కొన్ని పాటలు గుండెల్ని పిండేస్తాయి. విన్నప్పుడే కాదు. ఎప్పుడు గుర్తుకు వచ్చినా సరే! అలాటి పాట..గురించి.. నా మాట. 1993 లో..వచ్చిన "రుడాలి " చిత్రం .. ఆ సినిమలో నటించిన "డింపుల్ కపాడియా" తన "శనిచరి" పాత్ర నటనకి గాను నేషనల్ అవార్డ్ అందుకున్నారు. భారతీయ ప్రఖ్యాత బెంగాలి రచయిత్రి మహా శ్వేతాదేవి రచించిన "రుడాలి" నవల ఆధారంగా.. కల్పనా లాజ్మి దర్శకత్వం వహించిన చిత్రం. ఫ్రేమ్ ఫ్రేమ్ కి. అభిమానిని నేను. చలన చిత్రం కాదు అది జీవన చిత్రణ. కొన్ని పాత్రల సజీవ చిత్రణ. ఇక పాటల విషయానికి వస్తే..అన్ని పాటలు.. సన్నివేశానికి తగ్గట్టుగా.. ఉంటాయి. కానీ.. నన్ను కదిలించే పాట .. దిల్ హుమ్ హుమ్ కరే గబరాయే..పాట. ఆ పాట విన్నప్పుడల్లా.. ఆ..విషాద కావ్యం గుండెల్ని పిండేస్తుంది. పాట సాహిత్యం తో పాటు.. సంగీతం ఎక్కడో.. పాతాళం నుండి పొంగుకోచ్చిన బాధ లావాలా.. ఎగచిమ్ముతుంది. ఎన్నో..విషాద గీతాలు విన్నా కూడా.. ఎప్పుడు కలగని..బాధ. అయినా.. వింటూనే ఉంటాను. "భూపేన్ హజారిక " సంగీత ముద్ర అది. ఈ .. పాట రెండు సార్లు ఉంటుంది. ఒక వెర్షన్ లతా జీ.. రెండవసారి..భూపేన్ హజారిక .. సాహిత్యం కూడా.. భూపేన్ హజారిక నే. బ్రహ్మపుత్ర నది లోతంత గాఢమైన సంగీతం అది. వింటూనే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ చిత్రాన్ని.. రోజుల తరబడి చూస్తూనే ఉంటాను.. ఎందుకో.. ఇంకా చూడాలని పిస్తూనే ఉంటుంది.
అమ్జాద్ ఖాన్ ఆఖరి చిత్రం. సినిమా.. విడుదలకి ముందే ఆయన మరణించారు. ఖాన్ కి.. చిత్రాన్ని గౌరవార్ధం అంకితం చేసారు. రుడాలి నవల సూరంపూడి కామేశ్వరి తెలుగులో అనువదీకరించారని తెలుసుకున్నాను. తెలుగు అనువాద నవల "రుడాలి" HBT ముద్రణలో అనేకసార్లు వెలువడింది కానీ మా బెజవాడ పుస్తక ప్రదర్శనలో కూడా.. దొరకలేదు.
ఒక వాస్తవిక జీవన చిత్రం "రుడాలి" చిత్రం. ప్రాంతాల, సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు స్త్రీల జీవనాన్ని ఎలా.. నిర్దేశిస్తాయో.. అదే "రుడాలి" విషాద కావ్యం. ఏమి నచ్చిందో.. విడదీసి చెప్పలేను..కానీ.. ఆసాంతం విషాదం. ఆ విషాద సంగీతం మాత్రం మధురమే! ఈ..పాటకు స్వేచ్ఛానువాదం యిది.
.
dil hum hum kare ghabraaye, ghan dham dham kare darr jaaye
ek bund kabhee paanee, kee moree ankhiyo se barsaaye
dil hum hum kare ghabraaye
teree jhoree daru sab sukhe pat jo aaye
teraa chhua lage, meree sukhee dar hariyaaye
dil hum hum kare ghabraaye
jis tan ko chhua tune, uss tan ko chhupaau
jis man ko lage naina, woh kisko dikhaau
o more chandrama, teree chaandanee ang jalaaye
teree unchee ataree maine pankh liye katwaaye
dil hum hum kare ghabraaye, ghan dham dham kare darr jaaye
ek bund kabhee panee kee moree ankhiyo se barsaaye
dil hum hum kare ghabraaye
"దిల్ హుం హుం కరె" (రుదాలి)
ఈ గుండె కొట్టుకుంటున్నా దడే!
ఉరుము ఉరిమినా దడే!
యెప్పుడన్న వో చుక్కపాటి కన్నీటి వాన
కనికరం కూడా లేదే ఈ పాపిష్టి కళ్ళకు!
ఉరుము ఉరిమినా దడే!
యెప్పుడన్న వో చుక్కపాటి కన్నీటి వాన
కనికరం కూడా లేదే ఈ పాపిష్టి కళ్ళకు!
ఆకులన్నీ యెండిపోయిన క్షణాల
నీ ముందు జోలె పరుస్తాను
నీ ఒక్క స్పర్శకే
యీ ఎండిన కొమ్మా
పచ్చగా ప్రాణం పోసుకుంటుంది.
నీ ముందు జోలె పరుస్తాను
నీ ఒక్క స్పర్శకే
యీ ఎండిన కొమ్మా
పచ్చగా ప్రాణం పోసుకుంటుంది.
నువ్వు తాకిన ఈ దేహాన్నైతే
ప్రపంచం నుంచి దాయగలను గాని,
నీ చూపులు తాకిన ఈ మనస్సును
ఎవరికి చూపను?
ఒయీ చంద్రుడా!
నీ వెన్నెల నా ఒళ్ళంతా మండిస్తోంది.
అంతెత్తు గడపమీద నువ్వు
రెక్కలు తెగ్గోయించుకుని నేల మీద ముడుచుకుని నేను!
ప్రపంచం నుంచి దాయగలను గాని,
నీ చూపులు తాకిన ఈ మనస్సును
ఎవరికి చూపను?
ఒయీ చంద్రుడా!
నీ వెన్నెల నా ఒళ్ళంతా మండిస్తోంది.
అంతెత్తు గడపమీద నువ్వు
రెక్కలు తెగ్గోయించుకుని నేల మీద ముడుచుకుని నేను!
(రుదాలి (1993), గుల్జార్, భుపేన్ హజారికా, లతా మంగెష్కర్/భుపేన్ హజారికా)
(original song)
dil hum hum kare ghabraaye, ghan dham dham kare darr jaaye
ek bund kabhee paanee, kee moree ankhiyo se barsaaye
dil hum hum kare ghabraaye
teree jhoree daru sab sukhe pat jo aaye
teraa chhua lage, meree sukhee dar hariyaaye
dil hum hum kare ghabraaye
jis tan ko chhua tune, uss tan ko chhupaau
jis man ko lage naina, woh kisko dikhaau
o more chandrama, teree chaandanee ang jalaaye
teree unchee ataree maine pankh liye katwaaye
dil hum hum kare ghabraaye, ghan dham dham kare darr jaaye
ek bund kabhee panee kee moree ankhiyo se barsaaye
dil hum hum kare ghabraaye
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి