18, జూన్ 2016, శనివారం

కళాత్మకం బాతిక్ కళ







పుట్టా పెంచలదాసు గారు గారు . ఒక మంచి బాతిక్ చిత్ర కారుడు,జానపద గాయకుడు. వీరి గురించి పరిచయం  "అరుగు " వెబ్ పత్రికలో చదివాను. చదివిన నాలుగైదు రోజులకే కడప జిల్లాకి వెళ్లాను. వారిని స్వయంగా కలవాలని రెండు బాతిక్  చిత్రాలని కోరి చేయించుకోవాలని అనుకున్నాను. అయితే అక్కడ నేనున్నా రెండురోజుల్లో ..చిట్వేల్ వరకు వెళ్ళి కలవడం సాధ్యం కాదనిపించింది. తిరిగి వచ్చి ఒక ఉత్తరం వ్రాద్దామనుకుంటూనే అలక్ష్యం చేసాను. నిన్న పుట్టా పెంచల దాసు గారు పేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్టు లో కనిపించారు .సంతోషం కల్గింది. వెంటనే .. వారికి స్నేహ అభ్యర్ధన పంపాను. వారు అంగీకరించి ఇప్పుడు నా ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నారు. 


ఇప్పుడీ పరిచయం ఎందుకంటే .. పుట్టా పెంచలదాసు గారి బాతిక్ చిత్రాలలో చక్కని కళాత్మకత ఉంది. జీవకళ ఉట్టి పడుతుంది.  కళాకారులకి ప్రోత్సాహం లేక కళని నమ్ముకున్నందుకు సరైన  జీవనోపాధి లభించక ఆర్ధిక ఇబ్బందులతో నిరాశ నిసృహలతో జీవనం సాగించడం చాలా బాధాకరమైన విషయం. 


మన దురదృష్టమేమిటంటే ... మన వారి కళలని మనం గుర్తించం. పరాయి వాళ్ళ చిత్రాలని ఆహా ..ఓహో అంటూ మెచ్చుకుంటూ ఎంత ఖరీదు అయినా కొని ఇళ్ళల్లో అలంకరించుకుంటారు. కానీ మనమధ్య ఉన్న కళాకారులని గుర్తించి, అభినందించి,ప్రోత్శాహించలేము కదా ..అని నా మనసుకి అనిపించింది. 

నాకు ఇప్పుడిలా చేయాలనిపించింది. పుట్టాపెంచలదాసు గారి తో నాకు నచ్చిన రెండు చిత్రాలని డిజైన్ చేయించుకుని ... వాటిని ఫ్రేమ్ చేయించుకుని ఇంట్లో అలంకరించుకోవాలని, ఎవరికైనా గిఫ్ట్ గా  ఇవ్వాలనుకుంటున్నాను. అలా చేయడం వల్ల కళని కళాకారుని గౌరవించుకున్నట్లే!


24 x 18 సైజులో .. వాల్ ఫీసు లుగా చిత్రించుకోవచ్చని నాకనిపిస్తుంది. ..మరి పెంచలదాసు గారు ఏమంటారో !? 

ఇలా వారి పరిచయాన్ని నా చిన్నపాటి ఆకాంక్షని తెలుపుతూ ..ఈ పోస్ట్ . 

పుట్టా పెంచలదాసు గారికి  ఇలా పోస్ట్ చేయడం అభ్యంతరం కాదని భావిస్తూ ... అభ్యంతరమైతే మన్నించాలి మరి. 



5 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

బాతిక్ చీరలన్నా, బాతిక్ కళ అన్నా నాకు ప్రాణం.మీరు చీరలు ఆర్డర్ ఇస్తే యెల్లో కాంబినేషన్ లో నాకొకటి ఇస్తారా ?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నీహారిక గారూ ..తప్పకుండా ఇస్తాను . మాకు దగ్గరలో బాతిక్ యూనిట్స్ ఉన్నాయి . అక్కడ మీ కోరిక ప్రకారం చేయిస్తాను .
మేకు పిక్స్ పెడతాను . థాంక్ యూ సో మచ్ . మన కళలని మనం ఆదరించుకుందాము.

నీహారిక చెప్పారు...

మామూలు డిజైన్స్ నాకు తెలుసు. ఫైన మీరు చూపించిన చిత్రం లాగా విభిన్నంగా చీరకొంగు మీద చిత్రిస్తారేమో అడగండి.ధన్యవాదాలు.

Lalitha చెప్పారు...

పుట్టా పెంచల దాసు గారి గురించి పరిచయం బావుంది. ఎప్పటికైనా కడప వెళ్ళగలిగితే తప్పకుండా గుర్తు పెట్టుకుని ఆయన్ని కలిసి రావాలి అనేసుకున్నాను.

Zilebi చెప్పారు...



బాతికు కళ యందంబుల
ఖాతరు జేసెను జిలేబి కంకణ ధారీ !
జోత వనజవనమాలీ !
ఊతగ జేర్చిరి టపాన ఉత్తమము సుమీ !