18, డిసెంబర్ 2011, ఆదివారం

మన్ మేరా దుష్మన్



మన్ మేరా దుష్మన్

నేను  కోరుకున్నది  నా  ముందున్నా
అందుకునేందుకు చేయి కదల్చనీయవు
అడుగు ముందుకు పడనీయవు
సంకెళ్ళతో కట్టి పడేస్తావు
ఒక్క క్షణం అవునంటావు
ఆ మరుక్షణమే వలదంటావు
ఆలోచనతో అరక్షణమైనా  కలవనంటావు

అంతలోనే అద్దం లాటి నాలో నిన్ను చూసుకోమంటావు
నిన్ను ఎరిగినవాడు దేవుడట
అందుకేనేమో !నీ కళ్ళకు గంతలు కట్టి
జీవితంతో దోబూచులాటాడుకుంటాను

నిన్ను ఓడిసిపట్టడం చేతనవక
కవ్విస్తావంటాను
నవ్విస్తావంటాను
రగిలిస్తావంటాను

నువ్వుంటే మెలుకువలోనూ
 కలలూరుతుంటాయి
కళ్ళలో నదులు నిల్వుంటాయి

వాస్తవికత-బ్రాంతి మద్య ఊగిసలాడుతూ
నిన్ను మట్టు బెట్టి
జీవిత సౌధాన్ని  ఆడ్డం గా నిలబెట్టుకుంటూ
అప్పుడప్పుడు చిక్కి శల్యమై
నీ ఉనికి నిరూపణ తో
ఓడానని తలదించుకుంటాను

ఎన్ని గాధలకి వస్తువయినావు
రాతి గోడల వెనుక చెమ్మగా మిగిలావు
నువ్వు చెప్పినదే చేస్తానని
గొప్పగా చెపుతుంటాను కానీ
ఆచరణ లో నేను ఒక మర బొమ్మని .

నువ్వు నా ఆలోచనలోను లేవు
నా ఎదురుగాను లేవు
కానీ నువ్వు నాలోనే ఉన్నావు
ఎప్పుడు ..ఎప్పుడు..ఎల్లెప్పుడూ..
నువ్వు నా ప్రధమ శత్రువువి
నా మనసు వి .

 

7 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చాలా బాగుందండి. మంచి కవిత.

సుభ/subha చెప్పారు...

ఏం చెప్పారండీ మనసు గురించీ.. ఆలోచిస్తే నిజమే కదూ ఆని అనిపిస్తోంది. చాలా బాగుందండి.

శశి కళ చెప్పారు...

నువ్వు ఆ ఆలోచనలోను లేవు
నా ఎదురుగాను లేవు
కానీ నువ్వు నాలోనే ఉన్నావు

యెంత బాగా భావాలను కూర్చుతారు....గ్రెట్

PALERU చెప్పారు...

నిజమే....మనసే మన శత్రువు...మిత్రుడు కుడా !!!

శ్రేయోభిలాషి
RAAFSUN

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
"వూహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే.."
మీ కవిత చదవగానే..ఈ పాట గుర్తుకు వచ్చిందండీ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు.. కవిత మీకు నచ్చినందుకు సంతోషం అండీ!! ధన్యవాదములు.

@సుభా.. గారు..బాగున్నారా? మనసు అంతే కదండీ..పరుగులు తీయిస్తుంది. ధన్యవాదములు.

@ శశి గారు.. ధన్యవాదములు.

@ శ్రేయాభిలాషి గారు.. మనకి మనమే మిత్రులం,శత్రువులం.. బాగుందండీ! నిజమే కదా! ధన్యవాదములు

@ రాజీ గారు..ధన్యవాదములు. అండీ! అంత గొప్ప పాట గుర్తుకు వచ్చినందుకు...గుర్తు చేసినందుకు..కూడా..

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

!! వనజ వనమాలి !! గారు కవిత చాలా బాగుంది