continued.. behind her smile...
ప్రేమా పెళ్ళి రెండూ శిక్షే
హృదయం ఒక పద్మ వ్యూహం
ప్రవేశించడమే నీ తొలి వ్యూహం
మనఃఫలకంపై ఏనాటివో అస్పష్టమైన గీతలు
కాలాన్ని యుగాలుగా కొలవడమెందుకు
నీ జీవితకాలంతో కొలిస్తే చాలంటావ్ కదా
సంధ్య రంగులని అరువుతెచ్చుకుని
నీ కాలంతో నువ్వెంతగా మమేకమై ప్రవహించావో
అదొక నీటిపై రాత
ఇచ్చేది ఏదైనా హృదయంతో ఇస్తే
అనేక అనుమానాలతో పుచ్చుకోవడం
ఇవ్వాల్సి వస్తే అయిష్టం ఆనవాయితీ అయినప్పుడు
ఒకోసారి రెప్పల దారంతో ముత్యాలను కుట్టుకున్నట్లు
మరొకతూరి సరస్వతి నదిని తలపిస్తూ..
ఖాళీలు పూరింపబడటానికే పదాలను వెతుక్కుంటూ
స్వగతంలో అనుకుంటానిలా
తొలి ప్రేమ లోని పరిమళానివి
గత కాలపు చిరునామా లో మిగిలిన ద్వేషానివి
వర్తమానానికి వొక జ్ఞాపకానివి
మొత్తానికి జీవిత కాలానికి వ్రాతకర్తవి.
తగని శిక్షవి మగులకివి తప్పనివి
ప్రేమా పెళ్ళి రెండూ శిక్షే
హృదయం ఒక పద్మ వ్యూహం
ప్రవేశించడమే నీ తొలి వ్యూహం
మనఃఫలకంపై ఏనాటివో అస్పష్టమైన గీతలు
కాలాన్ని యుగాలుగా కొలవడమెందుకు
నీ జీవితకాలంతో కొలిస్తే చాలంటావ్ కదా
సంధ్య రంగులని అరువుతెచ్చుకుని
నీ కాలంతో నువ్వెంతగా మమేకమై ప్రవహించావో
అదొక నీటిపై రాత
ఇచ్చేది ఏదైనా హృదయంతో ఇస్తే
అనేక అనుమానాలతో పుచ్చుకోవడం
ఇవ్వాల్సి వస్తే అయిష్టం ఆనవాయితీ అయినప్పుడు
ఒకోసారి రెప్పల దారంతో ముత్యాలను కుట్టుకున్నట్లు
మరొకతూరి సరస్వతి నదిని తలపిస్తూ..
ఖాళీలు పూరింపబడటానికే పదాలను వెతుక్కుంటూ
స్వగతంలో అనుకుంటానిలా
తొలి ప్రేమ లోని పరిమళానివి
గత కాలపు చిరునామా లో మిగిలిన ద్వేషానివి
వర్తమానానికి వొక జ్ఞాపకానివి
మొత్తానికి జీవిత కాలానికి వ్రాతకర్తవి.
తగని శిక్షవి మగులకివి తప్పనివి
1 కామెంట్:
Nice Blog
కామెంట్‌ను పోస్ట్ చేయండి