22, డిసెంబర్ 2010, బుధవారం

వేణువు అనురాగ గీతీక.

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
నేను.. చాలా చిన్నప్పుడు కాన్వెంట్ కి  డుమ్మా కొట్టి రోడ్డు మీద షికార్లు చేస్తూ మా మైలవరంలో.. తెగ బిజీగా తిరిగేస్తున్నా.

అప్పుడు ఎక్కడ నుండో గాలి  అలలపై అల్లనల్లగా తేలుతూ మంద్రంగా ప్రవహిస్తూ ఒక తీయని స్వరం నన్ను తాకింది.

అప్పుడు అదొక వేణు గానమని పాటలో భాగమని నాకు తెలియదు.

వెంటనే.. వెళ్ళిపోయి ఎక్కడనుండి విన వస్తుందో ఆ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నా.. అక్కడ అంతా మనుషుల కోలాహలం .

ఒక నాలుగు పలకల పెట్టె చుట్టూ  కూర్చుని అందులో వచ్చే బొమ్మలని చూస్తూ పాట వింటూ ఉన్నారు. ఇంతలో నన్ను చూసి లొపలకి పిలిచి కూర్చోమన్నారు.

నేను ఎమా ధైర్యంగా కూర్చుని ఆ సినిమాని అంతా చూసాను.

తర్వాత చెప్పారు ఆ ఇల్లు మా నాన్నగారి స్నేహితుడి ఇల్లని. ఆయన అన్నయ్య అమెరికా లో ఉంటాడని ఇక్కడికి వస్తూ టి.వి. అనబడు సాధనాన్ని, అమెరికా అమ్మాయి అనే తెలుగు సినిమా కేసెట్టు  తెచ్చి అందరికి గొప్పగా చూపిస్తున్నాడని ..

నాకైతే.. బోలెడంత ఆశ్చర్యం తో పాటు.. ఒక వేణువు వినిపించెను పాట తెగ నచ్చేసింది.
తర్వాత తర్వాత రేడియోలో ఆ.. పాట వింటూ తెగ ఆనంద పడేదాన్ని.
ఇప్పటికి అంతే అనుకోండి.
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఆపాట కోరే ఏకైక శ్రోతని నేనే అని మా అనౌన్సర్లకి మా ఆర్ .జే. లకి గట్టిగా తెలుసు.
అందుకే ఎస్. ఎం ఎస్ ల కోటాలో కూడా  పూర్తిగా పాట వినిపించి నేను నొచ్చుకోకుండా నా అభిమానాన్ని గెలుచుకుంటారు అనుకోండి అది వేరే విషయం
అసలు విషయానికి వస్తే ఆపాట అప్పుడు విన్నది మొదలు

వేణుగానం విన్నానంటే చాలు ఒడలు మరచిపోతాను. చెవులు ఊరగా వింటూ ప్రపంచాన్నే మరుస్తాను.వేణు గానానికి అంత శక్తి ఉంది..

కాబట్టే సంగీతంలో అగ్రతాబూలం వేణువుది. అలసిన మనసుని సేదతీరుస్తూ జీవశక్తిని ఇచ్చే మంత్రజాలం వేణు గానం. అందుకే అంత ఘాడమైన ముద్రతో.. .మనందరిని ఎప్పుడూ తన వైపుకు లాక్కుంటుంది.

అసలు కృష్ణుడికి వేలమంది గొపికలని ఆకర్షించే శక్తి వేణువుదే కదా కాదంటారా! అలాటి వేణువు అనురాగ గీతీక వినిపిస్తే ఎవరికి నచ్చదు చెప్పండి.. అందుకే.. ఆ పాట నాకు చాలా ఇష్టం.

ఆపాట సాహిత్యం మైలవరపు గోపి, సంగీతం జి.కే. వెంకటేష్ ఇక గాయకుడు. ఆనంద్ గొంతులో.. ఎంత మత్తు ఉందో!

ప్రకృతిలోని అందమైన వాటితో తన చెలి సొగసును పోలుస్తూ  అంతకన్నా మిన్న అని.. అతిశయంగా కీర్తిస్తూ పాడిన పాట. నాకైతే..ఎవరికైనా ఇలాటి ప్రేమికుడు.. ఒకే ఒక్కరు.. ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది మరి.

సాహిత్యం ఇదిగో.. అందుకోండి..లీనమైపొండీ!

ఒక వేణువు..వినిపించెను అనురాగ గీతిక..
ఒక రాధిక అందించెను.. నవరాగమాలిక..
సిరివెన్నెల తెలబోయను జవరాలి చూపులో.. (2 )

నవమల్లిక చినబోయెను చిరునవ్వుసోగసులో.. (2 )(ఒక )

వనరాణియే .. అలివేణికి సిగపూలు తురిమేను..(వన )
రేరాణియే.. నా రాణికి పారాణి పూసెను.. (రే ) (ఒక )

ఏ నింగికి ప్రభవించెనో.. నీలాల తారక.. (ఏ నింగికి )
నా గుండెలో.. వెలిగించెను.. శృంగారదీపిక (నా ) (ఒక ) 

ఇక చెప్పలేనండి.. ఇంత చెప్పాక. ఒక్కసారి అయినా మీరు వింటారు అనుకోండి..

తర్వాత.. వినేది లేనిదీ మీ ఇష్టం..ఇక పడుకుంటా.. వార్నింగ్స్.. వస్తున్నాయి మరి.. బై .. ఫ్రెండ్స్..
.ఒక వేణువు వినిపించెను అమెరికా ఆమ్మాయి ఈ.. పాట ఈ లింక్ లో వినండి.

ఇక్కడ చూడండీ!



5 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

meku nachinna pata gurinchi baga chepparu aa patani meru badieggoti mailavaramlo tirige samayaniki pedda sabdhamtho aacinema choosto unna me nnannagari snehituni kutumbaniki jai pade pade meku aa pata gurtu chestuna me manasuloni korikaku jai

Raj చెప్పారు...

ఈ పాట నాకిష్టమైన పాటల్లో ఒకటి. చిన్నప్పుడు పదే పాడ్ పాడుకున్న పాటల్లో ఇదీ ఒకటి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఆహా .. రాజ్ గారు .. ఈ పాత ని ఇష్టపడిన లిస్టు లో మీరు కూడా ఉన్నారన్నమాట . బావుందండీ!! థంక్ యు సో మచ్ అండీ!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

sanlav గారు నా బ్లాగ్ లో వచ్చిన మొట్ట మొదటి కామెంట్ అండీ మీ కామెంట్ . చూడండి నేను ఎన్ని నాళ్ళకి థాంక్స్ చెపుతున్నానో ! ఐ యాం ఎ స్టుపిడ్ నో డౌట్ .

:) అప్పుడు థాంక్స్ చెప్పాలని అనుకోలేదండి ఇప్పుడు చూస్తే అయ్యో! ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను అనిపించింది

హితైషి చెప్పారు...

మీ టేస్ట్ చాలా డిపరెంట్. పాట సంగతి వినకుండానే ఇదొక మంచి పాత నాయి తెలిసి పోతుంది విన్నాక మెచ్చుకోకుండా కామెంట్ ఇవ్వకుండా ఉండలేం. nice