భూమిక రజతోత్సవ సంచిక మార్చి మాస పత్రికలో ..నేను వ్రాసిన "నూతిలో గొంతుకలు " కథ.
పత్రికలో కథని చదవండి ప్లీజ్ !
ఆడాళ్ళకి చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడల్లా ఇదిగో ఇట్టాంటి నూతులే సీతమ్మని భూదేవి తల్లి తనలోకి పొదువుకున్నట్టు చల్లగా అక్కునజేర్చుకుంటుంది. వినిపించుకునే మనసుండాలే కానీ వేల వేల నూతుల్లో నాలాంటి స్త్రీల లోగొంతుకలు వినబడుతూనే ఉంటాయి. నీ కలం అరువిచ్చి ఈ గొంతుకలని వినిపించు చెల్లీ .. ఇంటింటికి ఒక నుయ్యి లేకపోయినా వీధి వీధికి ఒక నుయ్యి అయినా ఉండాలి. జనం నీళ్ళు త్రాగడానికి కాదు. మన ఆడాళ్ళు కన్నీళ్లు దాచుకోవడానికయినా నుయ్యి ఉండాలి. నూతులని పూడ్వ నీయకండి. తరతరాల ఆడాళ్ళ ఆత్మాభిమానాన్ని ఇలాగన్నా నిలుపుకోనీయండి, వికృతమైన మగాడి కోరికల అగ్గి నుండి తప్పించుకుని పుట్టిళ్ళు ఆదరించకపోయినా నిస్సహాయతలో ఆదుకోవడానికి ఓ తోడు ఉండనివ్వండి అంటూ తలని నీళ్ళలోకి వంచింది ఆమె. నేను తేరుకునే లోపే గుడ గుడ మనే శబ్దం నూతి మధ్యలో. నీళ్ళు కాసేపు వలయాలుగా తిరిగి తిరిగి నిశ్చలంగా నిలబడిపోయాయి.
(నూతిలో గొంతుకలు )

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి