పాట తోడు -వనజ తాతినేని
హేమ కి భలే ఆశ్చర్యమేసింది . వాళ్ళ మధ్య ఏ రక్త సంబంధం, ఏ విధమైన అనుబంధమూ లేదు . పైగా ఎవరైనా అతనికి భిక్షమేస్తున్నా ఓర్చుకోలేకపోయేవారు ఎప్పుడూ అతనితో గొడవపడుతూనే ఉండే వారు . అలాంటిది గౌరి అతన్ని అలా ఆదుకుందంటే.. ఆలోచిస్తుంటే అబ్బురమనిపించింది. తోటి మనిషిపట్ల ఉండాల్సిన కూసింత కరుణ ఆమె రేపటి పరిస్థితిని కూడా మరపించేసింది. ఇట్టా కాకపొతే ఇంకోలా బతుకు బతకలేమా అన్న ధీమా, తెంపరితనంతో ఏ మాత్రం ఆలోచించకుండా అతనికి సాయం చేసేసింది. గౌరిలో ఉన్న ఆ గుణం ఆమెకి బాగా నచ్చేసింది క్రమేపీ క్రమేపీ నాకు మనుషులపై తగ్గిపోయిన నమ్మకం తిరిగి ఇక్కడిలా సాక్షాత్కారమవడం ఆనందం కల్గించింది అనుకుంది.
గౌరి రంగడు.. వీరి గురించి తెలుసుకోవాలనుకుంటే కథ వినండీ..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి