2, మార్చి 2014, ఆదివారం

మా ఆడాళ్ళ ఘోష

ఈ మధ్య వ్రాయడానికి బద్దకమెక్కువై...   ఇలా  టచ్ చేసి వెళ్ళిపోతున్నాను .

మరీ మూలాల్లోకి వెళితే నన్ను తిట్టుకోవడం ఖాయమని తెలిసినా .. వ్రాయకుండా ఉండలేక అని చెప్పడం కన్నా .. నిజమే చెపుతున్నాను కదా అన్న సమర్దింపు.. కూడా ఉంది కాబట్టి  మార్చి 8 ముందుంది కాబట్టి ఏదో..

మా ఆడాళ్ళ ఘోష..
మహిళాదినోత్సవం వారాంత ప్రత్యేక పోస్ట్ లలో ఇది ఒకటి

అలాగన్నారని... ముడుచుకు పోతామా ?

బాల్యపు ఛాయని గుప్పిట బిగించి
యవ్వనపు ఆవేశాన్ని సందిట బంధించి
ముదిమిని మడిచి మూలకిసిరేసి..
అవకాశమందుకుని.. స్వాభిమానాన్ని కాపాడుకోవాలని
సవాల్ చేస్తున్నందుకు
సంతోషంగా ఉంది
("అలాగే అన్నారు" శ్రీమతి ఎస్.రజియా బేగం కవితకి.. ప్రేరణతో ) 

మహిళాదినోత్సవం వారాంత ప్రత్యేక పోస్ట్ లలో ఇది ఒకటి

తండ్రైతే  ఏమిటి, అన్నైతే ఏమిటి ?
భర్తైతే ఏమిటి, బిడ్డైతే ఏమిటి?

గౌరవించని నాడు
అణగద్రోక్కాలనుకున్ననాడు
మూలనకూర్చోమన్ననాడు
గళం విప్పి ప్రశ్నించండి.

ప్రశ్న కి ప్రశ్న జవాబు కావచ్చు .
ప్రశ్నకి మౌనం సమాధానం కావచ్చు

వసంత కాలపు కోయిల పాటే కాదు
శీతాకాలపు కోయిల పిలుపు వినబడుతుంది

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


ఏమిటో నండీ , ప్రతి సంవత్సరం ఈ రోజు వస్తే ఇట్లా ఘోషిస్తాం ఆ పై దేశం లో జరిగే వాటి లో ఏలాంటి మార్పులు చేర్పులు లేవు . ఇంకా చెప్పా లంటే మునుపటి కన్నా ఈ మధ్య కాలం లో మరీ విపరీతమైన ద్వేషం కార్పణ్యం పెచ్చు పెరిగి పోతోంది

జిలేబి

hari.S.babu చెప్పారు...

ఒక మాట చెప్పనా?రామాయణంలో వనవాసానికి వెళ్ళేముందు ఒక తమాషా సన్నివేశం ఉంటుంది.మొదట సీత అనుకూడా వనవాసానీ తయారయినప్పుడు ఆపడం కోసం అక్కడ యెదురయ్యే కష్టాలూ అవీ చెప్పి భయపెట్టబోయినప్పుడు గబుక్కున సీత మా నాన్న నన్నొక నపుంసకుడి కిచ్చి చేసాడని నేననుకోవడం లేదనేస్తుంది.ఇప్పటి మాలాంటి మగాళ్ళ లాగే ఆయన కూడా అనవసరంగా ఈవిదకి సుత్తెయ్యబోయి ఇరుక్కున్నానని గింజుకునే ఉండే ఉంటాడేమో గానీ తర్వాత ఇక మాట్లాడ్కండా సరే పదమన్నాడు.కధే అయినా గానీ యెంత ధీమాగా మాట్లాడిందో చూడండి - మనకిసీత అనగానే అశోక వనంలో రాముడెప్పుడొస్తాడా అని యేడుస్తూ కూర్చునే సీత తెలిసినంతగా ఇలాంటి సీత గురించి అంతగా తెలియదు, యెందుకంటారు?
P.S..మనం ఇన్స్పిరేషన్ గా తీసుకునే రోల్ మోడల్స్ లోనే తేడా ఉంది.

Meraj Fathima చెప్పారు...

లెక్కల్లో మనకూ ఓ దినముంది,
లెక్కలేనన్ని కష్టాలను మోస్తాం కదా,
వనజా మీ శైలి ఎప్పుడూ నాకిష్టమే.