పొద్దున్నే దినపత్రిక చూసినా , వార్తా ఛానల్ ని చూసినా , ఎక్కడ విన్నా స్త్రీలపై ,పసిపిల్లలపై అత్యాచార వార్తలు. విని వినీ అది అలవాటుగా అయిపోయింది. ఎంతగా అంటే అదొక సాధారణ విషయంలా . జ్యోతి వలబోజు గారూ 2015. లో మహిళా దినోత్సవం సందర్భంగా ... మాలిక వెబ్ పత్రిక కోసం అత్యాచారాల పై నిరసన తెలుపుతూ కవిత్వం వ్రాయండి వనజ గారూ అని అన్నారు . ప్రేమగా చెపుతున్న, కోపంతో చెపుతున్నా శిక్షలు వేస్తున్నా సమాజంలో అత్యాచారాలు జరగడం ఆగలేదు. చాలా కోపంగా వున్నానేమో .. ఆవేశంలో కవిత వ్రాసేశాను . ఆ కవిత చదివిన చాలామంది ఆ తీవ్రతకి ఆశ్చర్యపోయారు. కొంతమంది చదివి వినిపించండి అన్నారు .. రేవతీ రావూరి మీ గొంతుతో వినాలని వుంది అన్నారు. అప్పుడు అంత పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కథలని శబ్దంతో రికార్డ్ చేయాలన్న తలంపులో వున్న నాకు ఈ "పునీత" కవిత ను నా గొంతుతో వినిపించాలనిపించింది. అందుకే ..ఈ ప్రయత్నం.
ఒక స్నేహితురాలైతే ..తల్లీ ..నీ గొంతుతో ఈ కవిత వినిపిస్తే చెవుల్లో నుండి రక్తం కారడం తధ్యం అని దీవించింది ..అది మరీ మంచిది అన్నాను. భావతీవ్రత తెలియాలి కదా ! సరే నా ఈ ప్రయత్నం చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుగా కాకుండా కొంచెమైనా ప్రయోజనం వుంటే బాగుండును. అదేనండీ ..విన్నవారు కాస్త ఆలోచించి విచక్షణతో మెలిగితే చాలు. మరి వింటారు కదూ ..
పునీత ..కవిత .. టెక్స్ట్ లో ఇక్కడ ..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి