ఇలాలి అసహనం -వనజ తాతినేని
మేమెలాగూ నిద్ర పోలేదు, మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా నిద్ర పోనిస్తామా అన్నట్టు ఊరంతా మేల్కొనేలా సినిమా పాట పాడుకుంటూ వెళ్ళే వాహనం, దాని వెనుకనే రోడ్డు మీద దబుక్కుమన్న శబ్దం. ఉలికిపడి లేచాను. ఇంటద్దె ఇరవై శాతం పెంచానని ఓనరమ్మ చెప్పినప్పుడు ఉలికి పడ్డట్టుగా. అన్యాయం! చానల్ సాక్షిగా తాడిగడపలో ఇంతిల్లు పదివేలే అంటున్నారన్నా ! చానల్స్ లో ఎవరూ నిజం చెప్పరని మీకు తెలియదా అంది. నిజమే కదా! అనుకున్నాను వీలైనంత ఏడుపు గొంతుని సరి చేసుకుని. అన్నీ పెరుగుతున్నాయి. ఆయుష్షు కూడా పెంచి ఇక్కడ నరకమెందుకు చూపిస్తావ్ దేవుడా !? మనసులో తిట్టుకున్నాను.
రాత్రంతా నిద్ర లేదు. కలలకి కూడా పొంతన లేదు ఆలోచనలాగానే ఎడ్డె మంటే తెడ్డె మంటున్నాయి. కాసేపు నాలుగు రింగుల కారు, కలర్ ఫుల్ పోలీ వీవెన్ చీరలు, కొంకణ్తీర్ డైమండ్ నగలు, ఇవే కనబడతాయి. కాసేపాగాక ప్రకృతంతా వసంతగానం చేస్తుంటే ఎండలేమో తొందరపడి ముందే సచిన్ బాదినట్టు బాదుతున్నాయి. ఒంట్లో నుండి చెమట చుక్క బయటకి రానీయమని కంకణం కట్టుకున్నవారు వర్సెస్ తాగడానికి చుక్క నీళ్ళ కోసం అలమటించేవారు.ఇదీ భారతం. భవతు భారతం. అక్షరాల అరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఆకలి, నిరుద్యోగం, అవినీతి, లంచగొండితనం వగైరా వగైరా లన్నింటికి ఒకే ఒకే విశ్వసనీయమైన మందు దేశభక్తి. అసలా ప్లేవర్ కి ఏ ప్లేవర్ పోటీ రాదు. అందులో పడి మునిగిపోవాలని రాసి పెట్టి ఉందని తెలుస్తూనే ఉంది. ఆకలి ఉంటే సరిపోయిందా దేశభక్తి ఉండొద్దూ ... అడుక్కుని పరువు తీయకు పో ... దూరంగా పో ! లాంటి నిజాలు చెప్పే కలలు వచ్చినందుకూ అసహనంగా ఉంది.
వాకింగ్ పేరుచెప్పుకుని మగవాళ్ళు ప్యాంట్ జేబులో క్యారీ బేగ్ ని వేసుకొస్తున్నారు. పరులు పెంచుకున్న మొక్కల, చెట్ల పూలతో పూజ చేస్తే మంచిదని దేవుడు చెప్పాడు కాబోల్సు. శ్రద్దగా తెగ పాటించేస్తున్నారు. కామన్ ప్లేస్ లో కుండీలలో పెట్టిన మొక్కలకి కూడా ఒక్క పూవ్వు మిగల్లేదు. నా హృదయపుష్ఫం ఎవరూ దోచుకోలేరులే అనుకున్నా అంతకన్నా వేరే దారిలేక. ఉపన్యాస చక్రవర్తి భర్త పాదాలు పిసికి, మొల మీద గుడ్డ ఉతికి ఆరేసి పుణ్యం తెచ్చుకోండి అని సెలవిస్తున్నాడు. అర్ధభాగంకి ఆయనెప్పుడైనా అలా చేసాడో లేదో ! అమ్మ కన్నా చేసాడో లేదో ! ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ! ఈ శతాబ్దపు ఆడవాళ్ళకి ఎందుకసహనం తెప్పిస్తారు ?
బిల్డింగ్ లో ఉన్నవాళ్ళందరి పైనా పెత్తనం చెలాయించే సుధీర్ " నా పట్టు చొక్కా అంతా కాల్చేసావ్ ! ఇస్త్రీ చేయడం కొత్తని చెప్పొచ్చుగా. పొలాల్లో పనిచేసుకుని బతికినవాళ్ళు టౌన్ లోకి వచ్చి దోబీ అవతారమెత్తితే ఇదిగో ఇలాగే ఉంటుంది. మూడేలు రూపాయల కొత్త షర్ట్. ఈ షర్ట్ నువ్వే ఉంచుకో ..డబ్బులు నీ జీతంలో కట్ చేసుకుంటా ! ఉదార అసహనం ఒలికిస్తున్నాడు. పాపం! కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని చిందులు తొక్కుతున్న ఆయన్ని చూస్తూ నిలుచున్నాడు కొత్తగా వచ్చిన వాచ్మెన్ నాగేశ్వరరావు.
పొద్దుటి నుండి ఒకటే మెసేజ్ పదిసార్లు. ఎవరో అన్నయ్య యు వీ ప్యాలెస్ కి వస్తున్నాడట. అందులో ప్రత్యేకత ఏముందీ ? జనాలు వీసా లేకుండా ఎన్నో దేశాలకి వెళ్లి వస్తున్నారు . స్వదేశంలో ఎక్కడ తిరిగితే ఏమైంది? ఎవరి పనులు వారివి. దానికంత ప్రాధాన్యం ఎందుకివ్వాలి? అనుకూలంగా కొన్ని, వ్యతిరేకంగా కొన్నీ. డబ్బులు పుచ్చుకుని మీటింగ్ కెళ్ళే వాళ్లకి అలాంటి మెసేజ్ వెళ్ళినా ఫలితం భారీగా దక్కును. నాకెందుకంటా! పదకొండో మెసేజ్. అసహనం రాదుమరి. ఇక ఒర్చుకోవడం నావల్ల కాలేదు.ఆ నంబర్ బ్లాక్ చేసి పడేసాను.
హాల్లో టీవి , బెడ్ మీద లాప్ టాప్. డైనింగ్ టేబుల్ మీద ఎడమ చేతిలో మొబైల్. మనుషులు మనుషులతో మాట్లాడుకోరు. తెరమీద మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైపోయింది.తెరల మీద చూసి చూసి ఈ మధ్య మా ఇంట్లో కూడా శాంతి సామరస్యం అస్సలు కుదిరి చావడంలేదు. ప్రతి దానికి అసహనం ప్రదర్శించడం అలవాటైపోయింది. రోజూ వంట చేసినట్టే,రోజూ ఇంటి పని చేసినట్టే రోజూ టీవి సీరియల్స్ చూసినట్టే రోజూ అసహనం ప్రదర్శించకపోతే ఏమీ బాగోలేదు. మొన్నట్టాగే అత్తగారు చుట్టంలా వచ్చింది వచ్చినట్టు ఊరుకోకుండా.. ఎందుకా సీరియల్స్ అదే పనిగా చూస్తావ్ ! పిల్లలతో హోం వర్క్ చేయించవచ్చు కదా అంది. మా ఆయన్ని వరించినందుకు భరించక తప్పదని ఊరుకుంటున్నా కానీ పక్కింటి వాళ్ళ కోడలు వేసినట్టు ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నో వేసేస్తే పీడా పోద్ది అనుకున్నాను
అమ్మ గారు డస్ట్ బిన్, అమ్మ గారు పోస్ట్, అమ్మగారు కరంట్ బిల్, అమ్మగారూ నెట్ బిల్, అమ్మాయి గారు సపోటాలు బాగున్నాయి రండి ... డజను నలబై రూపాయలే ! అయ్యని ఎవరూ పిలిచే అలవాటులేదు, పాపం ఆర్ధిక భారం ఆయనకేమి తెలుసని జాలి కాబోలు.
పక్కింటమ్మాయికి పెళ్ళైతే నీకెందుకు కొత్త పట్టు చీర, డిజైనర్ బ్లౌజ్ !? చంపుతున్నావ్ కదే ! ఎదురింటాయన ఆక్రోశం. ఆ మైనా వాడి దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ నగలమ్మినట్టు చీరలు బ్లౌజ్ లు కూడా అద్దెకిచ్చే వాళ్ళుంటే ఎంత బావుండునో ! మగాడికి అధిక సంపాదన కోసం బల్ల క్రింద చేయి పెట్టడమో, హార్ట్ ఎటాక్ రిస్క్ రెండూ తప్పుతుంది. అరెరే ! ఇదేదో మంచి ఐడియానే ! మనమే అలాంటి షాప్ పెట్టేసుకుంటే పోలా ఇలా ఖాళీగా కూర్చునే బదులు!
మేడమ్! ఉదయం సార్ తో మాట్లాడాను హవా టెల్ లో మంచి ప్లాన్స్, ఆఫర్స్ ఉన్నాయి పోర్టబిలిటీ చేయించుకుంటానన్నారు అంది కంఠంలో బహుతీపిని ఒలకబోస్తూ ఓ పిల్ల . ఎవరమ్మా .. ఆ సార్ !? ఏ సార్ తో మాట్లాడావో నువ్వు? ఈ నెంబర్ గల ఫోన్ ఎప్పుడూ నాదగ్గరే ఉంటుంది . ఇంకో విషయం తల్లీ ఈ నెంబర్ మీ హవా టెల్ లోకి మారి రెండేళ్ళు అయింది కదా ! అన్నాను టక్కున పెట్టేసింది. మా ఆయన మొన్నెప్పుడో ఇలాంటి కాల్ అటెండ్ అయి వేషాలు బాగానే వేస్తున్నారు ఫ్యాన్సీ నెంబర్లని ఎన్నుకుని ఇదోరకం వ్యాపారం ! సిగ్గు లేదూ.. చావండహే! అన్నది గుర్తుకొచ్చింది.
అక్కా! అక్కా !! పక్క అపార్ట్మెంట్ అమ్మాయి పిలిచింది నన్నేనా ..? నేను అక్కనెప్పుడయ్యా నబ్బా ! పెళ్ళైన మర్నాటి నుండే అందరికీ ఆంటీ నే కదా ! అలా పిలవద్దని స్మూత్ గా చెప్పి కూడా అందరితోనూ యాంటీ అయిపోయా ! ఓపికపోయి మూలుగుతూ కూర్చున్న నాకు ఈ అక్కా అన్న పిలుపు కవితా కృష్ణమూర్తి భైరవి రాగంలా తోచింది . గబుక్కున బయటకెళ్ళి ఏంటమ్మా ..సత్యా అనడిగా! ఒక కరిపాకు రెమ్ముంటే ఇవ్వక్కా ! అయ్యో ! కూరలో కరివేపాకులా మనుషులని తీసి పారేస్తున్నారని మనుషులకి కోపం వచ్చి కరివేపాకు తోటలని పెంచడం మానేసారటమ్మా! కావాలంటే కొత్తిమీర కట్ట ఇస్తా ! మాడిన కూరని కూడా గార్నిష్ చేసి మీ ఆయనతో లొట్టలేసుకుంటూ తినేటట్టు చేయొచ్చు అన్నాను. నవ్వి సరేనంది. ఇలాగే అక్కా అని పిలుస్తూ.. నీకేమి కావాల్సినా అడగమ్మా ! మొహమాటపడకు. పక్క పక్క బిల్డింగ్ లలో ఉన్నాం, మనం మనం సాయం చేసుకోకపోతే ఎలా ! అంటూ కాస్త అతిగానే స్పందించాను. మా చిన్నోడికి అర్ధమయ్యిందనుకుంటా.. ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు. పిల్లలు పెద్ద ముదుర్లు అయిపోయారు.వాళ్లకీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆ సంగతి మొన్నెవడో కథల గ్రూప్ లలో పోర్న్ వీడియో పోస్ట్ చేసి మరీ చూపిచ్చాడు. ఝడుసుకుని చచ్చాను. ప్చ్ ..
లోకం తెగ పాడై పోయింది. నేను పాడవకుండా ఏదన్నా రహస్యముంటే ..చెప్పరా.. భగవంతుడా ! ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటా, ఎంత కడుపు నొప్పి వచ్చినా సరే ! మాటిస్తున్నానుగా, నమ్మొచ్చు కదా !అసలు ఆడాళ్ళకి కడుపు నొప్పి ఎందుకొస్తుందో తెలుసా ! అవునులే ... హ్యాపీ బ్లీడ్ సంగతి నీకేం తెలుసు ..నీకు అమ్మున్టేగా? అమ్మతోడు ! అవకాశం కోసం నేను మతం మార్చుకోలేదు గనుక నువ్వు అమ్మ లేని భగవంతుడని గుర్తుకొచ్చిందంతే! నిన్నిలా తిట్టడం ఎవరైనా వింటే మా దేవుడికి అమ్మ ఉంది అని యుద్దానికొచ్చే మిత్రులున్నారు. సైలెన్స్ సైలెన్స్ .అదివరకంటే మాటలని ముంతలో పెట్టి దాపెడితే సరిపోయేది ఇప్పుడు నోట్లో మాట నోట్లోనే దాచి పెదవులు కుట్టేసుకోవాలని అనుభవాలు చెబుతున్నాయి.బయటకి పొక్కాయా ..బ్లాక్ చేసి పడేస్తారు. భావ స్వేచ్ఛ జిందాబాద్ !
పెద్దోడిని స్కూల్ లో దించడానికెళ్ళా ! ఆ ఎర్ర చీర మిస్ మీ క్యాస్ట్ ఏమిటీ అనడిగిందమ్మా, క్యాస్ట్ అంటే ఏమిటమ్మా అన్నాడు వాడు. కడుపు రగిలిపోయింది . ఆమె పక్కనే బండి ఆపాను . గుడ్ మార్నింగ్ మేడం ! మీ బాబు సో చీట్ అంది. స్వీట్ అందా చీట్ అందా ఇంటర్నెట్ భాష జనంలోకి వరదలా వచ్చేసాక ప్రతి చోటా కన్ప్యూజే ! ఛీ... దీనెమ్మ జీవితం అనబోయి గబుక్కున ఆపుకున్నా ! ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నా ! మీరేం కేస్ట్ మేడం అడిగింది నన్ను. కోపమొచ్చి నాలుగు పీకుదామనుకున్నా ! ఎలాగో తమాయించుకుని నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదమ్మా ! ఏదో ప్రయోజనం ఆశించి సడన్ గా నా కులమేమిటో ప్రకటించుకోడానికి. కాస్త ప్రశాంతంగా బ్రతకనీయండి తల్లీ అంటూ దణ్ణం పెట్టా ! మీ ఫీలింగ్స్ దెబ్బతీయాలని కాదండీ జస్ట్ తెలుసుకోవాలని అడిగానంతే! మోహంలో అసంతృప్తి దాచుకుని వెళ్ళిపోయింది.
ఈ విషయం అర్జంట్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేసి కుల నిర్మూలన కోసం పోరాడాలి . ఒక నాలుగువందల లైక్ లు, ఎనబై షేర్ లు గ్యారంటీ ! లైక్ లంటే గుర్తొచ్చింది .. ఆ పెద్ద రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఇంకో పెద్ద రచయిత్రికి కోపం . ఈ రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఆ రచయిత్రికి కోపం . భగవంతుడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ మధ్య నన్నెందుకు ఇరికించావయ్యా ! నా మనసు చెప్పినట్టే వింటానని నీకు తెలియదూ ! నారీనారీ నడుమ మురారి నీది నాది వేరే దారి ఏఎన్నార్ డాన్స్, ఇరువురి భామల కౌగిలిలో అంటున్న యువరత్నవేడుకోలు ఒకేసారి గుర్తొచ్చాయి మరి. స్నేహం చేద్దామంటే ఒక్క మంచి మనిషి దొరకరు. బోల్డ్ కాంటెంపరరీ స్టైల్స్ షాప్ లలో అయితే దొరుకుతాయి కానీ మనుషుల్లో మంచి మనిషి భూతద్దం పెట్టి వెదికినా దొరకరు. అన్నీ ఆ తానులో ముక్కలే ! దొరికే దాకా వెతుకు వెతుకు .. వెతకవమ్మా . కష్టపడనిదే ఎవరికీ దొరకదని చెపుతున్నాగా! చత్!! అంతరాత్మ హిత బోధ ఎక్కువైపోయింది.
మన్ కీ బాత్. మన్ కీ బాత్ . వినలేక చచ్చిపోతున్నా. అసలు మనసుంది ఎందరికీ ? కళ్ళముందు భగ భగ మంటలు, కస కస కోస్తున్న కత్తులు, టన్నులు కొద్దీ కన్నీరు. ముందు మన్ తీసేసి మాట్లాడటం నేర్చుకోవాలి. నేర్పేందుకు ఎవరైనా ఉండారో లేదో అన్న సందేహం అసలొలదు. కోచింగ్ సెంటర్స్ కోసం కాళ్ళరిగేలా తిరిగే కష్టం కూడా వద్దు. ఇప్పుడందరూ ఆ విద్యలో అవధానం చేసినవాళ్ళే కదా ! ఓ చిలిపి పంజేయాలని బుద్దిపుట్టి అనవసరంగా పృచ్ఛక అవతారమెత్తితే అసహనానికి గురికాగలరు. జాగ్రత్తగా ఉండాలి పెద్దోళ్ళతో మాటలుకాదు మరి.
మధ్యాహ్నం 12:55 అయింది ప్రియా కూతేసింది కాకి అలవాటుగా గోడమీద వచ్చి కూర్చుని కావ్ కావ్ మంటుంది . ఎదురింటి తలుపు తప్పనిసరై తెరుచుకుంది. గుప్పిట్లో తెచ్చిన ముద్దని గోడమీద పెట్టి వెళ్ళిపోయింది కాకి అత్తమామ ఆరగించడానికి రెడీ అయిపొయింది. బతికి ఉన్నప్పుడు పెట్టారో లేదో కాని కళ్ళు మెరుస్తుండగా తృప్తిగా చూసుకుంటూ వెళ్లి ఠపీమని తలుపేసుకుంది . కాకి తిన్నంత తిని నేలమీద పడ్డ మెతుకులని వదిలేసిపోయింది.ముక్కుతో ఏరేరుకుని తినే శ్రమ ఈ కాకికి లేదు కాబట్టి హాయిగా ఎగిరి పోయింది గానీ పాటు నాకొచ్చి పడింది. గేటులోకి వచ్చి పడ్డ అన్నం మెతుకులని తొక్క కూడదనే సెంటిమెంట్ ఏడ్చింది కాబట్టి చీపురు తీసుకుని బర బరా ఊడ్చి పారేసా ! ప్రక్కనే పక్కిన్టామె పెట్టిన కుండీలో తులసి మొక్కకి చీపురు తగిలిందేమో! పుణ్యం వాళ్లకీ పాపం నాకు.
మధ్యాహ్నం భోజనం చేసాక టీవి తదేకంగా చూస్తూ "దొండపండు పెదవులేసుకుని ఆ కాప్రా చూడు ఎంత బావుందో ... నువ్వు ఉన్నావ్ ఎందుకూ !? సిటీకొచ్చి ఆరేల్లైంది,గోరింటాకు మానేసి నెయిల్ పాలిష్ వేయించలేకపోతున్నా. ఎంతైనా ఊళ్లోళ్ళు మారరని రుజువుచేసుకున్నావ్" అన్నాడు మా ఆయన. కడుపు మండిపోయింది. ఊళ్లోళ్ళు అని గడ్డిపరక లెక్క తీసేస్తున్నాడు. వాళ్ళు లేకపోతే తింటానికి గడ్డి కూడా దొరకదని తెలియదు.ఏంటో పెద్ద పట్నం గొప్ప? నీళ్ళు కూడా కొనుక్కుంటూ అని లోలోపలే తిట్టుకుంటుండగానే ఒక ఆలోచన పుటుక్కుమని పుట్టింది, ఆయన్ని ఏడిపించాలని. బాగుంది కానీ... మరీ తొమ్మిది గజాల గుడ్డ నేలపై జీరాడడమే అస్సలు బాగోలేదు అన్నా. అది అంతర్జాతీయ ఫ్యాషనే పిచ్చిమొహమా అన్నారు. వాళ్ళ ఒంటి నిండా కట్టినా డబ్బులే, కట్టకపోయినా డబ్బులే అంట, నాక్కూడా అలాంటి అంతర్జాతీయ ఉద్యోగమేమన్నా దొరికితే బావుండును అన్నాను అమాయకంగా. రిమోట్ విసిరి పడేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు పిచ్చి నా మొగుడు. సినిమా వాళ్ళతో పెళ్ళాన్ని పోల్చడం మొగుడికి తెలిసినట్టు పెళ్ళానికి తెలియదనే అజ్ఞానమైతే ఎట్టాగబ్బా మరి.
ఇలా రాసేసాక చాలామందిని టార్గెట్ చేసినట్టు రాసేవేమో బంగారూ అంది అంతరాత్మ. బాబోయ్ నేనేమన్నా నల్లకళ్ళద్దాల వృద్దనారీ రచయితనా ఏమిటీ ఇప్పటిదాకా జనాల్లో ఉన్న గౌరవం పోగొట్టుకోవడానికి. ఒక అక్షరం ఎగర గొట్టేసిన పేరుతో కథ రాసేసి విషం కక్కినట్టు ఇంక్ కక్కడానికి. రాసే ప్రతిదీ నిజమని ఏ పాఠక వెధవాయ్ నమ్మడని తెలిసినట్టు లేదు. అంత వయసొచ్చాక కాస్త ఇంగితం ఉండాలి తల్లోయ్ ! అభిమానిస్తున్నారు కదా అని చెవుల్లో ఇంగ్లీష్ కాలీ ప్లవర్ పువ్వెట్టకుమాతా ! చెప్పులో రాయి గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు కొందరు అని చెప్పాలనుకుంటున్నా ! అయినా నా మాట వినడానికి ఆమెకి తీరిక ఉందో లేదో ! చెవులు సరిగా పని చేస్తున్నాయో లేదో !
టీపాయ్ మీద పెట్టిన మా ఆయన ఫోన్ కి ఏదో మెసేజ్ కూత. యధాలాపంగా చూసా. బి ఎఫ్/జి ఎఫ్ కావాలా? కాంటాక్ట్ నెంబర్ పదంకెలు !ఇన్బాక్స్ లో బోలెడు ప్రేమ రుతువుల పైత్యాలు పచ్చిగా వార్మప్ చేసేవిగా ఉన్నాయి. ఇలాంటి వాటితో కాపురాలు కూలిపోమ్మంటే కూలి పోవూ ! అసహనం హద్దులు దాటింది. మా ఆయన ఫోన్ బాల్కనీ గోడకెళ్లి టప్పున కొట్టుకుంటుంది. టీవీ,మొబైల్,ఇంటర్నెట్ ఇవన్నీ లేనప్పుడు అమ్మల కాలం ఇప్పటికన్నా కొద్దిగా బాగుండేదేమో! అప్పుడు ఇన్ని విచ్చలవిడితనాలు లేవు. అయినా ఈ మాత్రం దానికే అంత అభద్రతాభావం ఎందుకో ? అంతరాత్మ మళ్ళీ ఎదురుగా నిలబడి చెప్పింది "ఎందుకంటే పెంపుడు కుక్కని నమ్మినట్టు, కొట్టంలో పశువుని నమ్మినట్టు మొగుడిని నమ్మడానికి వీలులేదే పిచ్చిదానా "అని. పోదూ ...ఎల్లకాలం మోసం చెయ్యాలనుకున్న వాడికి ఎప్పుడైనా బై బై చెప్పే తెంపరితనం కూడా ఉందిలే నాలో అని సముదాయించుకున్నా.
కోపం తగ్గాక మొబైల్ ముక్కలేరి చెత్త కుప్పలో పోద్దామని బయటకొచ్చా. పుస్తకాలు ముందేసుకుని కూడబలుక్కుని చదువుకుంటున్న లక్ష్మిని చూసి ముచ్చటేసింది. పగలల్లా పదిళ్ళల్లో పాచి పని, అంట్ల పని చేసుకుని, ఇల్లు సర్దుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం, చదువుకోవడం. అలా ఉండటం అస్సలు నచ్చలేదట లక్ష్మి మొగుడికి. ఆమె పుస్తకాల్ని చించి పోగులు పెడుతుంటే లక్ష్మి రాక్షసిలా మొగుడి మీద తిరగబడింది. నీ యబ్బ ! నీకేంటిరా నచ్చాల్సింది, నా సదువు నా ఇట్టం. నోరు మూసుకుని ఇంటో ఉంటే ఉండు, దొబ్బితే దొబ్బు అంది . నోరు తెరచుకుని ఆశ్చర్యంగా చూస్తూ లక్స్ నా సౌందర్య రహస్యం, బికినీ వేసుకుని బీచ్ లలో పరిగెత్తడం లాంటివే కాదమ్మా స్వేచ్చంటే .. అచ్చమైన స్త్రీ స్వేచ్చంటే ఇది గదా ! అనుకున్నాను. లక్ష్మీ సెహబాష్ .
లక్ష్మిలా ఇలా తనని తానూ కాపాడుకోకపోతే అసలాడవాళ్ళని బ్రతకనిచ్చేటట్టు ఉన్నారా ! పిండంగా ఉండగానే ముక్కలు ముక్కలు చేసి డ్రైనేజీలో గుమ్మరించేయడం లేదా వావి వరుస వయసు చూడకుండా అత్యాచారం చేయడం. అయితే అటు కాకపొతే ఇటూ ... బేటీ బచావో, ఔరత్ బచావో ... గొంతు పగిలిపోతుంది ఎవరికీ చెప్పాలి, యేమని చెప్పాలి ? వినే నాధుడే లేడాయే ! ఏమి శిక్షరా ... బాబూ ! పొగిలి పొగిలి ఏడ్వక ఏం మిగిలింది ? నెట్ న్యూస్ లో కూడా అప్డేట్ చేసినప్పుడల్లా ప్రపంచ దేశాలలో ఎక్కడైనా సరే .. ఎప్పుడు., ఎలా రేప్ జరిగిందో వివరంగా చెప్పే కథనాలు ఎక్కువైపోయాయి. మొన్నెప్పుడో కలలో రెండు కాళ్ళ మధ్య భూగోళాన్ని ప్రసవిస్తున్న స్త్రీ కనబడింది. ఏమిటో దానర్ధం? ఈ అవాంఛితాల వార్తలు కళ్ళబడటం, వినబడటం వల్ల స్పందించే గుణం కూడా పోయింది. సున్నితత్వం కూడా పోతుంది. మెదడు మొద్దుబారిపోతుంది.
చీకటి పడబోతుండగా మధ్యాహ్నం నిద్ర నుండి మా ఆయన మేలుకున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న కల్యాణ మండపంలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది ... చెవులు బద్దలయ్యే మేళం మోగుతుంది. పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగుతూ నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది గండు చీమ అనే పాటకి తెగ ఎంజాయ్ చేస్తూ మండపానికి వెళుతున్నాడు. అతనుకూడా యువరాజులాగానే ఉన్నాడు.పెద్దలు కుదిర్చిన పెళ్ళంట. భారీ కట్నం,పుత్తడిబొమ్మ అమ్మాయి. మా ఆయనకి దక్కినట్టే ! అంతకి ముందు ఎన్ని చీమలు కుడితే కంగారుగా దులిపేసుకున్నాడో అమ్మా అయ్యా ఏడుపు ముఖాలు చూడలేక.
నా ఫోనేది ... ఆయన ప్రశ్న. ఏమో నాకేం తెలుసూ ... అన్నా అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ముఖంలో అసహనం. నాకది చాలా సింపుల్ గా అనిపించింది. చూస్తున్నారుగా . వేకువఝాము నుండి నేనెన్ని అసహనాలు భరించాను. ఆయనా ఒక్క అబద్దాన్ని సహించకపొతే ఎట్టాగబ్బా!
(సారంగ వెబ్ వార పత్రిక ఏప్రిల్ 21-2016 సంచికలో ప్రచురితం )

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి