ది స్వోర్డ్ అఫ్ టిప్పుసుల్తాన్ , విజయరాజ్ , దివ్యభారతి ..
ఈ మూడు పేర్లు వినగానే నాకు చప్పున .. ఒక జ్ఞాపకం .. ఆ జ్ఞాపకం బాధావీచికం.
ఆ అమ్మాయి ఎలా ఉందో !? అనుకుంటాను . ఎందుకు ఆ అమ్మాయి అలా చేసింది ? ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్తని అంత త్వరగా ఎలా మర్చిపోగల్గింది ? అని ప్రశ్నలు వేసుకుంటాను ఆడవాళ్ళు అంత త్వరగా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలని, జీవితానికి సంబందించిన మనిషిని అంత త్వరగా మర్చి పోతారా? అలా మర్చిపోవడం అంత సులభమా? అనుకుంటూ మరీ... నేను చాదస్తంగా ఆలోచిస్తున్నానేమో ? అని బలవంతంగా ఆ ఆలోచనల నుండి బయట పడే ప్రయత్నం చేస్తాను .
ఈ రోజు దివ్య భారతిని (సినీ నటి ) ని ఒక వీడియో సాంగ్ లో చూస్తే చప్పున నాకు ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది అచ్చు దివ్యభారతిలా ఉంటుంది కాకపొతే చామానఛాయ రంగు అంతే తేడా.
ఆ అమ్మాయి పేరు చాలా అందమైన పేరు సంజన ( పేరు మార్చాను ) తల్లి దండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు . ముగ్గురూ ఆడపిల్లలే ! సంజన చెల్లెలు నా చెల్లికి స్నేహితురాలు. అలా ఆ కుటుంబం తో నాకు పరిచయం ఉంది
సంజనకి చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకనేమో .. ఆ పిల్లని ఒక పంక్షన్ లో చూసి పెళ్లి చేస్తారా అనగానే అడిగిన అబ్బాయి మంచి చెడులు చూసి వెంటనే పెళ్లి జరిపించేసారు. అతని పేరు విజయ్ రాజ్ . తండ్రి లేడు
ఒక్కడే సంతానం. మద్రాస్ లో సినిమాల షూటింగ్ల కి కెమెరా మెన్ గా పని చేసేవాడు.అతనికి ఇచ్చి సంజన కి పెళ్లి జరిపించారు. పెళ్ళైన ఏడాదికి ఒక పాప పుట్టింది.విజయ రాజ్ కి సంజయ్ ఖాన్ నిర్మిస్తున్న " టిప్పుసుల్తాన్" కి పనిచేయడానికి అవకాశం వచ్చింది . ఆతను ఆ సంస్థ లో పని చేస్తూ ఉండగానే . ఆ పాపకి సంవత్సరం వయసు ఉండగా ఒక నెలరోజులు పాటు ఖాళీ లేకుండా షూటింగ్ ఉండటం వల్ల సంజన ని చుట్టం చూపుగా పుట్టింటికి పంపి ఆతను షూటింగ్ కి వెళ్ళాడు స్పెషల్ ఎఫెక్ట్స్ తీస్తూ ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఎంతో మందిని రక్షించి అతను ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు.
ఆ అగ్ని ప్రమాదం వార్త వినగానే కుటుంబ సభ్యలు అందరూ అక్కడికి పరుగులు తీసారు రెండుమూడు రోజుల తర్వాత గుర్తుపట్టని స్థితిలొఉన్న అతని పార్ధివ శరీరాన్ని అప్పగించారు. మట్టి చేయడం,మిగతా కార్యక్రామాలు పూర్తీ చేసుకుని మరో రెండు రోజులకి మద్రాస్ పట్టణం నుండి ఇల్లు ఖాళీ చేసుకుని బరువైన మనసులతో తిరిగి వచ్చేసారు. విజయ్ రాజ్ తల్లి దుఃఖ భారంతో కృంగి పోయారు కోడలు మనుమరాలుతో సహా కోడలి పుట్టింట్లో ఉంది.కొన్నాళ్ళకు ఆమె కోడలు మనుమరాలుతో కలిసి కోడలి పుట్టింట్లో వారితో కలసి ఉండలేక బంధువుల ఇంట్లో ఉన్నారు. అగ్ని ప్రమాదంలో మరణించాడు కాబట్టి ఇన్స్యూరెన్స్ ద్వారా లభించే డబ్బు విషయంలో తప్ప ఆమెకి కోడలికి అంత అనుబంధం ఉన్నట్లు కనబడేది కాదు.
నేను ఆ అమ్మాయిని పలకరించడానికని వెళ్లాను. సంజన కన్నా ఆమె తల్లి తండ్రి చాలా దిగులుగా కనిపించారు
సంజన వాళ్ళ అమ్మ ఫామిలీ ఆల్బుం తీసి విజయ్ రాజ్ ఫొటోస్ ఆతను భార్య,కూతురు తో దిగిన ఫొటోస్ చూపిస్తూ అతనికి తల్లితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆమె బిడ్డపై ఎన్నో ఆశలతొ జీవించారు ఇప్పుడు అతని మరణాన్ని ఆమె తట్టుకోవడం చాలా కష్టమని చెప్పారు
అలాగే ఆ ఇంట్లో మద్రాస్ నుండి ఇల్లు ఖాళీ చేసి వేసుకువచ్చిన వస్తు సామాగ్రి ప్రిజ్ద్ , బీరువా ,టీవి లాంటి వస్తువులపై విజయరాజ్ భార్య పేరు తన పేరు కలిపి స్టిక్కరింగ్ చేసుకుని ఉన్న గుర్తులు అతనికి భార్యపై ఉన్న ప్రేమని ప్రత్యేకంగా చెప్పాయి
సంజన మాత్రం చాలా మాములుగా కనిపించింది. విజయ్ రాజ్ ని పుట్టింటికి వచ్చే ముందు చూడటమే! మళ్ళీ భర్త ముఖాన్ని కూడా ఆమె చూడలేకపోయింది అయ్యో ..పాపం అనిపించింది.
సంజనా ! మళ్ళీ నువ్వు చదువుకోవడం మొదలెట్టు అని చెప్పాను. నాకు ఆ అమ్మాయి పట్ల సానుభూతి కన్నా కూడా విజయ్ రాజ్ పట్ల అభిమానం ఎక్కువైనట్లు అనిపించింది అతనిని నేను అసలు చూడనే లేదు మాట్లాడనూ లేదు. అతని గురించి విన్న మాటలు మూలంగానే అతని మరణం పట్ల బాధ కల్గింది. సంజన ని చూస్తే జాలి కల్గింది అందమైన పిల్ల, పైగా చాలా చిన్న వయసు. మళ్ళీ తనకి ఒక పిల్ల. ప్చ్.. ఏమిటో గాలిబుడగ ల్లాంటి జీవితాలు అనుకున్నాను. విజయ్ రాజ్ మరణం తర్వాత ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది కదా అని బాధ పడ్డాను
రెండు మూడు నెలల తర్వాత ఒకరి నోటెంట ఒక విషయం విని ఆశ్చర్యపోయాను.సంజన ఒక పోలీస్ కానిస్టేబుల్ తో సన్నిహితంగా మెలుగుతుంది అని
చ.. అలాంటివేవి ఉండవు లెండి, వాళ్ళ ఇంటి ప్రక్కనే అతను ఉంటాడు ..ఏదో మాట్లాడుకుంటూ ఉంటే తప్పేమిటి అని. మళ్ళీ తరువాత ఇంకొకరి నోటి వెంట అలాంటి మాటే విన్నాను స్వయంగా చూసాను కూడా. నేను మా కుటుంబ సభ్యులు సినిమాకి వెళితే సంజన ఆ కానిస్టేబుల్ తో కలసి సినిమాకి వచ్చింది. అతనితో ఆ అమ్మాయి చాలా క్లోజ్ గా మూవ్ అవడం చూసాను. నిజం చెప్పొద్దూ .. నేను ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను
ఇదేమిటీ .. ఈ పిల్ల భర్త చనిపోయి నిండా నాలుగు నెలలు కూడా కాలేదు అంతగా ప్రేమించే భర్తని మర్చిపోయి అప్పుడే .పరాయి పురుషుడితో అంత సన్నిహితంగా మెలుగుతుంది అని చిరాకు పడ్డాను.
అది అలా జరిగిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి ఒక సంవత్సరం లోపే మళ్ళీ పెళ్లి జరిగిందని విన్నాను. సంజనకి ఉన్న బిడ్డని ఆమె తల్లిదండ్రులు పెంచుతున్నారని విన్నాను. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మా వూరు నుండి బదిలీ అయి వెళ్ళిపోయారు
కానీ నేను విజయ్ రాజ్ ని మర్చిపోలేదు. ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్, దివ్యభారతి,విజయ్ రాజ్ అలా నా మనసులో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు.
ఆ అమ్మాయి సంజన గురించి ఇప్పటికీ అనుకుంటాను, మనుషుల మరణాన్ని జీర్ణించుకోవడం అంత సులభమా!? ఆ అమ్మాయికి చిన్న వయసు కావడం వలన అలా చేసిందా? లేక తోడూ కోసం అలా చేసిందా.. అన్నది నాకు అర్ధం కాలేదు. మళ్ళీ వివాహం తప్పు కాకపోవచ్చు. మనుషుల్లో అంత ప్రాక్టికల్ మైండ్ ఉండటం అవసరమేమో కాని నేను ఆ అమ్మాయి చేసిన పనిని ఆమోదించలేకపొయాను. మరీ అంత తక్కువ కాలంలో అలా జరగడం వల్లనేమో నేను ఆమోదించలేకపొయానని అనుకున్నాను. బహుశా నేను కొందరు మారినంత వేగవంతంగా నా ఆలోచనలని, అభిప్రాయాలని మార్చుకోలేక పోవడం వల్లనేమో ! సంజన స్థానం లో నేను లేను కాబట్టి నాకు అలా అనిపించింది ఏమైనా స్త్రీల మనసు సముద్రం కన్నా లోతు అందులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అంటారు . కదా ! ఇదీ అంతే నేమో !
విజయ్ రాజ్ కూతురు ఇప్పటికి ఇరవై ఏళ్ళ అమ్మాయి అయి ఉంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమని కోల్పోయి ఉంటుందని నేను అనుకుంటాను
కొన్ని ప్రేమలు మనవి కాకపోయినా మన జ్ఞాపకాలలో గాఢంగా అలా నిలిచి ఉంటాయి . కొన్ని ప్రేమలు .వారి మనిషితోపాటు వెంటనే మరణిస్తాయి.
ఒకటి మాత్రం అనుకుంటాను .. ప్రియరాగాలు చిత్రంలో జగపతి బాబుకి సంబంధించి ఒక మాట , భార్య సమాది పై వ్రాసి ఉంటుంది .. " నా ఆత్మ, నీ శరీరం ఇక్కడ సమాధి చేయబడ్డాయి " అని
ఒకవేళ సంజన యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటే ... విజయ్ రాజ్ ఖచ్చితంగా అలాగే బాధపడుతూ ఉండేవాడేమో అని నేననుకుంటూ ఉంటాను. అతని గురించి నేను విన్న కొద్ది మాటల్లోనే నాకు ఏర్పడ్డ అభిప్రాయం అది. అది కేవలం నా ఊహ కావచ్చు.
భార్య చనిపోతే నెల లోపే మళ్ళీ వివాహం చేసుకునవారు ఉన్నప్పుడు సంజన చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయి చేసుకున్న వివాహాన్ని నేను వ్యతిరేకించలేదు కానీ ఓ తల్లికి బిడ్డ , ఓ బిడ్డకి తండ్రి రావడం చాలా కష్టం కదా ! ఆలోచిస్తూ ఉంటాను ఇప్పటికి కూడా.
వివాహం అంటే అనుబంధాల అల్లిక మాత్రమే కాదు అవసరాల కోసం కూడానేమో కదా !
( నా ఆలోచనలని ఈ పొస్ట్ లో ఇలా వ్రాసినందుకు "సంజనా .. ఐ యాం వెరీ సారీ )

8 కామెంట్‌లు:
ఓ వైపు స్త్రీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతూ , ఇలాంటివి జరిగినప్పుడు జీర్ణించుకోలేకపోవటం ఒక రకంగా కరెక్ట్ గాదండి .
sharma గారు .. అవునండీ మీరన్నది నిజమే! విజయ్ రాజ్ గురించి సంజన వాళ్ళ అమ్మ చెప్పిన మాటల వల్ల నాలో అలాంటి అభిప్రాయం బలంగా ఉండిపోయింది.
మీ స్పందనకి ధన్యవాదములు
మీ టపాలో విషయం గురించి నేనేమీ మాట్లాడలేను కానీ మీరు రాసిన రెండు మాటలు నన్ను కట్టిపడేశాయి.
>>మనుషుల మరణాన్ని అంత సులభంగా జీర్ణించుకోవడం అంత సులభమా!?<<<
కొందరిని చూసినపుడు నాకూ ఇదే ఆలోచన.
>>>కొన్ని ప్రేమలు మనవి కాకపోయినా మన జ్ఞాపకాలలో అలా నిలిచి ఉంటాయి . కొన్ని ప్రేమలు వెంటనే మనిషితోపాటు మరణిస్తాయి.<<<
చాలా బాగా చెప్పారు.
మీరు చెప్పేది ఆవేదనైనా, ఆనందమైనా చెప్పే విధానం ఆకట్టుకుంటుంది.
బావుందండీ .ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి . సంఘటనకు సంబంధించిన వ్యక్తులను బట్టి కూడా మన అభిప్రాయాలు మారిపోతుంటాయి .అప్పుడప్పుడూ అలా మారాల్సిన అవసరం కూడా ఉంటుంది .
బిడ్డతల్లి అయినంతమాత్రాన ఆ యువతి మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకైతే అంత విడ్డూరంగా అనిపించలేదు,నిత్యజీవితంలో అలాంటి సంఘటన జరిగి మొదటిపిల్లలు రెండో భర్త దగ్గర చాలా సుఖంగా హాయిగా తేడా లేకుండా ఆనక పుట్టిన చెల్లెలితో సఖ్యంగా ఉన్నారు!ఆ రెండో భర్తను చూసినప్పుడల్లా నాకు చేయెత్తి మొక్కాలనిపిస్తుంది నాకు !వనజవనమాలిగారు ఏదిరాసినా జవం జీవం ఉంటాయి!
శిశిర గారు ఎలా ఉన్నారు? మీ వ్యాఖ్యకి ధన్యవాదములు
పద్మార్పిత మీ స్పందనకి ధన్యవాదములు
నాగరాణి గారు మీరు చెప్పినట్లే కొన్ని అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి . మీ స్పందనకి ధన్యవాదములు
సూర్యప్రకాష్ గారు అవునండీ! కొన్ని సందర్భాలలో నేను కొన్ని గమనించాను. హృదయ వైశాల్యం కలవారు చాలా మంది ఉన్నారు. వారందరికీ చేతులెత్తి నమస్కరించాలి.
స్పందనకి ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి