23, డిసెంబర్ 2010, గురువారం

వస్తావు కదూ!

వస్తావు కదూ! 

నువ్వు లేనప్పుడు అంతా యథాతథంగానే ఉందని అనుకున్నాను 
కానీ ఇప్పుడు నాకు ఒక పెద్ద తేడా తెలుస్తోంది 
నువ్వు లేకుండా నేను అలసిపోయి నిస్తేజంగా ఉన్నాను 
నీ ప్రేమ లేకుండా జీవితం విచారంగా నిశ్శబ్దంగా ఉంది.

నీ అభావం వల్ల కలిగిన ఈ శూన్యపు కఠోర వాస్తవాలన్నింటినీ 
మార్చడానికి నువ్వు ఎప్పుడు వస్తావు?  
ప్రతిదాన్నీ ఒకప్పుడు ఉన్నంత ఆనందమయంగా ఎప్పుడు మారుస్తావు? 

నువ్వు లేకపోవడం ద్వారా ఎడబాటు వేదనను నాకు నేర్పించావు.
జగత్తు ఎల్లప్పుడూ ఒక మిథ్య, వాస్తవికత ఎల్లప్పుడూ గ్రహించబడని 
భ్రమ అయినప్పుడు నువ్వు తప్పక వస్తావు.
వస్తావు కదూ! 
కలలోకి అయినా వస్తావు కదూ! 

12/08/2010.



కామెంట్‌లు లేవు: