కాలం తో.. పని లేనిదీ కారణాలతో.. పని లేనిదీ.. ప్రేమ..
అవును.. ఈ.. చిన్న వాక్యానికి అనంతమైన అర్ధం... ఇమిడి.ఉంది..
విజ్ఞులు,గురుతుల్యులు చెప్పినంత వివరంగా ..సోదోహరణంగా..నేను చెప్పక లేక పోవచ్చు.. చెప్పే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నాను.
శతాధిక చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు..గారి చిత్రం ఇది. దాసరి గారు ఈ..చిత్రానికి.. సంబంధించి..ఓ..సవాల్ ఎదుర్కున్నారని చెబుతూ..ఉంటారు. శంకరాభరణం చిత్ర విజయం తర్వాత.. కే.విశ్వనాథ్ గారి.. పేరు మారుమ్రోగుతున్న వేళ.. దాసరి గారు.. ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు.. రైల్వే స్టేషన్ లో... వారు వారి అభిమానులతో.. నడచి వెళుతూ..ఉండగా.. జనంలోనుండి...అగ్ర దర్శకుడు అని పేరు చెప్పుకోవడం కాదు.. మా..విశ్వనాథ్ లా.. ఒక కళాఖండం తీయగలవా? అని సవాల్ విసిరారట. అప్పుడు ఆయనలో.. ఆలోచనలు మొదలై.. ఒక.. చక్కని, చిక్కని కళాఖండం రూపుదాల్చింది. అదే .. "మేఘసందేశం "
1983 లో.. జాతీయ స్థాయిలో.. రెండు అవార్డ్లు సొంతం చేసుకుంది. "ఆకాశ దేశాన "పాట పాడినందుకు కే.జే ఏసుదాస్ కి , స్వరాలూ అందించిన రమేష్ నాయుడు గారికి.. ఇంకా.. ప్లే బ్లాకు ఫిమేల్ సింగర్ గా ..పి.సుశీల గార్కి, దర్శకుడు దాసరి కి, నిర్మాత గా దాసరి పద్మ గారికి.. ఇలా. ఒక్క ఈ.. చిత్రానికి.. మొత్తం 27 అవార్డ్ లు గెలుచుకున్న చిత్రం ఇది.
ఇన్ని అవార్డులు అందుకున్న చిత్రం అని నాకు అసలు తెలియక ముందరే నేను ఈ.. చిత్రాన్ని చూసినప్పుడు.. చాలా నచ్చేసింది..ఎందుకో..తెలియదు.ఆలోచనల్లో.. పరిపక్వత వచ్చేసరికి.. ఇంకా.. బాగా నచ్చేసింది. అందుకే..నా కు నచ్చిన సినిమాల్లో..మేఘసందేశం ఒకటి.
చిత్ర కధ లోకి వెళితే.. కథ లో... ఏ.యెన్.ఆర్.. రవీంద్ర బాబు.. ఒక పల్లెటూరిలో.. గౌరవనీయుడు..మంచి మనిషి. కవి కూడా. వివాహమై ఒక కూతురు కూడా..ఉంది.. నలుగురికి మంచి చెప్పే ఆదర్స ప్రాయుడైన వ్యక్తిగా..గుర్తింప
బడతాడు. అతని భార్య లక్ష్మి..అతనికి తగిన విధంగా నడచుకునే భార్య.
ఆ ఊరికి.. ఒక దేవదాసి కుటుంబం వలస వచ్చి.. ఊరి చివర నది ఒడ్డున నివాసం ఏర్పరచుకుని తమ నాట్య గానాలతో.. అందరిని అలరిస్తూ..ఉంటారు. ఆ ఊరిలో.. పురుషులందరూ.. ఆ..ఇంటికి వెళుతూ.. తమ కుటుంబాలని,పనులని నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఆ దేవదాసి కుటుంబాన్ని..మందలించి ఆ ఊరినుండి తరిమి వేయమని కొంత మంది గ్రామీణులు కోరికని రవీంద్ర బాబుకి చెప్పుకుంటారు . అతను ఆ.. ఇంటికి వెళ్ళడం అక్కడ "పద్మ "అనే దేవదాసి స్త్రీ ని చూసి ఆమె నృత్య గానానికి ముగ్దుడవడం.. అంతలోనే తేరుకుని.. ఆమెని ఊరు వదలి వెళ్ళమని మందలించడం ..ఆమె అందుకు.. సమాధానం గా.. మేము..నాలుగు ఊర్లు తిరుగుతూ.. మాకొచ్చిన విద్యలతో.. జనులని అలరించి పొట్టపోసుకునే వాళ్ళం. ఇక్కడకి.. వచ్చి చెడిపోయిన వాళ్ళు.. ఎవరు ఉండరు.. చెడిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు..అంటుంది.
మాట్లాడకుండా.. వెళ్ళిన అతను.. మళ్ళీ.. ఏదో..అయస్కాంతం లాగినట్లు.. మరుసటి రోజు అక్కడకి వస్తాడు. ఆమెని చూసి ఉత్తేజం చెంది అతనిలో మరుగున పడిన కవి మేల్కొని కవిత్వం వ్రాయడం మొదలెడతాడు. అతని భార్య.. ఆ..కవిత్వం చూసి తనని ఊహించుకునే అతను ఆ కవిత్వం వ్రాసుకున్నట్లు భ్రమపడి భద్రంగా.. బట్టల అడుగున ఆ.. కాగితం దాచుకోవడం.. తర్వాత గుడిలో.. వర్షంలో.. తడిచిన పద్మ పరిచయమై.. తమ బండిలో.. తీసుకుని వెళ్లి ఇంటి లోపలకి.. ఆమెని ఆహ్వానించడం వెళ్ళేటప్పుడు ఆమెకి పసుపు -కుంకుమలు ఇవ్వడం.. ఆమె వెళ్ళిన వెంటనే.. నిజం తెలియడం.. బట్టల అడుగున దాచుకున్న కవిత్వం కాగితాన్ని చించి ముక్కలు చేసి పారేయడం.. ఇదంతా ..ఒక సగటు ఇల్లాలి..తనం జయసుధ పాత్రలో.. ఎంత సహజం గా.. ఒదిగిపోయాయో!
తర్వాత అన్నగారిని పిలిపించడం భర్తకి.. సుద్దులు చెప్పించి..కాపురాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయడం.. అది.. వీలు కాదనుకుప్పుడు.. ఆ అన్నయ్య ఊరి పెద్దల సహకారంతో ఆ దేవదాసి కుటుంబాన్ని.. ఆ ఊరినుండే పంపేయడం.. జరుగుతుంది. రవీంద్ర బాబులోని కవి.. ఆ ప్రేయసి ఎడబాటుతో.. ఎప్పుడూ.. ఆలోచిస్తూ.. బాహ్య ప్రపంచాన్ని మరచి..ఆమె ద్యాస లోనే..బ్రతుకుతూ..ఒక కావ్య రచన చేయడం.. ఆ.. పుస్తకఆవిష్కరణ సమయంలో .. అతనిపై ఉన్న అభిమానంతో..పద్మ కూడా రావడం.. ఆమెని ..రవీంద్ర బాబు చూడటం జరుగుతుంది. రావీద్రబాబు కూడా ఆమెని పిలుస్తూ జనంలో వెతుక్కుంటూ వెళ్ళిపోవడం .. అతనిని వారించబోయిన అన్నగారిని లక్ష్మి.. వారించి.. " ఆయన మనసంతా.. ఆమె నిండి ఉంది... బాహ్యంగా ఆయన ఇక్కడ ఉండేకన్నా పూర్తిగా ఆమె దగ్గర ఉంటేనే.. మంచిచి..ఆయనని వెళ్ళనీ అన్నయ్యా " అంటుంది. భర్త మనసును అర్ధం చేసుకున్న ఆమె తీరు ప్రేక్షకులని ముగ్ధుల్ని చేస్తుంది . అతి సాధారణంగా మెలుగుతున్నట్లు కన్పించిన ఆ స్త్రీ మనసు,ఆమె ఆలోచనల్లోని..పరిణితి..చాలా హృద్యంగా ఉంటుంది.
పద్మ ని వెదుకుతూ.. వెళ్ళిన అతను.. ఎక్కడెక్కడో..తిరగడం.. అటు భార్య దగ్గర లేక , ప్రేమించిన ఆమెని చేరుకోలేక .. మతి భ్రమించిన వాడిలా..తిరుగుతూ ఉంటాడు . ఆ విషయం తెలుసుకున్న పద్మ ఓ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి ఆతన్ని.. రప్పించే యోచన చేయడం .. అనుకున్నట్లుగానే.. అతను అక్కడికి రావడం.. పద్మకి.. చేరిక అయి ఆమె ప్రేరణతో కవిగా ఎన్నో.. రచనలు చేయడం ఇది కథ . ఇంతటి కథ వెనుక .. అసలు.. కారణం .." ప్రేమ" అది.. పెళ్లి అయి భార్య బిడ్డలతో.. గౌరవనీయుడిగా బ్రతుకున్న వ్యక్తి మదిలో..మెదిలిన ప్రేమ భావన. అది.. ఆకర్షణ లో..పుట్టిన ప్రేమ కాదు. మోహంలో.. పుట్టిన ప్రేమ అంతకంటే కాదు. ఇద్దరు.. కళాకారులకు సంబంధించిన హృదయ స్పందన. దానికి.. కాలంతోను.. కారణాలతోను.. పని లేకుండా జనియించిన ప్రేమ . ఎవరికి ఎప్పుడు ఎవరిపై ప్రేమ ఎప్పుడు ఎందుకు కల్గుతుందో చెప్పలేం..కూడా! అదే..జరిగింది ఆ కధలో.. అల్లా.. జరిగిన ఆ కథలో .. అందరి చేతా చులకన చేయబడిన పాత్ర పద్మ పాత్ర .. జయ ప్రద తప్ప అలా.. ఎవరు చేయగలరు? ఈ.. చిత్రంలో.. ఎవరి పాత్రకు తగినట్లు వారు జీవించారు. పాటలు, చిత్రీకరణ,సంగీతం ..అన్నీ..అద్భుతం. అందుకే ఈ చిత్రం ఒక కావ్యం అనదగ్గ అర్హతలు ఉన్నాయనిపిస్తుంది . చిత్రం ఆద్యంతం ఒక మధురానుభూతితో..చూడవచ్చు. ఎక్కడా ఇసుమంతైన అతిశయం లేకుండా .. మన మద్య జరుగుతున్నంత ఒక వాస్తవం లా.. సాగుతూ..ఉంటుంది. .
ఆఖరిలో.. తన కూతురి పెళ్ళికి రవీంద్రబాబు రావడం అందరికి సంతోషకరం.. పెళ్లి అయిన వెంటనే.. తిరిగి వెళ్ళాలనుకోవడం,అతను త్వరపడటం..మనసంతా పద్మ దగ్గరే.. తారట్లాడినట్లు ఉండటం.. ఏళ్ళు గడిచినా తరగని వన్నె తగ్గని ఒక సాంగత్యం, అనుబందాన్ని . తప్పక విప్పి చెపుతాయి. అతని భార్య.. లక్ష్మి పాత్రలో.. జయసుధ పాత్ర పోషణకే ...వన్నె తెచ్చేవిధంగా వ్రాసిన మాటలు.. నాకు.. చాలా.. బాగా నచ్చుతాయి. తనని వివాహమాడి ఒక బిడ్డ ఉండగా కూడా.. తనని, తన బిడ్డని నిర్లక్ష్యం చేసి..పర స్త్రీ ఆకర్షణలో.. ఇల్లు.. పరువు ప్రతిష్టలు ,ఆస్తులు..అన్నీ వదిలేసి వెళ్ళిన భర్త ని నిందించకుండా అందుకు కూడా.. తనే కారణం అని నిందించు కుంటుంది.ఒక సామాన్య స్త్రీగా భావించుకుని జీవితాన్ని రాజీ మార్గంలో నడిపించుకుంటుంది . అందుకే భర్త ఆమెని క్షమాపణ కోరినప్పుడు.. " నేను భార్యగా.. మీ మనసు తెలుసుకుని మిమ్మల్ని సుఖ పెట్టలేకపోయాను.అందుకే మీరు.. ఆమెని కోరుకున్నారు .. తప్పంతా..నాదే.." అంటూ.. నెపం ని తన మీద వేసుకుంటుంది.".. అలా ఎందుకు..ఆమెని ఆమే తక్కువ చేసుకునే..విధంగా అలాంటి సంభాషణలు పెట్టారు? అని దాసరి గారిని అవకాశం లభిస్తే ఎప్పుడైనా సరే.. అడగాలనుకునే దాన్ని.. అది పాత్ర ఔచిత్యమని.. క్రమేపి సినిమాని అనేక సార్లు చూసినప్పుడు అర్ధమైంది . సహజంగా.. జయసుధ పాత్రని తీర్చి దిద్దిన ..దాసరికి.. హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేము .
అలాగే జయప్రద పాత్ర.. అర్ధం కావాలంటే.. ప్లేటోనిక్ లవ్.. గురించి తెలిసి ఉండాలి. శారీరక సంబంధంయొక్క ప్రమేయం లేకుండా.. ఒక కళ కో.. అభిరుచి కో.. భావసామీప్యం ఉన్నందుకో.. ఇద్హరు వ్యక్తులు.. అది స్త్రీ -పురుషులు కలసి జీవించడాన్ని సమాజం సరిగా అర్ధం చేసుకోదు. అ..పోకడల్ని గమనించే.. దాసరి అ.. కధ లో.. చక్కని ముగింపు ఇచ్చారు. రవీంద్ర బాబు.. మళ్ళీ ఆమె దగ్గరకు.. వెళ్లి పోవాలనుకోవడం .. ఆమెనే కలవరిస్తూ.. ప్రాణాలు విడువడం.. పద్మకి..ఆ వార్త తెలియజేయడానికి.. వెళ్ళినప్పుడు.. రవీంద్రబాబు బావమరిదీ ఆమెని అమ్మా! ..అని సంభోదిస్తూ ..పిలవడం అ.. పాత్ర పై పెరిగిన గౌరవం అని మనకి చెపుతుంది రవీంద్ర బాబు మరణించాక అది తెలియక ముందే..ఆమె మరణించడం.. శరీరాలు వేరే..కానీ.. ఆత్మ ఒక్కటే.. వారి ఆత్మలు కూడా.. కలిసాయి అని చెప్పడం...ఎంత సహజాతిసహజంగా ఒదిగిపోయింది . చివరి వరకు.. జయసుధ పాత్ర పై ప్రేక్షకుడికి..సానుభూతి ఎక్కువ. ఆ.. సానుభూతి చెరిపేసి .. కళకి.. కళా హృదయాలకి పట్టం కట్టారు దాసరి.
ఈ చిత్రంలో.. నా.. అభిమాన పాత్ర.. జయసుధ. .. ఒక వాస్తవాన్ని.. ఎంత హుందాగా.. అంగీకరించి తన జీవితాన్ని కాల్చుకుని మరీ భర్త మార్గాన్ని సుగమం చేసింది. కొన్ని వాస్తవాలని గ్రహించి.. అందుకు అనుగుణం గా నడుచుకోవడం వల్ల వేదనలు... ఉన్నా.. ఎవరో ఒకరు.. ఆనందంగా ఉంటె చాలు కదా! అని తలపోసింది. అందుకు తగినట్లుగానే ప్రవర్తించింది. ఈ..సినిమా గురించి.. మా ఫ్రెండ్స్ మద్య ఎప్పుడూ.. చర్చ నడుస్తూ ఉంటుంది . .ఎప్పుడూ.. నేను ఆ విషయమే చెపుతాను.
ఈ.. చిత్రంలో.. అన్ని పాటలు.. అయిదు స్టార్ ..కోవ లోకే! అయినా.. నా ఫేవరేట్ "ముందు తెలిసినా ప్రభూ, ఆకాశ దేశాన .." అయితే శీత వేళ కానీయకు కానీయకు..శిశిరానికి చోటీయకు ..అనే పాట మనకి చిత్రం లో..కనబడదు. ఇదండీ .. ఈ.. చిత్ర కధ లో.. నాకు నచ్చిన అంశాలు. అందరు చూసిన చిత్రమే కావచ్చు . ఎందుకో.. నాకు ఈ చిత్రం అంటే.. చాలా ఇష్టం. ఇలా.. మీతో..పంచుకోవాలనిపించి.. చెపుతున్నాను. చూసి చాలా కాలం అయింది. కధక్రమం తప్పిందేమో..కూడా! పాత్రలైతే అలా నిలిచిపోయాయి. పాత్రల స్వభావం చెప్పాను.. ప్రేమ ఎందుకు.. ఎప్పుడు పుట్టకూడదో.. ఆలోచిస్తాను అప్పుడప్పుడు.. ఇలా.. గే.. కాకుండా.. ముందు తెలిసినా ప్రభూ .. పాటపై అమిత ఇష్టంతో .. దేవులపల్లి ని గుర్తు చేసుకుంటూ.. కూడా ! ఎవరైనా.. మిత్రులు.. ఈ.. చిత్రం గురించి చర్చించదల్చుకుంటే .. ఆహ్వానం.
ఈ చిత్రంలో.. నా.. అభిమాన పాత్ర.. జయసుధ. .. ఒక వాస్తవాన్ని.. ఎంత హుందాగా.. అంగీకరించి తన జీవితాన్ని కాల్చుకుని మరీ భర్త మార్గాన్ని సుగమం చేసింది. కొన్ని వాస్తవాలని గ్రహించి.. అందుకు అనుగుణం గా నడుచుకోవడం వల్ల వేదనలు... ఉన్నా.. ఎవరో ఒకరు.. ఆనందంగా ఉంటె చాలు కదా! అని తలపోసింది. అందుకు తగినట్లుగానే ప్రవర్తించింది. ఈ..సినిమా గురించి.. మా ఫ్రెండ్స్ మద్య ఎప్పుడూ.. చర్చ నడుస్తూ ఉంటుంది . .ఎప్పుడూ.. నేను ఆ విషయమే చెపుతాను.
ఈ.. చిత్రంలో.. అన్ని పాటలు.. అయిదు స్టార్ ..కోవ లోకే! అయినా.. నా ఫేవరేట్ "ముందు తెలిసినా ప్రభూ, ఆకాశ దేశాన .." అయితే శీత వేళ కానీయకు కానీయకు..శిశిరానికి చోటీయకు ..అనే పాట మనకి చిత్రం లో..కనబడదు. ఇదండీ .. ఈ.. చిత్ర కధ లో.. నాకు నచ్చిన అంశాలు. అందరు చూసిన చిత్రమే కావచ్చు . ఎందుకో.. నాకు ఈ చిత్రం అంటే.. చాలా ఇష్టం. ఇలా.. మీతో..పంచుకోవాలనిపించి.. చెపుతున్నాను. చూసి చాలా కాలం అయింది. కధక్రమం తప్పిందేమో..కూడా! పాత్రలైతే అలా నిలిచిపోయాయి. పాత్రల స్వభావం చెప్పాను.. ప్రేమ ఎందుకు.. ఎప్పుడు పుట్టకూడదో.. ఆలోచిస్తాను అప్పుడప్పుడు.. ఇలా.. గే.. కాకుండా.. ముందు తెలిసినా ప్రభూ .. పాటపై అమిత ఇష్టంతో .. దేవులపల్లి ని గుర్తు చేసుకుంటూ.. కూడా ! ఎవరైనా.. మిత్రులు.. ఈ.. చిత్రం గురించి చర్చించదల్చుకుంటే .. ఆహ్వానం.
6 కామెంట్‌లు:
మీ విశ్లేషణ బాగుంది. శంకరాభరణం, సిరిసిరిమువ్వకు ముందు విశ్వనాధ్ కాలాంతకులు, అల్లుడుపట్టినభరతం మొదలైన కొన్ని చవకబారు సినిమాలు కూడా తీశారు. శంకరాభరణం తర్వాత పూర్తిగా genre మార్చేసి క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ లను బేస్ చేసుకుని సినిమాలు తీశారు.
టిపికల్ దాసరి సినిమాలా ఉండదు.. అలా అని విశ్వనాధ్ సినిమాలానూ ఉండదు.. పాటల విషయంలో 'ముందు తెలిసేనా..' సేం పించ్..
Thankyou.. very much. meeru soochinchinatlu chesaanu.
“కాలం తో పని లేనిదీ, కారణాలతో పని లేనిదీ - ప్రేమ”
మేఘసందేశం సినిమా గురించి రాస్తున్న బ్లాగును ఇంతకన్న Aptగా మొదలుపెట్టలేం!
ఈ సినిమా గురించిన డీటైల్స్ ఎన్నో ఇచ్చారు. చాలా వరకు నాకు అవి కొత్త informations. ఈ సినిమాని ఒక సవాల్గా తీశారు దాసరి గారు అని తెలియదు నాకు. 27 అవార్డులు వచ్చాయనికూడా తెలియదు.
అలాగే, పాటల విషయానికి వస్తే, నాలుగు పాటలు దేవులపల్లి వారివి(సినిమా కోసం రాసినవి కాదు – ఆయన సంపుటాలనుంచి తీసుకుని ట్యూన్ చేసుకున్నవి) “ముందు తెలిసెనా ప్రభూ…”, “సిగలో అవి విరులో…”, “ఆకులో ఆకునై”, “శీతవేళ రానీయకు రానీయకు, శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు…”.
రెండు అష్టపదులు జయదేవవారివి.
మిగిలినవి వేటూరి వారివి – ఇవికూడా అద్భుతంగా ఉంటాయి!
అన్ని కోణాల్లోనూ analyze చేసి, పాత్రలయొక్క behaviourని దర్శకుడు ఏ యాంగిల్లో చెప్పాలనుకున్నాడో ఆ యాంగిల్ అర్థం అయ్యేలా చక్కగా రాశారు. ఈ సినిమాని అందరూ అభినందించలేరు.
మీరన్నట్టు ఇది చిత్రం కాదు; చలనచిత్ర రూపంలో ఉన్న ఒక కావ్యం. మొట్ట మొదట నా 10వ యేటా చూశాను ఈ సినిమా. అప్పుడే నన్నెంతగానో కదిలించింది! – చూసిన ప్రతిసారీ నాకు కొత్త అనుభవంగానే ఉంటుంది. కొన్ని కొత్త యాంగిల్స్ అర్థం అవుతాయి...
మీ విశ్లేషణ బావుంది. సినిమా చూళ్ళేదు. పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆకులోఆకునై పల్లవి చాలా బావుంటుంది కానీ చరణాల్ని బాణీపరంగానూ పాడ్డంలోనూ కొంచెం కూనీచేశారని నా అభిప్రాయం. ప్రియే చారుశీలే అష్టపదిలో చరణాలలో సంస్కృతమూలానికి తెలుగు గీతానువాదం చేసింది ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజుగారు ఎంతో లలితంగా రాశారు.
ఈ సినిమాని నా చిన్నప్పుడు చూసాను.
సినిమా కంటే పాటలే బాగున్నాయనిపించింది.
దాసరి, విశ్వనాథ్ లా సినిమా తీసినా విశ్వనాథ్ లా హిట్ చేయలేకపోయారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి