ఒక తల్లి హృదయం నదీమతల్లిపై ఆగ్రహావేశం
బియాస్
నువ్వెంతటి మోసగత్తెవి....
దారిన పోయేవారిని
రా రామ్మని ఆహ్వానించావు
నీ అందాలని తమతో బందీగా
తీసుకు వెళ్ళాలనుకున్న పువ్వులని
చిదిమేసి నీ గర్భాన దాచుకున్నావ్
ఎందరో తల్లులకి గర్భశోకం మిగిల్చిన
నిన్ను నదీమ తల్లిగా ఎలా కీర్తించం!
తెలుగుతోటంతా ధ్వంసమై
కన్నీరుమున్నీరవుతూంది
నువ్వెంత ప్రమోదమో....
అంతకంత ప్రమాదకారివని హెచ్చరిస్తూ....
మా దుఃఖరాశులన్నీ ఘనీభవించిపోయి
నీలా నడకలు సాగించమని
ఉద్భోదిస్తూ.... ఉన్నావా? "బి యాస్"
2 కామెంట్లు:
"ఎందరో మాతృమూర్తులకు గర్భశోకం మిగిల్చిన నిన్ను నదీమ తల్లిగా ఎలా కీర్తించగలం"
నిజమేనండీ ఇంత ఘోరం కళ్ల ముందే జరుగుతున్నా ఏమీ చేయలేని తోటి మిత్రులు, జరిగిపోయిన తర్వాత కూడా ఏమీ చేయలేని తల్లిదండ్రులు,ప్రభుత్వం ..
ప్రకృతి ముందు అందరూ నిస్సహాయులే అని మరోసారి రుజువయ్యింది ..!
ప్రకృతి కన్నతల్లిలాంటిదంటారు....మరి ఎందుకీ విషాదమో, హృదయం ధ్రవించేలా వ్రాసారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి