22, జూన్ 2024, శనివారం

శిశిరం చిగురిస్తుందా!?

 కొద్ది గంటల్లో పది రోజులు పూరై పోతున్నాయి."నీ లాంటి రాతి మనిషి ని నేనెక్కడా చూడలేదురాతి గుడిలో దేవతలా నువ్వు   ఆరాధనీయమే కాని అనుభవంలోకి రాని దానివినిరాశని అణుచుకుంటూ నిష్టూరంగా అన్నాడు.

 అతని చేతిని తన చేతిలోకి తీసుకుని  ఈ ప్రయాణం ఒక అనుభవం కాదూప్రేమ మానసికం అని నేను గాఢ౦గా  నమ్ముతాను ఎన్నోసార్లు మానసికంగా  చచ్చిన మనిషిని నేనుభర్త నీడన లేకపోవడంవల్ల మాట్లాడిన ప్రతి మనిషితోటి అక్రమ సంబంధాన్ని అంటకట్టి తృప్తి పడిన లోకానికి నా మనఃసాక్షి ధిక్కార స్వరంతో చెప్పిన  సమాధానం ఇది.  మనసు పారేసుకున్న  మనిషినాకెంతో ఇష్టమైన మనిషిని  యేళ్ళ తరబడి ప్రక్కన పెట్టుకుని కూడా ఉంచుకోలేని మనిషినన్న ఆత్మ తృప్తి   నాకు మిగలిందిఇది చాలు"అంది.
"నాతో మాట్లాడేటప్పుడు మాత్రమే తెచ్చిపెట్టుకున్న జాగ్రత్తతో  తెలివిగా మాట్లాడతావుఈ ప్రపంచంతో సంభాషించేటప్పుడు  హృదయంతో మాట్లాడతావు.ప్రకృతిలో సంచరించేటప్పుడు పసిపిల్లవిగా మారిపోతావ్నీలో ఇన్ని కోణాలని ఇంత దగ్గరగా చూసిన తర్వాత నాలో కలిగే శారీరక స్పందనలు మాయమైపోయాయినాలో ఎలాంటి మనోవికారాలు లేవు.  నిజం చెప్పాలంటే హృదయమంతా ప్రేమ పొంగి పొర్లుతుంది
అతను చెపుతూ చెపుతూ  స్వరం జీరపోయినట్లు కొద్దిసేపు ఆగి, తర్వాత "ఆ అనుభూతిని చెప్పడానికి నా దగ్గర మాటల్లేవ్.  దుర్భలత్వంతో  చటుక్కున పురుషుడిపై ఆధారపడిపోయే  యె౦దఱో స్త్రీలని  చూసానువాళ్ళతో నేనిన్ను పోల్చలేను.  స్త్రీలు నిజమైన  చైతన్యవంతులు దృడ మనస్కులు   అయితే నీలా ఉంటారునీ పై గౌరవం ఇంకా పెరిగింది,  నిన్నెప్పుడూ డిస్ట్రబ్ చేయను. " తల వొంచి గౌరవంగా ఆమెకి నమస్కరించాడు.  



కామెంట్‌లు లేవు: