29, ఫిబ్రవరి 2012, బుధవారం

ది రియాలిటీ ఆఫ్ ఇండియా ..

ది  రియాలిటీ ఆఫ్ ఇండియా ..

ధైర్యం  ఉంటేనే ఈ వీడియో ..చూడండీ ! మూఢ విశ్వాసాలకు నెలవు ..మన  దేశం. నమ్మాలి తప్పదు.

గగుర్పాటు,జుగప్స..బాబోయ్.. యెంత భయానకం ...

        ఈ  లింక్   లో   The Relity of India .  

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

అచంగ ప్రశ్నలకి నా జవాబులు

  "అమయ" బ్లాగర్ ... సామాన్య గారి కథ "కల్పన" కథ పై.. జరుగుతున్న  వాడి, వేడి చర్చ ఇది. ఈ కథ పై.. కథా విశ్లేషణ చేసినందుకు గాను..నాకు ..ప్రధమ బహుమతి లభించింది. కథ జగత్ లో ఈ కథని..  ఈ  లింక్ లో  చూడండి.
అలాగే నావిశ్లేషణ ని  .. ఈ  లింక్  లో  చూడండి.
కృష్ణ వేణి తీరం  బ్లాగర్ అచంగ గూగుల్ + లో ఈ రోజు జరుగుతున్న చర్చలో సంధించిన ప్రశ్నలకి  నా జవాబులు  

అరుణ్ చంద్ర ఇలా అన్నారు.

మగవారి యాంగిల్ నుండి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి.... అతితెలివిగా భావించక మన్నించండి.
 
1. మగాడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఆడువారికి సమ్మతమేనా?

జవాబు: పూర్తి సమయం హౌస్ హస్బండ్ గా మగవారిని భరించడం చాలా కష్టం. షిప్ట్ ల ఉద్యోగాలు అయితే భార్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భర్త ఇంట్లో ఉండి(బయట అనవసర కాలక్షేపం చేయకుండా ) బిడ్డలని, ఇంటిని చూసుకోవాలి కదా! అది భర్తగా,తండ్రిగా బాధ్యత కాదా!? ఇది ఆడువారి మనసులోని కోరిక. మరి ఇది తప్పంటారా? 

2. ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే.

జావాబు: మినహాయింపు ఉంటే అది.. సానుభూతి మాత్రమే! లేదా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి ఉండటం కద్దు.  ఇప్పటికాలంలో..ఆడువారిపై జరుగుతున్నలైంగిక వేదింపులు,మానసిక హింస మగవారికి ఉండవు. ఉద్యోగ బాధ్యతలు.. స్త్రీ-పురుష ఇద్దరికీ సమానమే! ఆడవారికి కొంచెం వెసులుబాటు ఇస్తే తప్పు లేదు. ఇంటా-బయట చాకిరి కదా! ఇప్పుడు రిజర్వేషన్ లు ఉండగా లేనిది ఇవి తప్పు కాదు. :)


3. తలకిందులుగా తపస్సు చేసినా మగాడు బిడ్డని కనలేడు. అలాంటప్పుడు మగాడే స్త్రీ రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆడువారు పిల్లల పెంపకం చూసుకోవటానికి వచ్చిన బాధేమిటి?


జవాబు: నవమాసాలుమోయడం, ప్రసవవేదన శారీరక అసౌకర్యం అన్ని భరించిన భార్య అలసిపోతే..బిడ్డల పెంపకంలో పురుషుడు సాయం చేయకపోవడం, ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు తప్పుకోవడం తప్పు కాదా? బిడ్డల బాధ్యత అతనికి లేదా?. 


4. ఒక ఆడది ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగలిగినప్పుడు, యాభై లక్షలు సంపాదించే ప్రేమించనివాడిని చేసుకోవటమెందుకు? పనీపాటా లేకుండా  ప్రేమించటమే పనిగా పెట్టుకున్నవాడినికి ఒకణ్ణి చేసుకోవచ్చుగా?

జవాబు: ఆడది సంపాదించి..నువ్వు సంపాదించకపోయిన పర్లేదు. నువ్వు ఇంట్లోనే ఉండి నన్ను ప్రేమించడమే పనిగా పెట్టుకో! అనరు. పని-పాటా లేకుండా బలాదూర్ గా   తిరుగుతూ వ్యసనపరుడై పైసా సంపాదనలేకున్నా అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటికి వచ్చినా ..పొద్దస్తమాను   కష్టపడి అయినా  తను సంపాదించినదానిలో పస్తులుండి అయినా భర్తకి అట్టేపెట్టి ఓపికతో, భర్త కి ఇంత కూడు పెట్టి ఆయన గారి వికృత రూపాన్ని భరించేది ఆడది. ఉద్యోగం పురుష లక్షణం. గృహస్తు  ధర్మం. బాధ్యతలు పంచుకోవడం. రెండు ఆశించడం తప్పు కాదు కదా  ! .

5. సాధించి చట్లో పెడుతున్నది అత్తా-ఆడపడుచులైనప్పుడు దానికి మగాడిని పూర్తిగా బాధ్యుడిని చెయ్యటం ఎంతవరకూ సబబు? అత్తలు, ఆడపడుచులూ ఆడువారేకదా!

జవాబు: ఖచ్చితంగా ఆడువారు! కానీ వారికి వంత పాడటమో మౌనం వహించడమో కాదు సమస్యకి పరిష్కారం జోక్యం   చేసుకుని తప్పు ఎవరిదైనా ఖండించడం. అలాగే కోడలికి చాలా చట్ట సంబంధమైన బలం ఉంది.అందుకే కొన్ని సమసిపోతాయని ఆశ. అవకాశవాదంగా మార్చుకుంటే దాని అంత విచారం ఇంకోటి లేదు.

6. ఆడదానికి సమస్య వచ్చినప్పుడు మొగుణ్ణి అడ్డంపెట్టుకుంటుంది మరి ఇరవైనాలుగ్గంటలూ పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంట్లొ ఉంటే మగాడికి సమస్య వచ్చినప్పుడు అతన్ని సమర్థించే వ్యక్తులు ఎక్కడనుండి వస్తారు?!

జవాబు: అతని తరపు వారు ఏమవుతారు? నిజాన్ని నిగ్గదీసి అడగడానికి ఎవరు లేకుండా ఉంటారా? 

7. మగాడి తన్నుల గురించి మాత్రమే మాట్లాడేటప్పుడు ఆడువారి సణుగుడు గురించి అసలు బయటకు రాదెందుకు? (సుప్రీం కోర్టు ఆడువారి సణుగుడుని మానసిక హింసగానే పరిగణించాలని తీర్పు చెప్పింది).

జవాబు: చట్టం, న్యాయం ఎవరికి చుట్టం కాదు. పోరాడటం లక్షణం. 

25, ఫిబ్రవరి 2012, శనివారం

గెలుపు రహదారి



నీ కోసం చూసే క్షణాలు బరువుగా కదులుతూ..యుగాలని పిస్తుంటే
నీతో ఉన్న కొన్నిగంటలు క్షణాలులా కరిగిపోతుంటాయి
నీవు దూరమైన తరవాత గడపాల్సిన కాలం గుర్తుకువచ్చి
జీర్ణించుకోవడానికి నన్ను నేను సమాయుత పరచుకోవడం
దుర్లభం కనుక అసలు నేను నిన్ను కలవాలని అనుకోవడం
వద్దని   నన్ను నేను నియంత్రిచుకోవడంలోను విఫలమై
అర్ధం కాని అయోమయ స్థితిలో ఉహాల్లో బతికున్నానేమో..
జీవనంలో జీవశ్చవంలా మారానో..? 
ఏమైనా నీ పై నాకున్న భావన సహనశీలి గా ముద్రించుకుని
గెలుపు రహదారి మొదట్లో ఆగి చూస్తుంది...