శతవసంత సాహితీ మంజీరాలు..సాహిత్యం పట్ల అభిమానం ఉన్నవారికి రేడియో..వినేవారికి..ఈ..పేరు సురపరిచితం.ఒక దశాబ్దం క్రిందట..ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యే ఉదయ రేఖలులో ఈ.. కార్యక్రమంతో..అభిరుచి గల శ్రోతలకి అనుబంధం ఇంతా అంత కాదు. "పుస్తకం హస్త భూషణం" అన్నారు.అలాటి రోజులు పోయి..టీ.వి. రిమోట్ కొన్నేళ్ళు, తర్వాత మొబైల్,ఎఫ్.ఎమ్.చానల్స్ రాజ్యమేలి ఇప్పుడు.. అంతా..వల లోకంలో..విహరిస్తుంటే.. ఇంకా.. పుస్తక ప్రియులకి చోటెక్కడ అనకండి. వాస్తవానికి ఇందులో కొంత నిజం ఉన్నప్పటికి .. పుస్తక ప్రియులకి కొదవ లేదు. మానసిక వికాసానికి ఆలోచనా పరిపక్వతకి.. పుస్తకం చదవడం ఎంతో అవసరం. మన సంస్కృతిని, సాహితి వైభవాన్ని..పరిచయం చేసిన కార్యక్రమమే.. శతవసంత సాహితీ మంజీరాలు..నేను విన్న రేడియో కార్యక్రమాల్లో మేలిమి,పేరెన్నిక గల్గిన కార్య క్రమం ఇది. శ్రీమతి.ప్రయాగ వేదవతి గారు..ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులుగా..ఉన్న సంవత్శరాలలో.. ప్రోగాం ఎగ్జిక్యుటివ్ గా శ్రీ..నాగసూరి వేణుగోపాల్ గారు ఉన్నప్పుడు.. అత్యంత ఆసక్తి కల్గిన కార్యక్రమాలు..రూపొందించి శ్రోతలకి సాహితీ పిపాసని.. పెంచారు.. ఒక మోడరేటర్ గా నాగసూరిగారు..పరిచయ కార్యక్రమం నిర్వహిస్తే.. వినే శ్రోతలకి.. ఎంతో..అవగాహన లభించేది. "నవకవితావేదిక" ద్వారా యింతో మంది కవులని వెలికిదీసింది..ఆకాశవాణి. ఇక విషయం ఏమిటంటే.. శతవసంత సాహితీ మంజీరాలు గురించి... పుస్తకం ప్రపంచ చూడటానికి గవాక్షం లాటిదట.ఒక రచయిత..అతని (లేదా)ఆమె.. సమ కాలంలో.. సామాజిక పరిస్థితులు,సాంస్కృతిక జీవనం,నైతిక విలువలు,కట్టుబాట్లు,కుటుంబజీవనం,ఆచారవ్యవహారాలు తెలుసుకోవాలంటే.. పరోక్షంగా.. చరిత్రని చెప్పే ఆ కాలంనాటి సాహిత్యంని చదవాల్సిందే.. అలాటి బృహత్తర కార్యక్రమం చేపట్టి.. వందేళ్ళ మన తెలుగు సాహిత్యం గురించి నవల,కవిత్వం,పద్యం ,గద్యం,కథ,నాటిక,ఇలా.. సమగ్ర సాహిత్యం గురించి.. ప్రముఖులైన సాహితివేత్తలతో..వ్యాసరూపంలో.. ఒకోక్కరితో..ఒకో లబ్ధ ప్రతిష్టులైన రచయిత రచించిన వారి.. పుస్తకాన్ని.. పరిచయం చేసేవారు.. వినే శ్రోతకి.. విన్న వెంటనే..ఆ.. పుస్తకం కొనుక్కున్ని..చదివాలనే..ఆసక్తి కల్గేది. వేదవతి..గారి.. పాండిత్యం.. నాగ సూరి గారి..సైన్స్ పరిజ్ఞానం ..వెరసి.. ఒక నాలుగేళ్ళు..నేను..రేడియో విన్న కాలం స్వర్ణయుగం అంటాను నేను. విశ్వనాధ వారి "వేయి పడగలు" విద్వాన్ విశ్వం గారి "పెన్నేటి పాట" మొక్కపాటి వారి "బారిస్టర్ పార్వతీశం "దాశరధి" అగ్నిధార, గబ్బిలం, కాలాతీతవ్యక్తులు, మరీచిక, పాకుడురాళ్ళు, కొల్లాయిగడితేనేమి, కొడవటిగంటి "చదువు" కృష్ణపక్షం, ప్రతాప రుద్రీయం, శివభారతం,పానశాల,నగరంలో వాన,అతడు-ఆమె.. మహా ప్రస్తానం,అమృతం కురిసినరాత్రి, నేను-నా దేశం..ఇలా.. వందేళ్ళ సాహిత్యం వంద పుస్తకాలు.. పరిచయం.. ఆకాశవాణి.. శబ్ద రూపంలో ఉన్న గ్రంధాలయంగా..భాసిల్లిన రోజులవి.. ఎంత అక్షర సుగంధం.సాహిత్యం,సంగీతం,సామాజిక సమస్యలపై అవగాహన కల్గించడం, సమాచారం,వినోదం అన్నీ..సమపాళ్ళలోఅందించే కామధేనువు లాటి ప్రసారసాధనం రేడియో. బహుజన సుఖాయ -బహుజన హితాయ కి..నిర్వచనమై.. శ్రోతలని అలరించే..ఆకాశవాణికి సాటి మరేది లేదు. ప్రస్తుతం ప్రసారభారతి.. ఆద్వర్యంలో మనుగడ సాగిస్తూ/నిధుల కొరత అనే..స్టాక్ డైలాగ్ తొ.. మసకబారి పోతుంది. వివిధభారతి ప్రసారాలలో.. జనప్రియ,అభిరుచి,వినోధవల్లరి మాయమైపోయాయి.. జనరంజని చిక్కి శల్యమైంది.తాత్కాలిక సిబ్బందితో.. రోజులు.. నెట్టుకోస్తుంది.బూజు పట్టిన రేడియోలని దులిపి మరీ వినిపించిన హలో.. వివిధభారతి..ఎక్కడ.!? సాహిత్య ప్రసంగాలు..నల్లపూస. ప్రేవేట్ ఎఫ్ .ఎమ్ ల తొ.. రేసు గుర్రంలా.. పరుగులు పెడుతూ..వాణిజ్యాన్ని నూరు శాతం వంటబట్టించుకుని..ముక్కల పాటలు, కొత్త కార్యక్రమాల రూప కల్పన లేకుండా మూసపోత ధోరణిలో నాణ్యత లేని కార్యక్రమాలు.. అర్ధం-పర్ధం లేని..ఆంక్షలు.. కులం-మతం వివక్షలు..ఇదీ.. నేటి ఆకాశవాణి స్థితి. ఎంతో మంది కళాకారులని తీర్చి దిద్దిన ఆకాశవాణి ఇదేనా..అన్న అనుమానం కల్గుతుంటుంది. ఇప్పటికి ఉన్న అప్పటి తళుక్ తారలు.. బి.జయప్రకాశ్,కుసుమ, ఏ.శారద ఇప్పుడు నామ్ కే వాస్త్! ఎఫ్ ఎమ్ సందడిలో..సరాగమాలలో.. అందమైన వాఖ్యానం తో అలరించే "శ్రీ రాజ్", పద్మకళ, వైష్ణవి, సత్య,అను,వారిజ,అనిత,శాంతి,వీణ,విద్య, సంజయ్, జాక్ జిల్..జానీ.. ఇలా..అందరి రాకింగ్ తొ..ఇది ఇప్పటి వైభవం. ఆకాశంలోఎంత ఎత్తులో .. ఎగిరే విమానానికి అయినా ఎగరడానికి.. నేల ఆధారం.అలాగే కళలకి.. కళాకారులకి..పుట్టినిల్లు అయిన ఆకాశవాణి..సామాన్యుడి..విజ్ఞాన, వినోద ప్రపంచం. మంచి-చెడు చెప్పే మాస్టర్ ! అక్కడే..అందరూ .. తమ ఉనికిని చాటుకోవాలి. అందుకే.. రేడియోని చిన్న చూపు చూడకుండా.. బ్రతికించుకుందాం. మరిన్ని మంచి కార్యక్రమాల రూపకల్పనకి.. సూచనలు ఇస్తూ.. రేడియో.. విందాం రండి... అంటూ.. మా.. శబ్దాలయా ద్వారా.. వెలుగెత్తి చాటుతుంటాను. లిజనర్స్ క్లబ్ ల ద్వారా.. మనకి ఇష్టమైన కార్యక్రమాలకి బలం చేకూర్చుకుందాం. నేషనల్ లెవల్లో.. హమ్ వివిధ భారతి హై.. లో.. గొంతు కలపండి.నేను అయితే.. అందులోజాయిన్ కాలేదు సుమా! ఎందుకంటే.. నాకు జాతీయ బాష తెలియదు. ప్రపంచబాష అంతకన్నా తెలియదు. మాతృ బాష వచ్చు అనుకున్నా ఇన్నాళ్ళు. అదీ.. సాంతం రాదని అర్ధమైంది..ఏదో..ఇలా..ఈ బ్లాగ్ లోకం లో..ఇలా.. పడ్డాను. నేర్చుకుంటున్నాను. అనుభవగ్నులే గురువులు.అందరికి ధన్యవాదములు.ఇది మా విజయవాడ రేడియో కబుర్లు. .
1 కామెంట్:
బాగుందండీ..మీ ఆవేదన. మొన్నే విన్నాను. హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రతీ మంగళవారం ఉదయం 7 . 20 కి సాహిత్య భోజనం అనుకుంటా మొదలయ్యింది. నేనూ చివర్లో విన్నన్ను. ఆ కార్యక్రమం లో పుస్తక పరిచయాలు ఉంటాయట. రోజూ ఏడు గంటల వార్తల తర్వాత మన తెలుగు అని ఒక అయిదు నిమిషాల కార్యక్రమం వస్తుంది. బాగుంది వినండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి