మా ఇంటికి సమీపంలోనూ,చుట్టుప్రక్కలా విరివిగా కనబడే అబెలియా రోజ్ క్రీక్ పూపొదలు.
అందమైన తెల్లని పూలతో పాటు తరువంతా చిగురుటాకులు పూమొగ్గల్లా కనబడతాయి. పరీక్షగా చూడండి లేత చిగురుటెరుపులా కనబడేవన్నీ ఆకులే .
ఇక ఈ పూల లోని మకరందం కోసం గండు తుమ్మెదలు రొద చేస్తూ తిరుగుతూనే ఉంటాయి. ప్రొద్దు ప్రొద్దుటే చిన్న చిన్న తేనెటీగల కోసం ఆ పూపొదల చుట్టూ చక్కర్లు కొట్టే పిచ్చుకలకంటే పెద్దవైన పక్షులు వాటి బుచుకు బుచుకు అనే రవాలు బహుముచ్చటగా ఉంటాయి.
ఈ అబెలియా రోజ్ క్రీక్ పొదలు చాలా చోట్ల కనబడ్డాయి. రోడ్డు ప్రక్కన ఉన్న విశాలమైన జాగాలలో క్రమపద్ధతిగా నాటబడి అందంగా కనబడుతూ ఉంటాయి.
ఇలా నా చేత ఆకర్షింపబడిన చెట్లు పూల మొక్కలవలన నాకు బాగా ఇష్టమైన కాలక్షేపం కేమీ కొరతలేదు. ప్రకృతిని ప్రేమించడానికి ఇంతకన్నా కారణమేమి కావాలసలు :)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి