15, డిసెంబర్ 2012, శనివారం

మనసుతడి






      మనసుతడి

ఊపిరి ఉండగానే  కాటికి చేర్చిన
కొడుకులున్న తల్లిని  చూసి
మనసు  తడి ఆరనివ్వకండి  .. 

అమ్మ పొత్తిళ్ళలో.
ఒదిగి ఉండాల్సిన పసి పాప 
మురుగు  కాల్వలో మృతజీవిగా మారిన వైనం చూసి
మనసు తడి ఆరనివ్వకండి.. 

రక్త మోడుతున్న సాటి చోధకులని 
చూసి చూడనట్లు వెళ్ళిపోతూ..
మానవత్వపు దారిద్ర్యంతో..
మనసు తడి ఆరనివ్వకండి..

ఏ ప్రకృతి వైపరీత్యాలకో ,వికృత వైషమ్యాలకో..
బలి అయి  ఉన్నచోట  ఉండలేక
శరణార్ధులుగా ఉన్నవారిని చూసి
మనసు తడి ఆరనివ్వకండి.. 

స్వార్ధపు నిచ్చెనె లు ఎక్కి ..  
సాటివారి ఫలాలను  దోచేస్తే .. 
ప్రక్కవాడి గొడవ మనకెందుకులే అని 
మనసు తడి ఆరనివ్వకండి.. 

మనసు తడి ఆరితే  మనిషిగా..అంతరించినట్లే..!!

మనసు తడి జీవనదిలా..
ప్రవహిస్తూ ఉండాలి.. 
కర్కశం అందులో పునీతం కావాలి.....
     

14 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

నిజమే!! Very well said..."మనసు తడి ఆరితే మనిషిగా..అంతరించినట్లే..!!

అజ్ఞాత చెప్పారు...

మనసు తడి ఆరితే బతుకు శూన్యం

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మనసు తడి జీవనదిలా..
ప్రవహిస్తూ ఉండాలి.."

నిజమేనండీ ప్రతి మనిషీ ఆలోచించాల్సిన విషయమే ఇది..

Harsha చెప్పారు...

బాగా రాసారు !! మనసు తడి ఆరితే బ్రతుకు అంతరించినట్లే చాల బావుంది

హితైషి చెప్పారు...

వనజ గారు మీ మాటలతో మేలుకోల్పుతున్నారు. మంచి మెసేజ్ నింపుకున్న కవిత.. మనసు ను తాకింది.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Heart felt heavy! Very well written poem and apt title too!

Avineni Bhaskar
(ninnaTi mee kavita chadivAkUDA inTipErutO sahA rAsinandaku EmanukOkanDi. teeriggA aa post lo naa views rAstAnu)

భారతి చెప్పారు...

మనసు తడి ఆరితే మనిషిగా..అంతరించినట్లే..!!
మనసు తడి జీవనదిలా..
ప్రవహిస్తూ ఉండాలి..
కర్కశం అందులో పునీతం కావాలి.....

వనజ గారు!
చాల బాగా చెప్పారు. మీకవిత మానవతను మేల్కొలుపుతుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

manasu tadi lenide manishi jivam ledu chaalaa chakkagaa chepapru baavundi ande chinna maata...

జ్యోతిర్మయి చెప్పారు...

ఆర్ద్రంగా వుంది కవిత. అభినందనలు వనజ గారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. ధన్యవాదములు. మీ స్పందన కి అభివందనం.

@కష్టే ఫలే మాస్టారూ.. సరిగానే చెప్పాను అంటారా! ధన్యవాదములు.

@ రాజీ గారు.. థాంక్ యు సో మచ్.

@ హర్షా.. మీకు నచ్చిందని ..మెచ్చుకుంటూ చెప్పినందుకు బహుదా ధన్యవాదములు.

@ హితైషి.. మీ పేరులోనే హితం కోరే "షి " ఉంది. మీమనసునే తాకిందంటే మాటలా!? నాలోనూ మనసు తడి ఉండబట్టే ఈ కవనం వెలువడిందేమో ! ఏమో !!

@అవినేని భాస్కర్ తమ్ముడూ.. మనసు తడి మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు. చెమరించిన నయనం,ద్రవించిన హృదయం మనిషికి ఆభరణం, మనసుకి కిరీటం .

@భారతి గారు.. ఈ కవిత వ్రాసుకున్న రోజు సంఘటన ని వ్రాయడానికి ప్రయత్ని స్తాను. నిడివి ఎక్కువ గల పోస్ట్ లు వ్రాసే తీరిక లేక..ఇలా.. మీ స్పందనకి ధన్యవాదములు.

@ చెప్పాలంటే ..మంజు గారు.. మీరు చెప్పడం కోసం ఎదురు చూస్తున్నాను.థాంక్ యూ సో మచ్.

శశి కళ చెప్పారు...

manasu tadi...yento mandiki aaripoyiondi:(

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. స్పందనకి మరీ మరీ ధన్యవాదములు.

@ శశి కళ ..గారు.. నిజం కదా! అందుకే ఇలా వ్రాసుకోవాల్సి వచ్చింది.

శ్రీ చెప్పారు...

మనసు తడి జీవనదిలా..
ప్రవహిస్తూ ఉండాలి..
కర్కశం అందులో పునీతం కావాలి.....చాలా బాగుంది వనజ గారూ!...అభినందనలు....@శ్రీ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ గారు కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదములు.