నిర్వహించారు.


ఆ కార్యక్రమంలో ..సిరివెన్నెల గారిని ఒక పాట పాడమని కోరారు.


అప్పుడు వారు పాడిన పాట..


పండుగ అంటే ..


ఏమిటో వారి పాటలో చూడండి.


పండుగ అంటే ఫలానా రోజంటే ..

తక్కిన రోజులు అన్ని బరువుగా మోసున్నామంతే


బంధువు లెవరంటే ఫలానా వాళ్ళంటే

పక్కనే ఎందరు ఉన్నా ఒంటరి వాళ్ళం అయినట్టే


పంచాంగం చెపితేగాని పండుగ రానందా?

మంచి ముహూర్తం కాదని గుండెల సవ్వడి ఆగిందా


ఆకురాలే కొమ్మల కోసం ఆమని వస్తుంది

ఆశలు రాని మనసుంటే ప్రతి రోజు అలాంటిది


పెదవులపై నవ్వులు పూస్తే అదే చిత్రమవుతుంది

మది ముంగిట ముగ్గులు వేసే శాంతి పేరే సంక్రాతి


ప్రత్యేకంగా బంధువులు వచ్చే రోజు ఒకటి ఉంటుందా?

చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా?


ఒకటి రెండంటూ విడిగా లెక్కడితే

తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడు

అంకెలు ఎన్నంటే పక్కన నిలబెడుతూ

కలుపుకు పోతుంటే లేక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే


నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే

కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే


నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే

ప్రపంచ జనాభా మొత్తం కలిపితే

మనిషి తనం ఒకటే ..మనిషి తనం ఒకటే!


ఈ పాటలో కొంత భాగం "చక్రం" చిత్రం ..లో రంగేళీ హోలీ హంగామా కేళీ ..అనే పాటలో చూడవచ్చు.


8 కామెంట్‌లు:

శశి కళ చెప్పారు...

"ఎంత ఎత్తుకు వెళితే అంతా చూపు విశాలమవుతుంది.
చూపు ఎంత విశాలం అయితే భావన అంత బలంగా ఉంటుంది
యెంత చక్కటి వాక్యాలు.యెంత బాగా వ్రాసారు.
సిరి వెన్నెల గారు మీకు హ్యాట్స్ ఆఫ్

జలతారు వెన్నెల చెప్పారు...

సిరివెన్నెల గారి పాట పండుగ అంటే నాకు చాలా నచ్చిందండి! మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"పంచాంగం చెపితేగాని పండుగ రానందా?
మంచి ముహూర్తం కాదని గుండెల సవ్వడి ఆగిందా"

సిరివెన్నెల గారి మరో మంచి పాటను పరిచయం చేశారు, థాంక్సండీ..

పల్లా కొండల రావు చెప్పారు...

వనజ గారూ మంచి విశ్లేషణ. ఒకే ప్రపంచం-ఒకే కుటుంబం అదే వసుధైక కుటుంబం అనే భావన సంకుచితంగా ఆలోచించేటప్పుడు అర్ధం కావు. పండగ గురించి - సిరివెన్నెల గారి సాహిత్యం గురించి మంచిగా విశ్లేషించారు. ఈ వాక్యాలు బాగున్నాయండి.
"ఎంత ఎత్తుకు వెళితే అంతా చూపు విశాలమవుతుంది.
చూపు ఎంత విశాలం అయితే భావన అంత బలంగా ఉంటుంది
భావనలు ఎంత బలంగా ఉంటే వ్యక్తీకరణ అంత స్పష్టంగా ఉంటుంది
వ్యక్తీకరణ స్పష్టత ఏర్పడిన కొలది వ్యక్తికీ సమాజానికి అంతరంగిక బంధం మరింత బలీయమై
ఆచరణ పరస్పర ప్రేరక మవుతుంది."

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శశి కళ గారు..నాకు చాలా ఇష్టమైన వాక్యాలు అవి. నచ్చినందుకు ధన్యవాదములు. సిరివెన్నెల గారి పాట నచ్చినందుకు చాలా చాలా సంతోషం.
@జలతారు వెన్నెల గారు.. మీకు సిరివెన్నెల గారి పాట నచ్చినందుకు..సంతోషం. ధన్యవాదములు.
@ రాజీ గారు.. థాంక్ యు వేరి మచ్.పాటలు వినడం అందులో మేలేన్నిక గలవి గుర్తించడం మీకు బాగా తెలుసు. అందు మీ బ్లాగ్ లో పాటలే నిదర్శనం .
@ కొండలరావు గారు మీ స్పందనకి ధన్యవాదములు. ఒక మంచి ఆలోచన కల్గించడానికి ,స్పూర్తిని కల్గించడానికి పెద్ద పెద్ద గ్రంధాలు పుంఖాను పుంఖాలుగా చదవనవసరం లేదండి. ఒక్క పాట కూడా చాలు అని నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. "సిరివెన్నెల" గారి పాటలు వింటూ నేను చాలా స్ఫూర్తి పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఉదాహరణకి ఇది చూడండి."చిటికె లోన చిక్క బడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి " అంటారు ఓ..పాటలో. అది చాలు ఆశావాదం లో పయనించడానికి.
పాటల్లో సాహిత్యం ఉంటుందా అంటే.. ఉంటుంది..వేటూరి..పాటల్లో,సిరివెన్నెలల పాటల్లో. వారు ఇద్దరు నా అభిమాన సినీ కవులు.
థాంక్ యు వేరి మచ్,

రాజ్ కుమార్ చెప్పారు...

చాలా బాగుందండీ.. ఇందులో కొన్ని లైన్స్ పాడీన వీడియో యూట్యూబ్ లో చూశాను. మీరు మొత్తం రాశారు.
దటీజ్ సిరివెన్నెల అనాలనిపించింది మీ పోస్ట్ చదివాక.
ధన్యవాదాలు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

సిరివెన్నెల గారి పాటల్లో జీవితమంతా నిండి వుంటుంది.ఇంకో పాట రుద్రవీణ నుండి "నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వొచ్చిన ఈ మాయని ".మంచి పాటను తెలియజేసారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్ కుమార్.. గారు ,మీ స్పందనకి ధన్యవాదములు. సిరివెన్నెల గారి పాటలు గమనిస్తూ ఉండండి. ఒక్క పాటైనా తప్పక మిమ్మల్ని ఆలోచింప జేస్తుంది.
ఈ పోస్ట్ నచ్చినందుకు సంతోషం.థాంక్ యు వేరి మచ్.
@రవి శేఖర్ గారు..ధన్యవాదములు. మీరు సిరివెన్నెల పాటలు సేకరించి వినండి. మీ ఆలోచనా దృక్పథం లో ఇంకా బాగా మార్పు వచ్చి చైతన్యవంతమైన పోస్ట్లని వందలమందికి ఉపయోగ పడేవిధంగా..వ్రాయవచ్చును.
ఉదాహరణకి .. ఆపద్భాందవుడు చిత్రం లో ఔరా ..అమ్మకు చెల్లా పాట చూడండి. అలాటి అలాటి పదాలతో..భాగవతం లోని సారమంతా..ఓ..పాటలో చెప్పేస్తారు దట్ ఈస్ సిరివెన్నెల.