1 .విహంగానికి.. ఎంతటి స్వేఛ్చో!
ఆకాశంలో ఎగురుతున్నందుకు కాదు
రెక్కలు విరిచి పంజరాన బంధించ నందులకు....
2.శిఖరానికి ఎంత గర్వమో!
మహోన్నతంగా ఉన్నందుకు కాదు..
అధిరోహకుల ఆత్మ విశ్వాసంకి సవాల్ విసురుతున్నందుకు..
౩.రాగానికి ఎంత అతిశయమో!
రాళ్ళని కరిగిస్తున్నందుకు కాదు
స్వర బంధనం వీడనందుకు....
4.ఆత్మకి ఎంతటి ఆనందమో!
జన్మజన్మాలని సృశిస్తున్నదుకు కాదు
తన ఉనికి పరమాత్మకి మాత్రమే తెలిసినంధులకు...
5.గరళం గర్వపడుతుంది
హరిస్తున్నందుకు కాదు
హరుని కంటాన భద్రంగా దాగి ఉన్నందుకు...
6.శిశిరం సిగ్గు పడింధీ
వివస్త్రగా మారినంధులకు కాదు
వసంతం తనని తడిమి తడిమి చిగిర్చింప జేసినంధులకు...
7.వెన్నెల రగిలిస్తుంది!
చల్లదనంతొ కాదు..
విరహంతో ....
8: గులాబీలు గుండెల్లో గుచ్చేస్తాయట!
ముళ్ళతో కాదు అరవిరిసిన అందంతొ..
9.విరిబోణి తనువుని చుట్టేసిన
చీరకి ఎన్ని రంగులో !
విరుల వనంలోఎన్ని కోకలో
చీర రంగులకి దీటుగా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి