తెలుగు సినీ వినీలాకాశంలో సాహిత్యపు పూర్ణచంద్రుడు..
సిరివెన్నెల .. వారి కలం జాలువార్చిన ఎన్ని మణి మాణిక్యాలో నాకు చాలా.. ఇష్టం.
నన్ను.. అమితంగా ప్రభావితం చేసిన ఆయన పాటలు.. నేను విననట్లు అయితే నాకు సాహిత్యంపై మక్కువ కలిగేదే..కాదు. "వాక్యం రసాత్మకం కావ్యం " అన్నారు.. విశ్వనాథ వారు. ఆ మాట సిరివెన్నెలకి.. వర్తిస్తుంది.. పదాల గాఢత, అల్లిక.. భావ ప్రకటన, ఎవరు అనుకరించలేని వైవిద్యభరితమైన సాహితి స్రష్ట .. ఆయన పాట వింటూనే.. ఈ పాట.. సిరివెన్నెల.. సాహిత్యం .. అని.. చెప్పుకునే.. అద్వితీయమైన ముద్ర.. వారిది.. నాకు బాగా నచ్చిన పాటలలో ఒకటి రుద్రవీణలో "నమ్మకు నమ్మకు ఈ రేయిని.." ఆ పాటని ఆ సాహిత్యపు విలువల్ని ఇష్టపడని వారు ఉండరేమో..
పాట.. వినోదాన్ని పంచి గాలి అలలపై.. తేలియాడించడమే కాదు.. ఆలోచింపజేస్తుంది కూడా.. చిత్ర కదాపరంగా సందేశం నిండి ఉండాల్సిన అవసరం ఉన్నాఅప్పుడే కాదు తర్వాతెప్పుడు విన్నా విన్న ప్రతి సారి శ్రోతని ఆలోచింపజేసే పాట ఎప్పుడు విన్నా క్రొత్తగా అనిపించే ఇళయరాజా.. సంగీతం, నా అభిమాన నటుడు చిరంజీవి గారి నటన,బాలు గళం లోని ఒంపులు వెరసి.. ఈ పాట.. అందరి నోటా పలకాల్సిందే! చిరస్థాయిగ మిగిలే పాట ఇది ఈ తెలుగు పాట చైతన్య పరిచే కావ్య గీతిక.రేడియో లో మరీ మరీ కోరి వేయించుకుని విన్న పాట, క్యేసేట్ అరిగి టేపు తెగిపోయే దాకా విన్న పాట, తర్వాత CD లలో పదే పదే ప్లే చేసుకుని విన్నపాట ఇప్పుడు యూ ట్యూబ్ లో ఎక్కువగా చూసే పాట ఇది . ఆ చెట్టు చుట్టూ కట్టిన చప్టాపై చిరంజీవి వేసే స్టెప్స్(02:57 సెకన్స్ దగ్గరనుండి) చూడండి ఎంత బావుంటాయో !
అలాగే ఈ పాట సాహిత్యం చూడండి..
ఒక పాటలో ఇంత సందేశాన్ని ఇవ్వడం సామాన్య మైన విషయం కాదు. పామరుడుకి కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఉండే సాహిత్యం. నిజానికి చిత్రంలో సూర్యం (సూర్యనారాయణ మూర్తి) పామురులతో కలిసి మెలిసి పోయి మంచిని బోధించే పాత్ర కాబట్టి ఇక్కడ అలాంటి సాహిత్యమే అవసరం అని కె. బాలచందర్ అనే స్రష్ట కి తెలుసు కదా ! పాటకి వివరణ కూడా అంతగా అవసరం లేని పాట. అందుకే ఈ పాట మేటి పాట.ఈ లింక్ లో వెంటనే ఈ పాటని వినాలనిపిస్తుంది .అందుకే వెళుతున్నాను. మీరూ వినండి. రండి.. కలసి విందాం చూద్దాం .
సిరివెన్నెల .. వారి కలం జాలువార్చిన ఎన్ని మణి మాణిక్యాలో నాకు చాలా.. ఇష్టం.
నన్ను.. అమితంగా ప్రభావితం చేసిన ఆయన పాటలు.. నేను విననట్లు అయితే నాకు సాహిత్యంపై మక్కువ కలిగేదే..కాదు. "వాక్యం రసాత్మకం కావ్యం " అన్నారు.. విశ్వనాథ వారు. ఆ మాట సిరివెన్నెలకి.. వర్తిస్తుంది.. పదాల గాఢత, అల్లిక.. భావ ప్రకటన, ఎవరు అనుకరించలేని వైవిద్యభరితమైన సాహితి స్రష్ట .. ఆయన పాట వింటూనే.. ఈ పాట.. సిరివెన్నెల.. సాహిత్యం .. అని.. చెప్పుకునే.. అద్వితీయమైన ముద్ర.. వారిది.. నాకు బాగా నచ్చిన పాటలలో ఒకటి రుద్రవీణలో "నమ్మకు నమ్మకు ఈ రేయిని.." ఆ పాటని ఆ సాహిత్యపు విలువల్ని ఇష్టపడని వారు ఉండరేమో..
అలాగే ఈ పాట సాహిత్యం చూడండి..
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనక
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు
శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలూ పలుకును కద
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినిని
సగసని సని దనిదమదమ దనిదమపగ
ఒక పాటలో ఇంత సందేశాన్ని ఇవ్వడం సామాన్య మైన విషయం కాదు. పామరుడుకి కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఉండే సాహిత్యం. నిజానికి చిత్రంలో సూర్యం (సూర్యనారాయణ మూర్తి) పామురులతో కలిసి మెలిసి పోయి మంచిని బోధించే పాత్ర కాబట్టి ఇక్కడ అలాంటి సాహిత్యమే అవసరం అని కె. బాలచందర్ అనే స్రష్ట కి తెలుసు కదా ! పాటకి వివరణ కూడా అంతగా అవసరం లేని పాట. అందుకే ఈ పాట మేటి పాట.ఈ లింక్ లో వెంటనే ఈ పాటని వినాలనిపిస్తుంది .అందుకే వెళుతున్నాను. మీరూ వినండి. రండి.. కలసి విందాం చూద్దాం .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి