నేను రాసిన కథల్లో నాకు నచ్చే కథ ఇది. నా కథల గురించి మాట్లాడిన పాఠకులెవరైనా ఈ కథ గురించి మాట్లాడకుండా వుండరు. కథ ప్రచురితమైనప్పుడు ఎన్ని కాల్స్ వచ్చాయో లెక్కలేదు. ముఖ్యంగా రోడ్డు పక్క చిన్న చిన్న టిఫిన్ సెంటర్ లు నడుపుకునే స్త్రీలు ఆ స్త్రీల తాలూకూ పురుషులు ఫోన్ చేసి కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం నేను మర్చిపోలేదు. ఈ కథలో కృష్ణ రాగద్వేషాలు వున్న సాధారణ యువకుడి పాత్ర. స్పందనలు భావనలు మంచితనం బ్రతకడానికి సరిపడ తెలివితేటలు అన్నీ వున్న సగటు మనిషి పాత్ర. ప్రతి కథలో రచయిత కనబడతాడు అంటారు కదా.. అలా అనుకుంటే .. ఆ కథలో బ్యాంక్ ఉద్యోగపాత్ర నేనే అనుకోండి అంటాను.
ఈ కథలో కామయ్య తోపు ఆ టిఫిన్ బండి ఆమె ఆమె కూతురు నిజం. ఆమె ఇప్పుడు కనబడటం లేదనేది నిజం. కథంతా ఆవరించిన వాస్తవికత కల్పన ఏది తక్కువేం కాదు. అన్నీ సమపాళ్ళు.
చాలామందికి.. నచ్చిన మాటలు ఇవి.
నగల షాపులాళ్ళు,కార్ల కంపెనీలాళ్లు,బట్టల షాపులాళ్ళు ఆఖరికి గడ్డం గీసుకునే రేజర్ కోసం కూడా ఆడాళ్ళని చూపిస్తూ టివి లలో advertisementlu ఇస్తున్నారు కదా! నా వ్యాపారం బాగా సాగడానికి చెమటలు కక్కే మా ఆవిడని చూపిస్తే తప్పేం ఉంది సార్!
వినిపించే కథలు చానల్ లో వెంపటి కామేశ్వరరావు గారు కథ వినిపిస్తానమ్మా అన్నారు.
సంతోషం సర్.. ఎక్కువమందికి చేరాలనే కదా.. రచయిత కోరుకునేది అని అనుకుని కథ పంపాను. చక్కగా చదివి వినిపించారు. ధన్యవాదాలు సర్. 🙏.
మీరూ కథ వింటారు కదూ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి