మా అబ్బాయి పెళ్ళికి వచ్చిన అతిధులకి రిటర్న్ గిఫ్ట్ గా ఏవైనా ఇవాలనుకున్నప్పుడు నాకు మెదిలిన ఆలోచన నా కళ్ళ ముందు అలా మెరుపులా మెరిసింది పుస్తకం . "పుస్తకం హస్త భూషణమ్ "
అబ్బ ! ఏ స్టీల్ డిషో , టప్పర్ వేర్ డబ్బానో లేదా గాజు వస్తువులు లాంటివి కాకుండా పుస్తకాలు ఏమిటీ ? అన్నట్టు మా వాళ్ళ చూపులు. అదిగో .. పులిపాక వాళ్ళు చూడు .. గాజు తాబేలు దానిని ఉంచే గాజు ట్రే ఇచ్చారు . ఆ ట్రే లో నీళ్ళు పోసి తాబేలు ని ఉంచి ఇంట్లో ఈశాన్యభాగంలో పెట్టుకుంటే మంచిదట . అలాంటిది చూడకూడదు అన్నట్టు మా అత్తమ్మ సూచన.
ఈ మంచి ఏమిటో చెడ్డ ఏమిటో .. ఈ వస్తు వ్యామోహం ఏమిటో ,, నిజం చెప్పొద్దూ .. నాకు తిక్క వచ్చేసింది . ఏమీ మాట్లాడలేదు .
ఇక మా ప్రాంతం వైపు సాధారణంగా ఉండే లగ్న పత్రిక పంపడం అనే ఆచారమో, సంప్రదాయమో దాని గురించి పెద్దగా నాకు అవగాహన లేదు కానీ ఎవరైనా బంధువులు జరగబోయే అబ్బాయి పెళ్లి శుభవార్త చెప్పి రకరకాల స్వీట్స్ , ఒక హాట్, పండు తాంబూలం తో పాటు కానుక గా ఒక వస్తువుని పంచడం అలవాటు . అలా పంచిన వస్తువులని అలమరలలో సర్ధలేక , మనఃస్పూర్తిగా పని వాళ్లకి పంచలేక బస్తాలు కట్టి అటకపై కొన్నాళ్ళు ఉంచి మళ్ళీ తీసి కాస్త ఉదారంగా పని వాళ్లకి ఇచ్చేసి మిగిలిన వాటిని తూకం లెక్కన అమ్మేసిన విధం గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు మనసు చివుక్కుమనిపిస్తూ ఉండేది . పాపం అమ్మాయి పెళ్ళికి అత్తవారింటి బంధువులకి స్నేహితులకి కానుకలు ఇవ్వడానికి కూడా అమ్మాయి తల్లిదండ్రులు మోయలేని భారం మోయాల్సిందే! మాకు ఖరీదైన గిఫ్ట్ లు పంపాల్సిందే అని మొండి పట్టుదల పెట్టుకు కూర్చున్న అబ్బాయి తరపు వాళ్ళని చూసాను . అందుకనే మా అబ్బాయికి వివాహం నిశ్చయం చేసుకోగానే మా వియ్యాలవారితో చెప్పేసాను మాకు లగ్న పత్రిక ,గిఫ్ట్ లు ఏమీ వద్దండీ ! అలాంటి ఆచారం ఉంటే వాటికి స్వస్తి చెప్పడానికి మనమే పూనుకుందాం అని . అందుకు వాళ్ళూ సంతోషించారు .
నేను ఈ విషయమే మా ఇంట్లో చెపితే అందరూ గిఫ్త్స్ ఇస్తే తీసుకుని ఇప్పుడు నువ్వు ఇవ్వకుండా తప్పించుకుని డబ్బు మిగుల్చుకుంటున్నారు అంటూ విమర్శలు వస్తాయి .. ఆలోచించుకో అని హెచ్చరించారు .
ఓహ్ .. గిఫ్టే కదా ఇవ్వాలి అనుకున్నప్పుడు పుస్తకాలు ఇవ్వాలి అని అనిపించింది , పుస్తకాలివ్వాలి అన్నప్పుడు ఏ రామాయణమో , మహాభారతమో , భాగవతమో కాకుండా (ఇవ్వకూడదని కాదు ) కాస్త నా అభిరుచికి తగ్గట్టుగా మనిషికి వికాసం కల్గించే విధంగా అందరికి అర్ధమయ్యే విధంగా ఉండే కథల పుస్తకం ఇవ్వాలని పించింది .
వెంటనే అప్పుడే ఆవిష్కరింప బడుతున్న "కథ ప్రాతినిధ్య 2014 " కనబడింది . వెంటనే సామాన్య కిరణ్ పౌండేషన్ సామాన్య గారికి కాల్ చేసి ఆమె అనుమతి తీసుకుని ఆ పుస్తకం అచ్చేస్తున్న శ్రీ శ్రీ ప్రింటర్స్ వారికి 500 ప్రతులకి ఆర్డర్ పెట్టాను .
ఆ ఒక్క పుస్తకమేనా .. నాకు మనసులో అసంతృప్తి .. వెంటనే "జుమ్మా" నా కళ్ళ ముందు మెదిలింది. పేస్ బుక్ లో నా ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న షరీఫ్ గారికి మెసేజ్ పెట్టాను . మీ "జుమ్మా" పుస్తకాన్ని మా అబ్బాయి వివాహ సందర్భంగా వచ్చిన అతిధులకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని . వారు చాలా సంతోషించారు. అలా నేను చేసిన బహుమతి ఎంపిక చాలామంది హృదయాలకి చేరింది . ఈ రెండు పుస్తకాలు నేను ఎంపిక చేసుకోవడం వెనుక.. " జుమ్మా" కథల సంపుటి లో కానీ "ప్రాతినిధ్య కథ 2014 " సంపుటి లో కానీ వచ్చిన కథలు . ఆ కథలు నాకు ఎందుకు నచ్చాయన్నది ... వివరంగా ఒక సమీక్ష రూపంలో ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను .
అసలు నేను అనుకున్నది ఒకటి . మా విజయవాడ పరిసర ప్రాంత రచయితలని, కవులని అందరిని ఆహ్వానించి "జుమ్మా "రచయిత వేంపల్లి షరీఫ్ గారిని, సామాన్య గారిని కూడా ఆహ్వానించి .. ఒక అరగంట సమయం లోముగిసే విధంగా ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేద్దామనుకున్నాను . విపరీతమైన ఎండలు, నిశ్చయతాంబూలాలకి వివాహానికి మధ్య కేవలం వారం రోజుల సమయమే ఉండటం మూలంగా చాలామందిని ఆహ్వానించ లేకపోయినట్లే షరీఫ్ గారిని, సామాన్య గారిని కూడా ఆహ్వానించలేకపోయాను. కానీ నా ప్రయత్నం మాత్రం చాలా విజయవంతమైంది. వేదిక వద్ద బుక్ స్టాల్ పెట్టగానే మొదటి అరగంట సమయం లోనే 250 జుమ్మా ప్రతులు అయిపోయాయి . చాలా మంది కావాలని అడిగారు కూడా ! అలాగే "ప్రాతినిధ్య కథ 2014" కూడా అయిపోయాయి.
వివాహ వేదిక వద్ద అమర్చిన స్థలంలో నేను ఓ రెండు నిమిషాలు మాత్రమే ఉండి ఇద్దరికీ ముగ్గురికో పుస్తకాలని బహుమతిగా అందించాను. అదీ ఆఖరి సమయంలో . తర్వాత కూడా .. మీరు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారట కదా ! మేమ్ము పెళ్ళికి రాలేక పోయాం .. మాకు ఇవ్వండి బుక్స్ అంటూ అడిగి తీసుకున్న వాళ్ళు ఉన్నారు . నేను పెళ్ళికి రావడం లేదు .. నా బుక్స్ నాకు ఉండనివ్వు అని ఆర్డర్ వేసిన ఫ్రెండ్స్ ఉన్నారు . వారి కోసం ఒక అయిదు జుమ్మా ప్రతుల్ని దాచి ఉంచాను . ఇప్పటికి అడుగుతున్న వారు ఉన్నారు. నేను బహుమతిగా ఏమి ఇవ్వాలి.. అనుకున్నప్పటి ఆలోచన తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. కానీ ఆ సందర్భాన్ని ఒక వేడుకగా, ఇష్టంగా భద్రపరచుకోవాలి అన్న నా కోరిక తీరలేదు . కెమెరాలో అనుకున్నంత బాగా షూట్ చేయలేకపోయారు ఫోటోగ్రాఫర్ కూడా .. ఇక్కడ శీతకన్ను వేసాడు . ఆఖరిలో నేను వెళ్ళి దాచిన జుమ్మా ప్రతుల్ని బయటకి తీసి మొబైల్ లో కొన్ని చిత్రాలు తీయించుకున్నాను ఇలా ! :)
అప్పటి చిత్రాలు ఇవి .

వివాహ వేదిక పై నేను నా కొడుకు |
ప్రాతినిధ్య 2014 కవర్ పేజీ తర్వాత లోపలి పేజీలో మా ఇంటి దీపాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి