హాల్లో అడుగు పెట్టగానే నేను అవాక్కయి రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండిపోయాను. ఆర్ట్ స్టూడెంట్, ఇరవయ్యేళ్ళ అమ్మాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో రకరకాల భంగిమల్లో తయారుచేసిన తెల్లని రొమ్ముల శిల్పాలు ప్రదర్శనకి పెట్టింది. నేను సిగ్గుపడుతూ రహస్యంగా ”ఇలాంటి శిల్పాలు చేసేందుకు ఆ అమ్మాయికి సిగ్గనిపించలేదా?” అని అడిగాను అమ్మని.
”ఎందుకు సిగ్గుపడాలి? ఈ శరీర భాగాల వల్ల అమ్మాయిలూ, ఆడవాళ్ళూ ఎంత హింస అనుభవిస్తున్నారు? రద్దీలో ఉన్నప్పుడు అయ్యే అనుభవాలు వాళ్ళకే తెలుసు. ప్రకృతి ప్రసాదించిన అవయవాలని చూసి సిగ్గుపడడం దేనికి రూహీ? వీటిని అశ్లీలంగా చూపించడం మాత్రం తప్పే. యుక్తవయసు కుర్రాళ్ళు ఈ ప్రదర్శనని చూసేందుకు సిగ్గుపడుతున్నారని చెపితే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటారేమో.”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి