ఛీ ..వెదవదీ.. జీవితం.. ఎప్పుడు వండి పెట్టడానికో..వంగి వంగి దణ్ణాలు పెట్టడానికో అన్నట్టు కని పారేసినట్టున్నారు..అమ్మ-అబ్బా.
ఆత్రేయ గారు ఓ..పాటలో..ఆడదాని జీవిత సత్యం ఏమిటో.. ఆడాళ్ళు మీకు జోహర్లు అంటూ..రెండు చరణా లలో.. తేల్చి వేసినంత గొప్పగా ఎప్పుడు ఉండునో!
అసలే చదువల కాలం వచ్చేసి. మంచి-చెడులన్నీ తెలిసిపోయి అణగద్రోక్కుదాం అనుకున్న వాడి తలపై భరతనాట్యం,కూచిపూడి వగైరాల నాట్య రీతులతో..పాటు..బ్రేక్ డాన్సు..రాక్ డేన్సులు చేస్తున్న కాలం అనుకుంటారు కానీ..
ఎంతెంత దూరం కూసింత దూరం అనుకుంటూ ..మొదటి అడుగులోనే ఉన్నామన్న చిదంబర రహస్యం మన ఆడోళ్ళకి..తెలీదంటారా? అనుకుంటూ ఉంటూ.. అలా నిరాశ,నిసృహకి లోనవుతూ.. ఉండే మహిళలకి..స్పూర్తి నిచ్చే ఒక కథల పుస్తకం గురించి చెప్పడానికి వచ్చాను. చదివి..కాస్తంత... స్పూర్తిని..ఓపికని మూట గట్టుకుంటారని ఆశ. స్త్రీ-పురుష బేధం లేకుండా చూసేయండీ..అందరూ.
మన దేశ చరిత్రలో..ఎంతోమంది సామన్యులు అసామాన్యమైన దైర్య సాహసాలు ప్రదర్శించారో! స్త్రీలు కూడా పురుషులకి ఏ మాత్రం తీసిపోకుండా ఒకోసారి పురుషులని అధిగమించి తమ భర్తలు,కుమారులు అధార్మికంగా ప్రవర్తిస్తే వారికి బుద్దివచ్చేటట్లు చేసారు.
ఈ సమాజం గర్వించదగినవారి గాధలు నేటి యువతీ యువకులకు తెలియడం అవసరం. దైర్యం,సాహసం ,త్యాగం ఈ సమాజాన్ని ముందుకు నడిపించిన లక్షణాలని,అవే రాబోయే రోజుల్లో..ఈ సమాజాన్ని కాపాడగలవని తెలియాలి.అప్పుడే నేటితరానికి తగిన స్పూర్తి లభిస్తుంది అనే ప్రయత్నంలో.. "ఆర్గనైజర్" అనే ఆంగ్ల వారపత్రికలో..ప్రచురింప బడ్డ వీర గాధలని.. తెలుగులో..పరిచయం చేసారు.
"చూడు విద్యుల్లతా ! గత కొద్దిరోజులుగా యుద్దరంగంలో ఉన్న నాకు ఒకటి తెలిసిపోయింది..మనం ఎలాటి పరిస్థితుల్లోను కోటను రక్షించుకోలెం. అల్లా ఉద్దీన్ ఖిల్లీ కోటను వశపరచుకునే తీరతాడు.దీనిని ఆపడం మనకు సాధ్యం కాదు. అయితే ..?అమాయకంగా ఆమె ప్రశ్న. మనిద్దరం కలసి వెల్లిపోదాం..సమర సింహుడి మాటలు..విని..ఆమె చీత్కరించుకుంది... చిత్తోడ్ కోటపై..మహమదీయ పతాకం ఎగురుతుంది. రాజపుత్ర స్త్రీలందరు చితికి ఏర్పాట్లు చేసుకున్నారు. శత్రుమూకలు లోపలి జోచ్చుకుని వస్తున్నాయి..వారి ప్రక్కనే..సమర సింహుడు..విద్యుల్లత ఆశ్చర్య పోయింది. ఒక దేశ ద్రోహి తో ..తనకు పెళ్ళా?నేను ఎలాటి పరిస్థితుల్లోను అంగీకరించను..అని పదునైన బాకుని..గుండెల్లో..దింపుకుని..తనువు చాలించింది.
ఇంకొక..కథ. ఈ యుద్దాన్ని నేను చూడలేను.ఓ..ముసలి..దృడం గా అంది. బాజీరావు పీష్వా ఉలికి పడ్డాడు. మళ్ళీ ఆమె ఈ పిల్లవాడిని.. సైన్యంలో..చేర్చుకోండి..అంటూ..పదేళ్ళ మనుమడిని ముందుకు నెట్టింది. బాజీ రావు పీష్వా ఆ ముదుసలి..పద ధూళిని..కళ్ళకు అద్దుకున్నాడు. ఎందుకు..ఏమిటి.. తెలుసుకోవాలంటే.. వీరగాధ మాల పుస్తకం చదవాల్సిందే.
.
అంతే కాదు.. టిప్పు సుల్తాన్ మరణం కి..కారణం ఎవరు? పైజార్ పట్టీ ..అనే మార్గం ఎక్కడ ఉంది ఎందుకు..ఆ పేరు వచ్చింది.. త్యాగ జీవి పన్నాదాయి ద్యేయం ఏమిటో..అనే విషయాలు తెలుసుకోవాలంటే.. "శ్రీ మణి" గారు అనువదించిన దేశద్రోహితో పెళ్ళా? అనే పేరుతో..వెలువడిన పదమూడు కథల పుస్తకం చదవాల్సిందే! వీరవనితలు ఎందరో..జాతి కి స్ఫూర్తి అందించిన జీవిత గాధలని వీర గాధలుగా..చదువుతుంటే..ఒడలు పులకరిస్తుంది. త్యాగాలు మహిళల వంతు కూడా..అని ఉద్భోదిస్తుంది.
ఈ పుస్తకం సాహిత్యనికేతన్ ప్రచురణ. అన్ని చోట్ల లభ్యం.
3 కామెంట్‌లు:
ఆసక్తికరంగా ఉందండీ పరిచయం..
మురళీ గారు చాలా స్పూర్తివంతమైన కథలు. వీలైతే చదవండీ. ధన్యవాదములు.
Vanaja garu. Ee tapa chadivina ventane manavi and marikonni navalalu order chesanandi. Me blog taarasapadinanduku chala santosham ga vundi. Mimmalni tappakunda kalavalani vundi.
Swathi...
కామెంట్‌ను పోస్ట్ చేయండి