22, డిసెంబర్ 2011, గురువారం

నిశ్శబ్ద సంగీతం.

నిశ్శబ్ద సంగీతం.

శ్వాస శ్వాస తో చెప్పిందట
ఇది ఒక సంగీతమే అని.
ఎద లయలే జతులు,గతులు,సంగతులై
అదే ఝురి ప్రవాహమైనట్లు..
అందులో మునక లేస్తున్నట్లు
మరో మనిషి ఆచూకి లేని ..ఓ..మూల గదిలో..
పూరింపబడిన నిశ్శబ్దం.. ఒక సంగీతం
ఎక్కడో.. వినవస్తున్న పక్షుల కిల కిలలు
పిచ్చుకుల కిచ కిచలు..
ఎంత బిగించి పెట్టినా సరే సందు దొరికితే చాలు
టప్ టప్ మని కారే నీటి బొట్లు..
అప్పుడప్పుడు వెళ్ళే వాహనాల చప్పుడులు..
అవసరమైతే తప్ప పెదవి దాటని మాటలు
గాలిపూరింపక పలకని రవంలా
మీటకుండావదిలేసిన వీణలా
సవ్వడి చేయని చలిమరలు
గిర్రున తిరగని రెక్కల యంత్రాలు.
ధ్వని ముద్రణ ని వినిపించని బుల్లి పెట్టెలు.
హొరా హోరి కనబడని కథనాలు
వినబడేది అంతా.. ప్రాణ సంగీతమే
ఆ నిశ్శబ్ద యుద్దాన్ని చేదిస్తూ.
రుబ్బురోలు లో తిరుగాడే పొత్రం బర బరలు
తుక తుక ఉడుకుతున్నఅన్నం వాసనలు
మర్చిపోయిన జాడలని వెదికి ఇస్తూ..
పిల్లని పుట్టింటికి పంపేసిన అల్లుడిలా
సిగ్గుతో.. మొహం చాటేసినట్లు
ఒంట్లో నరాలకి జడత్వం వచ్చినట్లు
వేలాడే తీగల్లోను ప్రాణం లేనట్లు
తలపించే నిర్జీవ జీవనయానం

గంటలకి గంటలు ఆచూకి లేకుండా
అనంత ప్రవాహంలా సాగే విద్యుత్ కి
ఆనకట్టవేసినట్లున్న కోతలకి ..
మారక తప్పని మార్పుకి ....

 
చేరికైన సహజత్వానికి
అలవాటు పడుతున్న.. ఓ . శబ్ద ప్రేమికి
సర్వ జన సమ్మోహిత స్వర సంగీతం
నిశ్శబ్ద సంగీతం..



(హృదయానికి చెవులుంటే.. జగమంతా నాదమయమే . అని ఓ..కవి గారు వ్రాసినట్లున్నారు. ఏ పాటో సరిగా గుర్తు లేదు.రోజుకి ఏడెనిమిది గంటలు విద్యుత్ కోతకి అలవాటు పడి .. సహజత్వాని దగ్గరైన నా స్పందన.)

7 కామెంట్‌లు:

sandeep చెప్పారు...

bhayankaramga visiginche

"విద్యుత్ కోత" gurinchi koodaa inata aahlaadakarmgaa cheppocchannamaata.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సందీప్ గారు.. ధన్యవాదములు. కొన్ని లేనప్పుడు..మరి కొన్ని విలువ ఇలా తెలుస్తుంది కదా.. ఇది ఆ స్పందనే..!!!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"రోజుకి ఏడెనిమిది గంటలు విద్యుత్ కోతకి అలవాటు పడి .. సహజత్వాని దగ్గరైన నా స్పందన"

వనజ వనమాలి గారు..
నిజమేనండీ విద్యుత్ కోతకి అలవాటుపడిపోయాము.
నిశ్శబ్ధ సంగీతం చాలా బాగుంది..

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

కవిత బాగుందండీ. ఏంటో మీబ్లాగు పేరు చూసినప్పుడల్లా నాకు అనుకోకుండా వనజ సినిమా గుర్తుకొస్తుంది.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

nice

సుభ/subha చెప్పారు...

కరెంటు పోవడం ఎంత మంచిదైందండీ... ఒక చక్కని నిశ్శబ్ద గీతాన్ని వినే అదృష్టం దక్కింది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజి.. ధన్య వాదములు
@ భాస్కర రామిరెడ్డి గారు.. సంతోషం అండీ!.. వనజ చిత్రం నేను చూసాను. ఒక పరిచయం కూడా వ్రాసి ఉంది.. త్వరలో..అందరి ముందుకు వస్తుంది. నా పేరు నా బ్లాగ్ పేరు రెండు ..ఒకటేనండీ!. కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
@ బాలు..గారు..ధన్యవాదములు.
@ సుభ గారు.. ధన్యవాదములు.