నిశిరాత్రి నీ గృహ ద్వారం ముందు నిలబడే వున్నాను.. నీ పిలుపు అందుతుందని.
నువ్వు నమ్మవు.. బుుజువు చూపమంటావ్
రాత్రిపూట ప్రయాణం సాగించిన నీడ ఆచూకీ అక్కడెందుకుంటుంది? . ఇసుక పై నడిచిన గుర్తులు గాలికి చెరిగిపోతాయి.
బురదలో నడిచిన పాదముద్రలు జడివానకు కొట్టుకెళ్ళాయి. ఇంకెలా నమ్మించను నేను అని వేడుకున్నాడు అతడు, .
ఓరి పాతకాలపు ప్రేమికుడా! నీ కవి భాష తో సంజాయిషీ చెప్పింది చాలు. మా ఇంటి గుమ్మానికి వెన్ను ఆనించి ఓ సెల్ఫీ దిగి నాకు పంపించు చాలు. కాస్త తొందరగా అప్ డేట్ అవ్వొచ్చు.. రా బాబూ.. అంది ఆ ప్రేమికురాలు నిసృహగా.
నిజమే మరి. టెక్నాలజీ ముంగిట్లో ప్రేమ కూడా అప్ డేట్ అవ్వాల్సిన అవసరం వుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి