నాకు బాగా నచ్చిన కవితా సంకలనం "ఆకురాలు కాలం"
ఆ సంకలనంలో.. అన్ని కవితలు ఎంతో..బాగుంటాయి.
అందులోనుండి మచ్చుకి ఒక కవిత.
ఉద్యమ నేపద్యంలో ఉన్న తన చెలికాడు.. రాకని..అతని పోరాట పథాన్ని
అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా అతను వచ్చినప్పుడు ఆమెలో కల్గిన భావాన్ని
నిర్దాక్షిణ్యంగా రాలిపోయిన వైనాన్ని..
ఆకురాలుకాలం రాకుండానే రాలిపోయిన నిజాన్ని..
యెంత బలంగా వ్యక్తీకరిస్తారో..మెహజబీన్.
ఆకురాలు కాలం
-మెహజబీన్
అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెస్తాడు
ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళల్లో
ఆకాశ చిత్రం ఘనీభవించింది
ఆకాశ చిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది
వద్దు ...
నాకు వెన్నెలా వద్దు, పున్నమీ వద్దు
సూర్యుడొక్కడు చాలు
అతని నిరీక్షణ లో ఈ నల్లని రాత్రి అలా
గడవనీ ...
అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పాటల్ని వెంట తెస్తాడు
అతని సమక్షంలో
పోగొట్టుకున్న బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
లీలగా గుర్తుంది
వద్దు ...
నాకు వెన్నెలా వద్దు, పున్నమీ వద్దు
సూర్యుడొక్కడు చాలు
అతని నిరీక్షణ లో ఈ నల్లని రాత్రి అలా
గడవనీ ...
అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పాటల్ని వెంట తెస్తాడు
అతని సమక్షంలో
పోగొట్టుకున్న బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
శరీరం అనుభవాల పాఠశాల అవుతుంది
నేను అతని గుండెల్లో దాక్కుని పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీరనాదాల్ని తూటాలు
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీరనాదాల్ని తూటాలు
వెంటాడిన వైనం
చెబుతాడు
చెబుతాడు
అప్పుడు భయంగా అతన్ని
నా గుండెలోనే దాచుకుంటాను
అతనిప్పుడు లేదు
ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన
ఆకురాలే కాలానికి ఎక్కడ రాలిపడ్డాడో ?
అతనిప్పుడు లేదు
ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన
ఆకురాలే కాలానికి ఎక్కడ రాలిపడ్డాడో ?
1 కామెంట్:
Yes, nice poem and a nice collection. Not sure if she published any more.
కామెంట్‌ను పోస్ట్ చేయండి