జీవన పరిమళం
వెనుదిరిగి చూడకు. ఆ త్రోవతో నీకిక పనిలేదు.
సీతాకోకచిలుక వెనుదిరిగి చూసుకుంటుందా
మనసు హెచ్చరించింది
నిజమే మరి
ఆనంద నృత్యాలు విషాద సమయాలు దీర్ఘంగా కొనసాగవు.
మనమంతా పథికులం
కొలది హృదయాలు కొలమానం లేని కలలు
చెరపనలవికాని జ్ఞాపకాలు
నీటిలో అలలు లాంటి మనో మాలిన్యాలు
మోసుకుంటూ ముందుకే నడవాలి
పరిమళాన్ని జల్లుకోని తుమ్మెదలా చలిస్తూనే వుండాలి.
సంకోచం జంకు భయం అన్నీ మనసువి
గుండెతో దైర్యం తో అడుగులేస్తూనే వుండాలి.
దీపం కింద చీకటి సహజమైనట్టే
మనిషి చెట్టుకు చిగురాశను ఊతగా తొడుక్కోవాలి
అదే జీవన పరిమళం.
.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి