ఆది అనంత శబ్ద్ ఓం హై.. అని హిందూ ధర్మం చెపుతుంది అంటే నేను విన్నాను, గుడ్డిగా నేను నమ్ముతాను , అలా అని నా విశ్వాసాన్ని ఇతరులెవరైనా అంగీకరించకపోయినా మౌనంగా ఊరుకుంటాను తప్ప వివాదానికి దిగను.
ఎందుకంటే వేదాలు శాస్త్రాలు పురాణ ఇతిహాసాలు అన్నీ నేను చదవలేదు వాటిని అర్ధం చేసుకోగల జ్ఞానం నా దగ్గర లేదు. ఆది అనంత శబ్దం ఓం అని నేను అనుకోవడం పట్ల ఇతరులకి ఏమీ హాని లేదు కదా ! :)
ప్రతి జాతికి,మతానికి. దేశానికి .ఇంకా చెప్పాలంటే ప్రతి కుటుంబానికీ తమవైన ఒక సంప్రదాయం ఉంటుంది . ఆ సంప్రదాయం ప్రకారమే నడవాలనుకుంటారు. ఏ దేశంలో ఉన్నా తమదైన సంప్రదాయాన్ని వొదులుకోవడం కష్టం . కాలక్రమేణా అనేక జాతులు రీతులు .సంప్రదాయాలు కలిసిపోయి కొత్త సంప్రదాయాలు ఏర్పడతాయి. మళ్ళీ అదొక సంప్రదాయంగా మారుతుంది. అనేక తరాల తర్వాత నవ్యరీతులు తో జీవనం గడుపుతున్న వారిని ..అల్లదిగో ఆ సంస్కృతికి ఆ స్మృతికి వారసులు మీరు. మిమ్మల్ని ద్వేషించడమే మా పని. ఇంకా చెప్పాలంటే ద్వేషించడమే మా హక్కు అనే కొందరిని చూస్తూ ఉంటాం వాళ్ళ బారిన పడకుండా మౌనంగా మన మార్గాన మనం నడుచుకుంటూ వెళ్ళడమే . ఇతరులకి హాని చేయకుండా వాళ్ళ మనసులని కష్ట పెట్టకుండా .. చదువు సంస్కారం అంటే ఏమిటో , సాంప్రదాయం అంటే ఏమిటో తెలుసుకుని చైతన్యంగా,వివేకంగా నడవడమే ! మతం కన్నా దేశభక్తి కన్నా మానవత్వం మిన్న అని నేను ఒప్పుకుంటాను. అలాగే పౌరులకి దేశభక్తీ తో మెలగండి అని ఎవరూ చెప్పనవసరం లేదు. దేశ ద్రోహానికి పాల్పడకండి అని చెప్పడం సబబు. ఉత్తమ ఫలితాన్ని ఆశించాలనుకున్నప్పుడూ ఎలా చెపుతున్నాం అనేది కూడా చూసుకోవాలి అని నా అభిప్రాయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి