కొత్త కథా సంపుటి తేవాలన్న ఆలోచన రెండేళ్ళుగా వుంది. అయితే… అముద్రిత కథల పుస్తకమైతే యెలా వుంటుందని ఆలోచన రావడంతో ఆ ప్రయత్నం చేసాను.
“ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటిలో పది అముద్రిత కథలు ఒకటి వెబ్ పత్రికల్లోను ఒకటి ప్రింట్ లోను రెండు కథలు ఫేస్ బుక్ లో పాక్షికంగానూ ప్రచురించిన కథలు.
ఒక రచయిత కథకు మరొక రచయిత సమీక్ష/విమర్శ/ విశ్లేషణ రాస్తే ఎలా వుంటుంది!? అన్న ఆలోచన కూడా వచ్చింది.
ఆలోచన వచ్చినదే తడవుగా సహ రచయితలతో నా ఆలోచనను పంచుకున్నాను. అందరూ “మంచి ప్రయోగం!! తప్పకుండా పుస్తకం తీసుకొని రండి ” అని ప్రోత్సహించారు.
“ఈస్తటిక్ సెన్స్” కథాసంపుటి లోని ఒక్కొక్క కథకు ఒక్కో సహరచయిత యొక్క సమీక్ష/విమర్శ/ విశ్లేషణ రాసి ఇచ్చారు. .
“ఈస్తటిక్ సెన్స్”
అముద్రిత కథలు మరికొన్ని
ముందుమాట: ఎస్. నారాయణ స్వామి. (కొత్తపాళీ)
కథలను విశ్లేషించిన సహ రచయితలు…
ఈస్తటిక్ సెన్స్ - Dr. గీతాంజలి భారతి
ఊహల మడుగు - Dr. శైలజ కాళ్ళకూరి
వాతాపి జీర్ణం - పద్మజ సూరపనేని
ఋణ బంధాలు - ఆర్.దమయంతి
విముక్తం - పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి
ప్రేమే నేరమౌనా - రాధ మండువ
పైడి బొమ్మ - శశికళ ఓలేటి
చిట్టిగుండె - ఎమ్ ఆర్ అరుణ కుమారి
దృశ్య భూతం - వారణాసి నాగలక్ష్మి
కోకిల తల్లి - శాంతి ప్రబోధ వల్లూరి పల్లి
రెండు లక్షలు - శ్రీదేవి సోమంచి
కుబుసం- అంజని యలమంచిలి
ఔనా! - జ్వలిత దెంచనాల
చెరగని గీత - లక్ష్మి రాయవరపు
ప్రస్తుతం ప్రచురణ దశలో వుంది. ISBN కూడా వుంది. సెప్టెంబర్ 1వ తేదీ..2022 న విడుదల.
- ధన్యవాదాలతో.. వనజ తాతినేని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి