నేనెప్పుడూ నా కథలను పరిచయం చేయరూ, చదివి వినిపించరూ.. అని యెవరినీ అడగలేదు,అడగను కూడా!
కొంతమంది నా కథలు నచ్చి ఆడియో బుక్ చేసి వినిపించారు. నా అనుమతి లేకున్నా నా దృష్టికి వచ్చిన ఆడియోలు విన్న తర్వాత కూడా వారిని కానీ ఎవరినీ కానీ ఇబ్బంది పెట్టలేదు కూడా.
ఇదిగో.. ఈ కథల స్వాతి Swathi Pantula పరిచయమై రెండేళ్ళు దాటింది. చాలా కథలు వింటాను. స్పందిస్తాను. కథలు పంచుకుంటాం. కథ గురించి మాట్లాడుకుంటాం. కానీ నా కథ తన ఛానల్ లో రావాలని నేను అడగలేదు.. అడగను అని కూడా చెప్పాను.
ఇదిగో.. ఇలా ఊహించని కానుక అందింది.
నేను యెన్నో కథలు రాసాను. కానీ యీ కథ నాకు చాలా యిష్టమైన కథ. ఆ కథ ను నాకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందించింది స్వాతి.
Love this!❤️ Thank you so much Swathi. ఎంత బాగా వినిపించారో. కథలో భావానికి తగినట్లు మీ గొంతును మలుచుకుని అన్ని పాత్రలను విడివిడిగా చూపించారు. ❤️💐 ధన్యవాదాలు.
స్వాతి పంతుల నా “బయలు నవ్వింది” కథ గురించి చక్కని పరిచయం చేసారు.. ఈ కింది విధంగా..
ఒక కుటుంబం లోని మనుషుల మధ్యే బంధాలు సడలి పోతుంటే మనిషికి చెట్టుకి మధ్య బంధం
నిలబడుతుందా?
తోట లోని ఆఖరి చెట్టుని , తన హక్కుని కాపాడుకున్న మహిళ కథ
నిజం చెప్పండీ....యశోదమ్మ అడిగినట్టు చెట్టుని నరికేస్తుంటే మీ ఒక్కో అవయవాన్ని కోసి పారేస్తున్నట్టు అనిపించడం లేదూ??
పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓ చక్కని కథను వినండి.
ఈ కథను ఆడియో రూపంలో అందించడానికి అనుమతి ఇచ్చిన వనజ తాతినేని గారికి కృతజ్ఞతలు.
#Telugukatha #teluguaudiobook #teluguaudiostories #teluguaudiokathalu #రాయికినోరొస్తే #కులవృక్షం #ఈస్తటిక్_సెన్స్
బయలు నవ్వింది ఆడియో బుక్ ఈ లింక్ లో వినండి..
Pic courtesy: మాంట్రియల్ బొటానికల్ గార్డెన్ కంభంపాటి సుశీల గారి చిత్రం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి