సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల లో జాగ్రత్త.,మీ పిల్లల పేస్ బుక్ యాక్టి విటీస్ మోనీటార్ చేయడం ఎలా? రెండు విలువైన పోస్ట్ లే! సోషల్ నెట్వర్కింగ్ సైట్ ల వల్ల.. చాలా విలువైన సమయం వృధా అవుతుంది అంటే..పిల్లలు ఒప్పుకోరేమో.. ! కానీ అది నిజం.
న్యూక్లియర్ చైల్డ్ ,ఆధునిక వసతులు తో కూడిన జీవితాన్ని అందించడమే ధ్యేయం అనుకుంటున్న తల్లి-దండ్రులు .. ఒంటరితనం మరియు లభించిన స్వేచ్చ..వల్ల.. యువతరం అంతా ఇంటర్నెట్ అనుసంధానం వల్ల ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారితో కూడా ఇట్టే స్నేహం చేస్తున్నారు.
అది స్నేహం అంటే .. నాకు కోపం వచ్చేస్తుంది. అధిక శాతం కాలక్షేపపు,ఉబుసుపోక(చిఫ్స్) కబుర్లు. నేను పేస్ బుక్ అంటే తెగ ఉబలాట పడిపోయి ఎకౌంటు ఓపెన్ చేసి మా అబ్బాయికి చెప్పగానే.. "నీకు ఎందుకమ్మా.. అక్కడ ఏం బాగోదు.నీకు నచ్చదు కూడా.. సైన్ అవుట్ చేసేసుకో.".అన్నాడు.
అదేమిటి..ఇలా అంటున్నాడు.. యువత తో..పాటు మధ్యవయస్కులు కూడా ఆర్కుట్,,పేస్ బుక్ అంటూ తెగ కలవరిస్తుంటే..అనుకున్నాను.
"నాకు పేస్ బుక్ డీ యాక్టివేట్ చేయడం చేతకావడంలేదు అనగానే.. పాస్ వర్డ్..చెప్పమ్మా..నేను.. డీ యాక్టివేట్ ..చేస్తాను" అన్నాడు .
సరేనని నా పాస్ వర్డ్ చెప్పాను. అలా నా మొదటి ఉత్సాహం పై నీళ్ళు చిలకరించాడు మా..అబ్బాయి. నేను తర్వాత పేస్ బుక్ గురించి మర్చిపోయినా.. ఏ ..పాటలు వింటుండగా.. ఏ..రాగా లోనో.. లైక్స్ పెట్టమంటూ కనబడేది. సరే మళ్ళీ .. మనసు అటు లాగేస్తుంటే..కనెక్ట్ అయ్యాను.
మొదట్లో..మా కుటుంబ సభ్యులు ..ముఖ్యమైన స్నేహితులు.. ఆడ్ అవుతూ..వచ్చారు.తర్వాత.. ఎవరెవరో..కొత్త కొత్తవారు ఆడ్ రిక్వెస్ట్ లు పెట్టడం.. వాళ్ళ ప్రొఫైల్ చూసి చూసి ..వాళ్ళ స్టేటస్..,పోస్ట్ లు బాగున్నాయి అనుకున్న తర్వాత నే ..ఓకే.. చేసేదాన్ని.
తర్వాత మా అబ్బాయి..నాకు ఫ్రెండ్స్ లిస్టు లో..ఆడ్ అయ్యాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నన్ను మొదట్లో..పేస్ బుక్ ఎకౌంట్..వద్దన్న మా అబ్బాయి..తర్వాత లిబరల్ గా ఆలోచించాడు ఏమో కానీ.. తరువాత నా ఆడ్ రిక్వెస్ట్ ని ఓకే చేసాడు, నేను మా అబ్బాయి ఇప్పుడు ఫ్రెండ్స్ గా మారాము. . అయితే.. అది ఒకందుకు మంచిదే.! .పిల్లలు .. కాస్త జాగ్రత్తగా ఉంటారు. .మన పెద్దవాళ్ళు.. మనని గమనిస్తుంటారు అనుకున్నప్పుడు..వాళ్ళ దూకుడుకి ఆనకట్ట వేసినట్టే కదా! ఇప్పటి పిల్లలకి అంత కన్నా కళ్ళెం అవసరం లేదు అనుకుంటాను.
ఇంటర్నెట్ ప్రపంచం చాలా పెద్దది..అవసరం మేర కన్నా అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి..మాత్రమే కాకుండా.. ఆ విషయాలని ఇతరులతో..పంచుకోవడానికి వేదికలు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లు. . ఇతరులతో..పంచుకోవాలన్న ఉత్షాహం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల.ప్రతి విషయం ప్రాధాన్యత సంతరించుకుని.. సరి కొత్త ఆలోచనలు కల్గిస్తుంది.
కొంత మంది మీదు మిక్కిలి ఉత్సాహంతో.. ఫ్రెండ్..రిక్వెస్ట్ పంపుతారు. నాకైతే.. తెలంగాణా ప్రాంతం నుండి.. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది..అతనికి నాకు రిక్వెస్ట్ పెట్టేటప్పటికి 4396 ..మంది ఫ్రెండ్ ఉన్నారు, అతనికి తన జీవిత కాలంలో..యెంత మంది స్నేహితులు ఉంటారు.. ? అతనికి కనీసం వారిఅందరి పేర్లు అయినా గుర్తు ఉంటాయా? నాకూ..ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవడానికి తప్ప ..ఒక వేళ అతని స్నేహ ప్రపంచం ఎంత పెద్దదైనా వారందరిలో.. అతనికి మంచి స్నేహితులు ఎందరు అన్న విజ్ఞత అయినా ఉండవద్దు..అనుకుని.. వెంటనే ఇగ్నోర్ చెప్పి పడేసాను.
మన అభిరుచులు కలసిన వారు,స్నేహ స్వభావం కల్గిన వారు,నిజంగా మనుషుల పట్ల గౌరవం,అభిమానం కలవారు తారస పడితే.. ఆ వేదిక పైనే కాదు.. నిజ జీవితంలో కూడా..మనకి మంచి మిత్రులు కాగలరు. ఎందుకంటే నాకు .. అక్కడ స్నేహాలు లో..ఇరవై శాతం అయినా మంచి స్నేహాలు కనబడలేదు.. కనీసం ఒక పది మంది నా అన్న వాళ్ళు ఉన్నారు. అనుకోవాలేమో! అలాటి వడపోత కూడా అవసరం అని కూడా నా అభిప్రాయం. నాతో ఏకీ భావించాలనేం లేదు. ఒకవేళ మంచి స్నేహాలు దొరికితే..అదృష్టం కూడా.. !
ఇంకొక ముఖ్య విషయం నేను గమనించిన విషయం ఏమంటే.. ఇక్కడ కమ్యూనిటీల పిచ్చి..ఎక్కువే! అలాటి గ్రూప్ లలో నేను ఆడ్ కాలేదు కూడా. గ్రూప్ లు.. గ్రూప్ చాటింగ్ లు చాలా వేలం వెర్రిగా ఉన్నాయి. మతం,కులం వేదికలు చేసుకుని మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించుకోవడానికి ఈ వేదికలు చిరునామా కావడాన్ని నేను నిరసిస్తాను .
మంచి విషయాలు తక్కువ... కాలక్షేపపు.. కబుర్లు ఎక్కువ అని కూడా కాదు.. అనవసర ప్రసంగాలు కూడా ఎక్కువే ! .అమ్మాయిల అబ్బాయిల హద్దులు మీరిన సంభాషణలు,, తిట్టుకోవడాలు,మాటలతో..నరుక్కోవడాలు..కటీఫ్ లు చెప్పుకోవ డాలు,స్నేహాల ముసుగులో.. చేసే అబద్దపు ప్రేమలు, పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు, విడాకులు, లింకేడ్ వ్యవహారాలూ అన్ని వెగటు పుట్టించేవే!!
ఎక్కడన్నా ఎవరిదైనా అప్ డేట్ స్టేటస్,, చిత్ర విశేషమో.. ఫోటోనో..నచ్చి ఒక కామెంట్ పడేసామో. చచ్చామే.!. ఇక దడ .. పుట్టించే విధంగా అప్డేట్స్.. మనలని వెంటాడతాయని తెలుసుకున్న ..అనుభవం తర్వాత ఆచి తూచి.. వ్యాఖ్యానించడం మొదలెట్టాను. ఈ సోషల్ వర్కింగ్ సైట్ లలో..అన్నీ ఎక్కువే!..మా స్నేహితురాలి కూతురు,కొడుకు కూడా.. పొద్దస్తమానం.. నెట్ కి అతుక్కుపోయి.. చాటింగ్ చేస్తున్నారట. ఒకే సారి పదిమంది పాతిక మంది తో కూడా.. చాట్ చేస్తూ అభివృద్ధి సాధించారట.
ఇక అక్కడ ఒరిజినల్ ప్రోపైల్స్ కూడా ఉన్నట్లు తోచదు.ఒక వేళ ఉన్నా సెక్యూరిటి తక్కువే! వయసు ఉదహరించక పోవడం,ఉదహరించడం రెండు ఇబ్బందికరమే! నా విషయంలో.. అలా నాకు ఇబ్బంది కల్గిన సందర్భం వచ్చింది. మా .. ఫామిలీస్ నుండి చాలా మంది పిల్లలు నాకు ఫ్రెండ్స్ లిస్టు లో..ఆడ్ అయ్యారు. వారికి నేను ఒక అమ్మని అని తెలియదు..హాయ్..సిస్టర్ అంటారు..కాదని నేను చెపుతాను. తర్వాత వివరాలు తెలుపుకుని..చదువు,ఉద్యోగం,కుంటుంబాలు గురించి చెప్పుకుంటూ ఉంటాం. పిల్లలు చాలా ఆప్యాయంగా ఉంటారు.. కొంత మంది నా బ్లాగ్ ఫాల్లో అవుతారు. కేవలం వారి కోసమే నేను నా బ్లాగ్ ని పేస్ బుక్ షేరింగ్ పెట్టాను. పిల్లల ఆలోచనా ధోరణి, వాళ్ళ అభిప్రాయాలు..నిజంగా నాకు నచ్చుతాయి కూడా..
ఇక మా కుటుంబాల పిల్లలు కాకుండా..ఎప్పుడో..ఎక్కడో.. పొరబాటుగా ఆడ్ అయినవారు.. చాట్ లో..పలకరిస్తూ ఉంటారు. నేను..ఒక విధంగా..చాట్ అంటేనే వెనుకడు వేస్తాను. జస్ట్ అలా వెళ్లి..అన్నీ చూసేసి..స్పందిన్చాలనుకున్న చోట.. స్పందించి..ఓ..వ్యాఖ్య పెట్టి వస్తాను. కొన్ని గ్రూప్ లు మంచి పనులు చేస్తూ ఉండి ఉండవచ్చు.కానీ..నాకున్న కొద్దిపాటి విరామ సమయంలో..వాళ్ళతో..కూడా నేను కలవలేను..అలాటప్పుడు.. నేను కలవకపోవడమే మేలని.. నేను అసలు..అందులో..ఆడ్ అవ్వను. సామాజిక స్పృహ అంటే..ఇలా సైట్ల లో ..మాత్రమే కాదు ..ఇక్కడ కన్నా..కోట్ల రెట్టింపు.. వాస్తవికత మన చుట్టూ..బాహ్య ప్రపంచంలో..ఉంది అక్కడ స్పందించండి..అని అరచి చెప్పాలనిపిస్తుంది.
ఇక అక్కడ ఉన్న చిన్న పాటి పరిచయం లోనే..మన వ్యక్తిగత వివరాలు.. అడ్రస్ లు..అడుగుతూ..ఉంటారు. నేను సున్నితంగా తిరస్కరించడమో.. లేదా..అవసరం లేదని చెప్పడమో..చేస్తాను. వాళ్ళ ఆలోచనా విధానం వల్ల వాళ్ళు అలా ఆలోచిస్తారు.. అమాయకం గా ఉన్న వారు..లేదా..తప్పు దారి నడిచేవారు ..కూడా..ఇక్కడ ఉండే ఉండవచ్చు. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..అవసర మైనంత స్నేహం చేయడం మంచిది. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అమ్మాయిలకే కాదు..అబ్బాయిలు..మోసపోతారు కూడా.!! .
మన తోటి బ్లాగర్ అచ్చంపేట్ రాజ్ గారి బ్లాగ్ ద్వారా..చాలా విలువైన విషయాలు తెలుసుకోవడం వలన నేను నాకు అంత నెట్ పరిజ్ఞానం లేకపోయినా..సరే..జాగ్రత్తగా ఉండగలగడం నేర్చుకున్నాను. అపరిచిత వ్యక్తులు.. కి..సమాచారం ఇవ్వకుండా ఉండక పోతేనే మంచిదని నాకు సన్నిహితంగా ఉన్న పిల్లలకి చెపుతాను.
చదవడంని మరిపింపజేసే.. .నిజమైన సామాజిక స్పృహని లోపింపజేసే.. మనుషులతో..సహజమైన కలివిడి తనం లేకుండా,, ఇలా సైట్ స్నేహాలు..ఉన్నవారు చాలా ఒరిజినాలిటి లైఫ్ ని మిస్ అవుతారు. కూడా.. .
మొన్న ఈ మద్య మా అబ్బాయితో..ఒక మాట అన్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారికి ధన్యవాదములు..చెప్పు..నాన్నా.!.అని. అంటే..అబ్బ అదొక హెల్ అమ్మా..! మనం నిజంగా అభిమానించే వారికి..అలా పైపై పూతగా..విషెస్ చెప్పనవసరము లేదు..ధన్యవాదములు చెప్పాల్సిన పని లేదు..రెండు మనకోసమే.. మనం చెప్పుకునేవి. అన్నాడు.నాకైతే..మొదట ఆ మాటలో శ్లేష అర్ధం కాలేదు. అర్ధం అయినాక.. ఆహా.. ఏం చెప్పావురా.. ! కొడుకా..! అనుకున్నాను.
ఏమైనా.. నవరత్నాలు అన్నీ ఒక వైపు,, నత్త గుల్లలన్నీ..మరొకవైపు చేరినట్లు.. మంచి-చెడు..కలబోత, విడబోత..ఈ సైట్ ల లోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త. పిల్లలు..పెద్దలు అందరూ కూడాను. సమయాన్ని వృధా చేసుకోకుండా..విలువైన వాటికే సమయం కేటాయించడం వలన మన ఆనందం...జ్ఞానం రెండు వృద్ది అవుతాయి కూడా..

6 కామెంట్‌లు:
చాలా మంచి టపా బాగా వ్రాశారు! నా ముఖపుస్తకంలో (facebook ) మా కుటుంబీకులే కనీసం ఒక యాభై మంది ఉన్నారు! అన్నట్టు నేను కూడా దీని మీద ఒక టపా వ్రాశాను ఒక సారి చూడరూ..... http://navarasabharitham.blogspot.com/2011/06/blog-post_15.html
మీరు చిప్పినది అక్షరాల నిజం
www.swarajyam.blogspot.com
వనజగారూ.."నవరత్నాలు అన్నీ ఒక వైపు,, నత్త గుల్లలన్నీ..మరొకవైపు చేరినట్లు.. మంచి-చెడు..కలబోత,"
పేస్ బుక్ గురించి మంచి టపా వనజగారూ...
ఫేస్ బుక్ లో మన ప్రొఫైలుని ఎవరు చూడ వచ్చో మనం నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా స్కూలూ, కాలేజీ, ఒకప్పటి ఉద్యోగాలలో పరిచయమయ్యి విడిపోయిన వారు తిరిగి కలుస్తారని ఆశిస్తూ చాలా మంది నా వయసు వారు ఫేస్ బుక్కులో చేరుతున్నారని (నా స్నేహితులను చూసి) అనిపిస్తుంది. ఇంకా ప్రవాసంలో ఉంటున్నప్పుడు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలు పంచుకోవడానికి కూడా చేరుతున్నారు. చాలా మటుకు కుటుంబ సభ్యులు, బాగా పరిచయమైన వారే తప్ప తెలియని వారిని కలుపుకునే వారు తక్కువే నాకు తెలిసినంతలో. పుట్టినరోజుల విషయంలో కూడా నాకు ఫేస్ బుక్ ఉపయోగకరమే అనిపిస్తుంది. ఎంత దగ్గరి వారైనా ఒక్కో సారి ప్రతి రోజూ గుర్తు చేసుకున్నా ఆ రోజు మర్చిపోతుంటాను నేను. ఈ సంవత్సరం ఫేస్ బుక్కు వల్ల నేను ఆప్తులందరికీ సమయానికి wish చెయ్యగలిగాను. కొంతమందికే పబ్లిగ్గా చెప్తాను. చాలా మందికి ఒక సందేశం పంపుతాను వారికి మాత్రమే ప్రత్యేకంగా.
చిన్న పిల్లలకు ముఖ పరిచయం లేని వారిని స్నేహితులుగా కలుపుకోవద్దు అని హెచ్చరిస్తున్నాను. (మా పిల్లలకి అకౌంట్లు లేవులెండి). అంతే కాదు వారి ప్రొఫైలు అందరికీ కనిపించేలా పెట్టుకుంటున్నారు. వద్దని సున్నితంగా గుర్తు చేస్తూ వస్తున్నాను. ఈ విషయంలో చిన్న పిల్లలను ఓ కంట కనిపెడుతుండవచ్చు, privacy, security విషయాలలోని లోటుపాట్లు తెలుస్తూ ఉంటాయనే నేను ఇందులో చేరాను. బ్లాగుల్లో ఐనా, సోషల్ నెట్వొర్కుల్లో అయినా నిజ జీవితంలో ఐనా అన్ని రకాల మనుషులూ, అవకాశాలూ ఉంటాయి. మీరన్నట్లు విచక్షణ నేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన స్నేహాలు ఎన్నుకోవాలి.
nikhil maturity chUstunTE naaku mucchaTEstundi...
baagaa raaSaaru...
కరెక్ట్ గా చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి