ఓ..ప్రశ్నకి ..నా సమాధానం
నేను ఎందుకు వ్రాస్తున్నాను అంటే..!? మరొకసారి ఈ విషయం పంచుకోవాలనిపించింది. .. ఇది కూడా ఒక పాత పోస్ట్..
మన మనసులోని భావాలు కొందరితో మాత్రమే పంచుకోగలం. అలా పంచుకోలేని భావాలను వ్రాసుకోవడం తప్ప ఏమి చేయజాలము. ఆ వ్రాసుకోవడం కూడా చేయలేక పోతే... ఏదో తెలియని అనిశ్చితి.
స్వీయ అనుభవాల్ని, మన ఆలోచనలని,నేర్చుకున్న జ్ఞానాన్నినలుగురితో పంచుకోవాలి కదా! పంచుకుంటే పెరిగేది జ్ఞానం. మనిషి పుట్టిన దగ్గరనుండి నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలంటే ప్రశ్నించాలి కదా!
ప్రశ్నించడమంటే.. కొందరికి నచ్చదు. ఎందుకని నచ్చదు అంటే.. ? జెండర్ సేన్సిటివిటి .నిజం! ఎంతో సున్నితనైన ఆలోచనలు, గాఢమైన అనుబంధాలు ఉన్న కుటుంబ సభ్యులకి కూడా..ఆడవాళ్ళూ ప్రశ్నించడం .నచ్చదు.
ఆడవాళ్ళ ఆలోచనలు గడ్డిపరకలతో సమానం. ఆడవాళ్ళూ ఇప్పటికి చీరలగురించి, కుటుంబాల గురించి మాట్లాడుతూనే ఉండాలి ప్లస్ ఇంకా ... మాట్లాడుతున్నారు. మాట్లాడుతూనే ఉన్నారు
ఆడవాళ్ళు అంతకన్నా ఎదగడం అసంభవం అనే భావన కొందరి పురుషులది, మరి కొందరి ఆడవాళ్లది కూడా.
జీవితంలో.. వాటికీ భాగం ఉన్నప్పుడు మాట్లాడితే తప్పు ఏమిటి? ఇన్ క్లూడింగ్ వాటితో ..సహా.. స్త్రీలు చాలా తెలుసుకుంటున్నారు. వాటి గురించి చెప్పుకోవడానికి... ఒక వేదిక కావాలి.. ఆవేదిక లో.. భాగం బ్లాగ్ కూడా..
గుండు సూది తయారి నుండి.. అంతరిక్ష ప్రయాణంలో వరకు.. స్త్రీ పని భాగస్వామ్యం లేకుండా..ఏ పని జరగడం లేదు. అయినా.. ఇంట్లో మాత్రం ఆడవారు మాట్లాడటంని, ప్రశ్నించడం నిషిద్ధం.
తాతల తరం నుండి, తండ్రుల తరం నుండి,సహోదరుల తరంలోనూ, ఆఖరికి కడుపున పుట్టిన బిడ్దల నుండి కూడా ఆజ్ఞాపించడం హక్కుని చేసుకున్న వాళ్ళ తీరుని ప్రశ్నించడానికి.. అయినా నేను వ్రాస్తాను.
బయట మాత్రం సంస్కారం ముసుగు వేసుకుని స్త్రీల అభివృద్ధిని నోటితో.. మెచ్చుకుని నొసటితో వెక్కిరించడం చేసేవాళ్ళని చూస్తూ..భరించగలగటం ఎంత కష్టం ?. మీ మెదడు మోకాలిలో ఉంది .. మీ తెలివితేటలు ఇంతే! అని హేళన చేసినట్లు ఉండే వారికి సమాధానం చెప్పటానికే నేను వ్రాస్తాను.
చదుకుని ఇంటా-బయటా చాకిరీ చేసే మహిళలకి ఎన్నెన్ని హర్ట్స్,పెయిన్స్ ఉంటాయో! ప్రపంచంలో.. మనిషికి మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి కుటుంబ సభ్యుల మద్య ఉన్న అనుబంధం గురించి కన్నా ఎక్కువ ఆలోచించాలి. ఇల్లు ఆడవారికి.. భద్రతే కాదు ఇంకో కోణంలో జీవిత ఖైదు కూడా.. స్వేచ్చా భావన లేని నరక కూపంలో.. మగ్గే స్త్రీలని చూసాక వాళ్ళ గురించి వ్రాయాలనుకోవడం తప్పు కాదే!? ఆడవాళ్ళని భద్రత పేరిట సంప్రదాయాల పేరిట ఇతరులతో కలవనీయకుండా.. గిరి గీసి కూర్చోపెట్టే.. పెత్తందారితనం గురించి ప్రశ్నించడం , అన్నీ తెలుసుకోవాలనుకోవడం తప్పు ఎలా అవుతుందీ?
మన కన్నా ముందు ఎంతో మంది సహృదయులు మహిళల పట్ల సానుభూతితోనో .. లేదా సమాజ అభ్యున్నతి ఆకాంక్షించో.. స్త్రీల తరపున వకాల్తా పుచ్చుకుని వ్రాసి..నడచి ఒక బాట చూపారు. తర్వాత.. మనుషులుగా జీవించడం నేర్చుకున్న స్త్రీలు వాళ్ళ గురించే కాదు.. ప్రపంచంలో జరిగే అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుని వ్రాయడం మొదలెట్టారు. అందుకే కథ, కవిత, వ్యాసం , గల్ఫిక , నాటిక,నవల, పద్యమో,గద్యమో ఏదో ఒకటి వ్రాస్తున్నప్పుడు వాళ్ళకి వ్రాసే స్వేచ్చ కూడా లేని వెనుకబాటుతనంని మనం ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందో.?
నాకు నేనే అర్ధం కానప్పుడు.. నా ఆలోచనలని.. కాగితాలపై.. వ్రాయడం తప్పు అయిందని అన్నప్పుడు నేను ప్రశ్నించాను. అరువు గొంతుకలతొ..జీవన పర్యంతం ఎలా బ్రతకగలం?. "'ఎదురు తిరిగితే పోయేది ఏమి లేదు ఎనకబాటుతనం తప్ప" అన్న డైలాగ్ గుర్తుకోస్తున్నప్పుడు.. వ్రాస్తూ ఉంటాను. ఇంకా ఏమి వ్రాయనే లేదు.( ఎందుకు ఈ.. బ్లాగుల రాత? ఏముంది అందులో.. అవహేళనకి స్పందించి..)
నా.. కవితలు చూసినప్పుడు.. చాలా మంది.. స్త్రీల పక్షపాతిని అని తీర్మానించాక .. అలా అన్నవారివి పాషాణ హృదయాలని నిర్ధారించుకుని.. సమస్యని.. స్త్రీ పురుషుల భేదంతో చూడకూడదు ఇద్దరు సమానమే.. అలా చూడటమే మనిషితనం +మానవత్వం కూడా అనిపించుకుంటుందని చెప్పటానికి మళ్ళీ వ్రాసాను. అలాగే.. ఇప్పుడూ వ్రాస్తాను.
నా కోసమే కాదు నా ఆలోచనలని హర్షించేవారి కోసం కూడా..నేర్చుకుంటూ.. వ్రాస్తాను. ఇష్టం అయితే చూడండీ! లేదంటే మానేయండీ!!! స్త్రీల తెలివితేటల మీద చిన్న చూపు ఉన్న వారికోసం వ్రాయాలి కనుక వ్రాస్తాను.అందుకే .. నా..ఈ.. వ్రాత.
13 కామెంట్లు:
చాలా బాగా చెప్పారు వనజ గారూ
పత్రికలలో లేని స్వేఛ్చ బ్లాగుల్లోనే ఉంది.
ఇది వ్రాయకూడదు, అది వ్రాయకూడదు.
వీళ్ళు వ్రాయకూడదు, వాళ్ళు వ్రాయకూడదు.
అంటే కుదరదు.
ఎవరికి నచ్చింది వాళ్ళు వ్రాసుకోవచ్చు.
ఇష్టముంటే చదవాలి, లేకుంటే వదిలేయాలి.
ఎవరో ఏదో అనుకుంటారనో కించపరుస్తారనో రాయడం ఎందుకండి......మీ ఇష్టం వచ్చిన స్వేచ్చగా రాసుకుని మాతో పంచుకోండి.
నిజాలు..
చాలా బాగా రాసారు వనజ గారు.
"నా బ్లాగు,నా ఇష్టం" ఇది ప్రతీ బ్లాగర్ యొక్క తొలి అభిప్రాయం(గా ఉండాలి),కొంత మంది పర్సనల్ డైరీ రాస్తారు,అలగే ఈ బ్లాగింగ్ , కాని బ్లాగ్ లో కాస్త ఉత్తమమైన వ్యక్తీకరణ(అంటె మంచి భాష అని అర్థం) ఉంటుంది,కొన్ని బ్లాగులు కొన్ని పోస్ట్ లు చదివితే ....ఆలోచన రెకెత్తించి ప్రశ్నించేలా ఉంటాయి,అవి పర్సనల్ డైరీ లోని పేజీల లో మగ్గిపోయే బదులు ఇలా బ్లాగ్ పోస్ట్ లు గా ప్రపంచానికి తెలియడం మంచిదే కదా,ఎదో అనటానికి సిద్ధంగా ఉండే వాల్లు కొందరే ఉన్నా మంచి బ్లాగుని ఫాల్లో అవుతూ మంచి పోస్టులని కామెంట్ తో మెచ్చుకునే వారు కూడా ఉంటారు. వీళ్ళని (టార్గెటెత్ చేసి )చూసైనా రాయాలి.
నా బ్లాగు నా యిష్టం...అంతే:) మన మనోభావాలను పలికించే మన స్వంత అద్దం ఇది. ఎవరో పగలకొడతామంటే ఒప్పుకోవద్దు...మనమూ పగలకొట్టుకోవద్దు.That is all it.
వనజవనమాలి గారు నేను చాలా రోజుల క్రితమే బ్లాగ్ రాయాలని మొదలుపెట్టి ఈ తెలుగు బ్లాగుల్లో ఉన్న రాజకీయాలు చూసి మానేశానండీ...
కొంతమంది ఆడ బ్లాగర్లను మగ బ్లాగర్లు కూడా సపోర్ట్ చేస్తారు..
కొంతమంది ఆడబ్లాగర్లే మగ బ్లాగర్లతో కలిసి వాళ్ళకిష్టం లేని ఆడ బ్లాగర్ల మీద పిచ్చి కామెంట్లతో బాధపెడుతుంటారు..
గ్రూపిజం తో వాళ్ళకిష్టమైన వాళ్ళు ఏమి రాసినా సరే పొలోమంటూ కామెంట్లు పెడతారు..
వాళ్ళకిష్టం లేని వాళ్ళు ఎంత మంచి అంశాన్ని గురించి రాసినా అదొక పనికిరానిదన్న భ్రమ మన మీద మనకే కలిగేలా చేస్తారు..
ఇవన్నీ చూసి ఎందుకొచ్చిన బాధలే అనిపించింది..
కానీ మీరన్నది నిజమే "స్త్రీల తెలివితేటల మీద చిన్న చూపు ఉన్న వారికోసం వ్రాయాలి కనుక వ్రాస్తాను"
you r correct
వనజవనమాలి గారు నేను చాలా రోజుల క్రితమే బ్లాగ్ రాయాలని మొదలుపెట్టి ఈ తెలుగు బ్లాగుల్లో ఉన్న రాజకీయాలు చూసి మానేశానండీ...
కొంతమంది ఆడ బ్లాగర్లను మగ బ్లాగర్లు కూడా సపోర్ట్ చేస్తారు..
కొంతమంది ఆడబ్లాగర్లే మగ బ్లాగర్లతో కలిసి వాళ్ళకిష్టం లేని ఆడ బ్లాగర్ల మీద పిచ్చి కామెంట్లతో బాధపెడుతుంటారు..
గ్రూపిజం తో వాళ్ళకిష్టమైన వాళ్ళు ఏమి రాసినా సరే పొలోమంటూ కామెంట్లు పెడతారు..
వాళ్ళకిష్టం లేని వాళ్ళు ఎంత మంచి అంశాన్ని గురించి రాసినా అదొక పనికిరానిదన్న భ్రమ మన మీద మనకే కలిగేలా చేస్తారు..
ఇవన్నీ చూసి ఎందుకొచ్చిన బాధలే అనిపించింది..
కానీ మీరన్నది నిజమే "స్త్రీల తెలివితేటల మీద చిన్న చూపు ఉన్న వారికోసం వ్రాయాలి కనుక వ్రాస్తాను"
you are correct..
ఉదయ కిరణాలు గారు .. ధన్యవాదములు.
@ బోనగిరి గారు మీ అభిప్రాయం అందరి అభిప్రాయం అయితే బాగుండును.
పాండిత్యం మా సొంతం అనుకుని విర్రవీగుతున్న వారికి అర్ధమైతే బావుండును.మీ స్పందనకి ధన్యవాదములు.
@ప్రేరణ గారు ధన్యవాదములు. మీరు చెప్పినది పాటిస్తాను.:)
ధాత్రి గారు..వ్రాయడం అంటూ మొదలెట్టాక ఆపడం ఎందుకండీ. వ్రాసుకున్తూనే ఉందాం. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.
@ నరసింహ గారు.. మీ అభిప్రాయంకి ధన్యవాదములు.
మీకు ఒక విషయం చెప్పాలండి. స్వంత పేరుతొ బ్లాగ్ నడిపే వాళ్ళు ఫేక్ ID తో బ్లాగ్ వ్రాసేవాళ్ళు ఉన్నారు .
చక్కగా వ్రాస్తున్నందుకు అభినందిద్దాం. ఇష్టపడుతున్నాం కాబట్టి చదువుతున్నాం.కామెంట్స్ ఇస్తాం. అంతే నండీ అంతే!:)
జయ గారు.. ఈ పోస్ట్ వ్రాసి రెండేళ్ళు అయింది. ఎందుకో నిన్న చూసుకుంటుంటే.. ఎందుకు ఇలా స్పందిన్చానో..గుర్తుకు వచ్చింది. ఇలా వ్రాసాక కూడా రెండేళ్ళు వ్రాసాను. వ్రాస్తున్నాను . బావుంది కదా!
ఇదే సమాధానం. :) థాంక్ యు వేరి మచ్.
@స్వర్ణ గారు.. ఎంత బాగా చెప్పారండి. మీరు అన్నది అక్షరాలా నిజం. బాబోయ్.. ఎన్ని గమనించాను. ఎన్ని కుసంస్కారాలు బయట పడ్డాయో!
మీరు ఎందుకండీ..మానేశారు. ? వ్రాస్తూ ఉండండి . KN మల్లీశ్వరి గారు చూడండీ స్త్రీల బ్లాగ్ లని ఒక వేదిక మీదకి తీసుకు వస్తున్నారు. స్త్రీల ఆలోచనలు తెలుస్తాయి కదండీ. సమాజంలో మనమూ భాగమే!
వ్రాయండి ప్లీజ్!!
"వనజవనమాలి" గారూ..
నాది కూడా మీ మాటేనండీ ఎవరికోసమో మనం బ్లాగ్ రాయటం లేదు కదా మన ఇష్టమైంది మనం ఇక్కడ చెప్పుకుంటాము,మాట్లాడుకుంటాము..
మనం ఎవరినీ ఇబ్బంది పెట్టనంతవరకు మనకెందుకు భయం అనుకుంటాను..
ఎవరేమీ అనుకున్నా మన రాజ్యానికి రాజు,మంత్రి అన్నీ మనమే కదా :)
బాగుంది. బాగా వ్రాశారు .
" జీవితమంటే పోరాటం. పోరాటం లో ఉంది జయం " అన్నాడో సినీ కవి. మీరు చేస్తున్న పోరాటం సబబైనదే.
స్వేచ్చ లేని భద్రత , భద్రత లేని స్వేచ్చ రెండూ నరకమే వనజ గారూ! ఆ రెండూ ఉండే సమాజం రావాలంటే సమాజం లో ఉండే అనేక చెడు భావాలను ఎంతో మంది మెదళ్ల నుండి పారద్రోలాల్సి ఉంది. అందుకు బ్లాగులూ ఉపయోగపడతాయి. వ్రాయండి. వ్రాస్తూ ఉండండి. స్వేచ్చగా , స్వేచ్చా - భద్రతల కోసం పోరాడేలా చైతన్యం పెంచేలా వ్రాయండి. మీ వ్రాతలనలా పంచుకోండి. వ్రాసే నైపుణ్యం నిరంతరం పెంచుకోండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి