మళయాళంలో కారూర్ నీలకంఠ పిళ్ళై రాసిన కథకు LR స్వామి గారు తెలుగు అనువాదం చేసారు. ఇలాంటి మంచి కథను ఆడియో బుక్ గా చేసాను. తప్పకుండా వినండీ.
మళయాళంలో కారూర్ నీలకంఠ పిళ్ళై రాసిన కథకు LR స్వామి గారు తెలుగు అనువాదం చేసారు. ఇలాంటి మంచి కథను ఆడియో బుక్ గా చేసాను. తప్పకుండా వినండీ.
మనం అవమానింపబడటానికి ఇతరులు మన జీవితంతో ఆడుకోవడానికి,
మన కలలు వేరొకరు పగలగొట్టి వెళుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ లేము,
గాలివాటు జీవితం లా కొట్టుకుపోవడానికి సిద్దపడి ఇక్కడ లేము.
మనకు కష్టపడి పనిచేయడం అలవాటు. మనం ఎత్తడానికి భారాలు చాలానే ఉన్నాయి.
గాయాలెన్నో తొలిచేస్తూ ఉంటే బలహీనపడి మీ పోరాటాన్ని తిరస్కరించవద్దు.
దానిని ఎదుర్కోవడానికి రంధి పడండి .
ఇది జీవితం నీకిచ్చిన బహుమతి. బలంగా ఉండండి.
రోజులు బహు చెడ్డవి, ఎవరిని నిందించాలి అని వేదాంతం వల్లించవద్దు. చేతులు ముడుచుకుని అవమానాన్ని అంగీకరించకండి.
నిజం పేరు మీద నిలబడండి, మాట్లాడండి మరియు ధైర్యంగా ఉండండి.
బలంగా ఉండండి!
ఆరోపణలు ఎంత హీనమైనవో అసత్యాలు ఎంత నిరాధారమైనవో అవహేళన ఎంత కృత్రిమంగా అతికించబడిందో అవమానం ఎంత లోతుగా పాతుకుపోయిందో,
యుద్ధం ఎంత కష్టంగా వుంటుందో ఎన్ని రోజులు జరుగుతుందో అది ముఖ్యం కాదు.
బలంగా వుండండి.
కార్యక్షేత్రంలో వెన్నుజూపి పారిపోకండి.
ఏ అదృశ్యశక్తో మీకు తోడు అవుతుందని అతిగా ఆశించకండి.
తెర్లుతున్న ఆవేశంతో మరుగుతున్న ఆలోచనతో కాలం ఇంధనంతో తగిలిన గాయంపై ఉప్పు కారం అద్ది ఆ చోదకశక్తితో కసిగా పథం పట్టండి.
రేపటి పాటొకటి మీ కొరకు వేచివుంది. మీ విజయాలను అది కీర్తిస్తుంది.
|| నేను ఒక పుస్తకం తెరిచాను ||
నేను ఒక పుస్తకం తెరిచి లోపలికి ప్రవేశించాను.
ఇప్పుడు నన్ను ఎవరూ కనుగొనలేరు.
నా కుర్చీ నా ఇల్లు నా రహదారి నా ఊరు
నా ప్రపంచం అన్నీ నా వెనుకనే వదిలేసాను
నేను జలతారు కలల అంగీ ధరించాను.
నేను రాజకుమార్తెను కనుగొనే ఉంగరాన్ని జారవిడిచాను.
మంత్ర మాత్రను చప్పరించాను.
నేను ఒక డ్రాగన్ తో పోరాడాను
రాజుతో విందు ఆరగించాను
మరియు అడుగు తగలని సముద్రం లో ఈదులాడాను.
నేను పుస్తకం తెరవగానే కొంతమందిని స్నేహితులుగా చేసుకున్నాను.
నేను వారి కన్నీళ్ళను నవ్వులనూ పంచుకున్నాను.
మరియు ఎగుడుదిగుడుగాను అనేక ఒంపులతో వున్న వారి మార్గాన్ని అనుసరించాను.
నేను నా పుస్తకం చదవడం పూర్తి చేసి బయటకు వచ్చాను.
ఆ అంగీ ఇక నన్ను దాచలేదు
నా కుర్చీ నా ఇల్లు అలాగే వున్నాయి.
అయితే నా లోపల ఒక పుస్తకం వుంది
నా లోపల ఎప్పుడూ ఒక పుస్తకం వుంటుంది.
స్వేచ్ఛానువాదం: వనజ తాతినేని
మూలం: I OPENED A BOOK
By Julia Donaldson