ఈ చిత్రం చూసి కదిలిపోయాను ... ఆ కదలిక లో ఈ రాత.
తొమ్మిది నెలలూ గర్భంలో ప్రేమగా దాఛుకున్న నువ్వు
రెండు అరచేతుల మధ్యా నేఅమిరి ఉండననుకున్నావా అమ్మా !
అనాధగా వదిలేసి ఎలా వెళ్ళిపోయావసలు ?
స్తన్యమిచ్చి కడుపు నింప లేకా ఆకలి రోదనని మాన్పలేకా
జోలపాడి నిదురపుచ్చలేకా వదిలేసి వెళ్ళి పోయావా అమ్మా !
నీ ఒడి ఊయల కుదుపులు తెలియవు
నీ వేలినల్లుకుని నిశ్చింతగా నిద్ర పోనేలేదు
నీ భుజ సింహాసనాన యువరాణిలా సేదతీరా లేదు.
గుంపులో ఒకరిగా గుండె గూటికి ఎడం గా ఎడారి మొక్కలా
ఎదుగుతున్న పాపని నేను.
అమ్మంటే ..దయ,కరుణ అని మా టీచర్ చెపుతుంది..
మరి నన్నొదిలిపోయే కాఠిన్యం నీకెలా అబ్బిందమ్మా !
పోనీ నువ్వీలోకం బాధలనుండి విముక్తి పొందావా?
నువ్వు విశ్రమిస్తున్నస్థలమెక్కడుందో అదైనా చెప్పమ్మా !
ఆ సమాధిపై బోర్లా పడుకుని నీ జోల పాట వింటూ ..
మైమరచిపోతాను.
A Iraqi girl in an orphanage -This little girl has never seen her mother, so she drew a mom on the ground and fell asleep inside her.
Pic courtesy : Google.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి