సీతాకోకచిలుకలు అంటే నాకు చాలా యిష్టం. ఫోటోలు తీయడం నేర్చుకోకముందు అవి పూల మొక్కలు మీద ఎగురుతూ వుంటే వాటి వెనుక వెళుతూ వుండేదాన్ని. అంత పిచ్చి. కింద చూపే వుండేది కాదు . ముళ్ళు గుచ్చుకుని కిందపడి.. తర్వాత మొట్టికాయలు వేసుకునేదాన్ని. మన దేశంలో సీతాకోకచిలుకల్ని ఫోటోలో బంధించడం కష్టం. అబ్బాయి ఇంటికి ఆ దేశానికి అతిథిగా వెళ్ళినప్పుడు వెనుక తోటలో రకరకాల సీతాకోకచిలుకలు. కావాల్సినన్ని ఫోటోలు . అన్నింటినీ దాచుకున్నాను. రాత్రి నిద్ర పడుతూ వుండగా కూడా ఆకుపచ్చ తోటలో పసుపు పచ్చ సీతాకోకచిలుకలు. అంత పిచ్చి. ఆ పిచ్చి నా మనుమరాలికి కూడా అంటిచ్చాను. సీతాకోకచిలుక అంశంతో నాలుగైదు కవితలు కూడా రాశాను. ఈ కవిత కూడా వొకటి.
సీతాకోకచిలుకలు పూచే కాలం - వనజ తాతినేని
ఈ కవిత తెలంగాణ ఫెడరల్ డాట్ కమ్ లో ప్రచురితం.
ఈ క్రింది లింక్ ద్వారా వెళ్లి చూసి రండి . మీ స్పందన తెలియజేయడం మర్చిపోకండి.. ధన్యవాదాలు 🙏

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి