ఆడవారు నున్నితంగా లతలా మగవాడిని అల్లుకు పోవాలనే అనుకుంటా రట... చాలా మంది చెపుతుంటారు నిజమేనేమో!
సున్నితత్వం అవసరమే కావచ్చు మరీ ఇతరులపై ఆధారపడే అంతగా ఉండే సున్నితత్వం వల్ల... ధీర లా బ్రతకగల్గి కూడా పురుషావరణం లోకి వచ్చేసరికి వాలిపోతారు . పురుషులు "టచ్ మీ నాట్ " లా ఉండేటప్పుడు కూడా వెంటపడి వేధింఛి కాని బందాలనేవో బలవంతంగా సొంతం చేసుకోవాలనేంత వెంపర్లాడటం చూస్తే జాలి కలుగుతుంది . అది అమాయకత్వమో తెలియదు తనని తానూ కోల్పోయెంత ప్రేమో తెలియదు . .. అలాంటి వాళ్ళే ఈ భారతీయ సంస్కృతికి వారధులు. సంప్రదాయాన్ని తుచ తప్పక పాటించేవాళ్ళు .. అలాంటి ప్రేమభరిత నెచ్చెలిని చూసినప్పుడు నాకనిపించిన భావన ఇది .. ప్రేమ ఉద్భవం ఎదని చిగిర్చే వసంతం అయితే అది మిగిల్చే ఎడబాటు గ్రీష్మం తో పోల్చవచ్చు ..
గ్రీష్మంలో.. ఓ.గ్రీష్మ (కాస్త కవితాత్మకం .కలపోసి )..ఆమె ఇలా అంటుంది
గ్రీష్మంలో
ఝరీ ప్రవాహంలాటి నా గమనానికి అడ్డుకట్ట వేసేసి..
నా కళ్ళల్లో నక్షత్ర కాంతులని దోచేసుకోవాలని
నా నవ్వుల పువ్వులని చిదిమేయాలని..
కంకణం కట్టుకున్నట్లు
నువ్వు గ్రీష్మంలో సూర్యుడిలా
రాచ బాటలోనే వచ్చావు
నీకు అలవాటైన ప్రయాణపు మజిలిలో
అన్నీ దోచేసుకుని హృదయాన్నిశూన్యం చేసి
చూపులని నిస్తేజం చేసి..
జీవమే లేని మోదంతో..
జీవశ్చవం లా బతకమని
నిట్టూర్పు సెగలతో కుమలమని .
నిర్దాక్షిణ్యంగా వెళ్ళాక
నేను నా చిరునామా ని..
యే చంద్రుడు నీడలో వెతుక్కోను
ఒంటరితనమనే సముద్రపు ఒడ్డున
వేయినోక్క రాగాల విషాద ఆలాపన చేస్తున్నా
అలవాటైన అలల హోరులో..
ఏ కాకి రొదగా ప్రపందానికి సొదగా వినిపిస్తుంది..
రోదన ఇంకిపోవడానికి అది గుండె కాదు..
మహా సముద్రం
ప్రవహించి పోవడానికి అది నది కాదు
నాలాటి ఒంటరి ల రోదనని వేదనని
అమ్మలా అక్కున చేర్చుకుంటుంది.
మరో అమ్మని నేనని గుర్తు చేస్తూ
(బిడ్డల కోసమే బ్రతికే ఆ అమ్మకి .. అంకితం )

2 కామెంట్లు:
>>>తనని తాను కోల్పోయేంత ప్రేమో తెలీదు<<< ఇదే అసలు నిజం.
అలా ప్రవర్తించే మగవాళ్ళు లేరనను , ఆడవాళ్ళూ ఉన్నారని తప్పక చెప్పుకోవలసి వస్తుంది . అయితే ఈ సంఖ్య అధికంగా మగవాళ్ళ లోనే ఉన్నదన్నది అక్షర సత్యం . ఈ ప్రపంచం యిలంటి వాటికి కూడలి . మగవాళ్ళను గ్రీష్మ తాపాన్ని అందించే సూర్యుడితో పోల్చటం బాగుంది . దాన్ని వాడుకునే రీతి అది అందుకునే వాళ్ళను బట్టి వుంటుందన్నది కూడా మనం యిక్కడ ఆలోచించవచ్చు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి