వంట ఇంటోకి పోయి కాఫీకి నీల్లేసి వచ్చి అరుగు మీద కూర్చుంది యశోదమ్మ . పాల చెంబు తెచ్చిచ్చిన తమ్ముడితో “మాధవా! నిదర లేచింకాడి నుండి అమెరికా ఇట్టా, అమెరికా అట్టా అని ఒకటే కలవరిత్తారు గందా ! ఆ దేశంలో చెట్టుని నరకాలన్నా అనుమతి ఇయ్యాలంటగా. అనుమతి లేకుండా చెట్టుని నరికితే జరిమానా వేస్తారంట కదా ! అట్టాంటి రూలు మనదేశంలో ఎందుకు పెట్టలేదంటావ్ ? ” అని అడిగింది.
‘‘ఈడా అన్నీ ఉండాయి లేక్కా! పాటించేది ఎవరని ?’’
‘‘ఉండు రేపు పేపరోడికి చెట్టుని నరికితే శిచ్చేమి పడుద్దో చెప్పమని ఉత్తరం ముక్క రాస్తా...
ఇదీ యశోదమ్మ గురించి నేను వ్రాసిన కథలో ... ఒక భాగం
పచ్చటి చెట్టుని నరికితే ఎలాంటి శిక్ష వేస్తారు ..అపరాధ రుసుం ఎంత చెల్లించాలి అనే విషయాన్ని నాకు చెప్పగలరా ప్లీజ్ ! ఎందుకంటే నాకా విషయం తెలియదు .
నేను వ్రాసిన సరి కొత్త కథ "బయలు నవ్వింది " అరుగు వెబ్ పక్ష పత్రికలో ప్రచురితం అయింది. ఆ కథ చదివి నా సందేహాలు తీర్చండి ప్లీజ్ !
బయలు నవ్వింది ఈ లింక్ లో చదవండి ప్లీజ్ !
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి