15, మార్చి 2026, ఆదివారం

చివరికి ఎవరికి ఎవరు!?

 చివరికి ఎవరికి ఎవరు!?  - వనజ తాతినేని 

చివరికి…ఏమీ లేదని మనం నమ్ముదాం

ప్రతి జీవితం ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది 

దాన్ని మనం తీసుకుంటామో లేదో మనకే తెలియదు. 

మనం బ్రతికినన్నాళ్ళు మెరుగ్గా తెలివిగా అందంగా గడపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ.. 

ప్రేమించబడటానికి మనమేం చేయాలి అని  ఆలోచన చేస్తూ కూడా  జీవితాన్ని ఇబ్బంది పెడతాం. 

మనకు తెలుసా!?

మనల్ని హృదయంతో చూసే వారు.

మన అసంపూర్ణతను ఒక్క చూపుతో కనిపెట్టగలరన్న సంగతి.. 

మనం  రెండు విషయాలను అర్థం చేసుకోవాలి.

మనల్ని  షరతులు లేకుండా ప్రేమించేవారు

మనల్ని తమ హృదయాలతో చూస్తారు

మనకు వారి లక్షణాలను బట్వాడా చేస్తారు 

మనను ద్వేషించేవారు మనల్ని ప్రేమించడానికి  నిరాకరించేవారు ఏవో కుంటిసాకులు చెపుతూ

పక్కకు తప్పుకుంటారు. 

అసంపూర్ణ హృదయాలతో వున్న వారి మనసెప్పుడూ అనుమాన శంకితమే!

నిజంగా ఉన్నది  వున్నట్టుగానూ 

వాటికి మించి మనల్ని ప్రేమించడానికి  వారు  ఎప్పటికీ నిరాకరిస్తూ వుంటారు. 

ఏ బంధానికైనా 

ప్రేమ  మూల ధనం అని గ్రహించరు.  

అసంతులిత అసంఘటిత విషయాలతో

మానసిక అల్లకల్లోలంతో ఎదుటివారిలో అలజడి రేపెడతారు.

మన అవధుల్లేని ప్రయత్నాలన్నింటితో  వారు ఎప్పటికీ సంతృప్తి చెందరు కాబట్టి.

పరిపూర్ణత కు నోచుకోని వారిని  అలాగే వదిలేద్దాం. అదంత ముఖ్యమైనది కాదు. .

ఈ అనుభవాలు మనకు  విలువైనవి ,

ఎందుకంటే అవి మనకు వారిని లోతుగా 

అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. 

చివరికి  ఏమీ లేదని మనం  నమ్ముదాం.

చివరికి.. ఎవరికి ఎవరు ? అనే ప్రశ్న ను కూడా అలాగే వదిలేద్దాం! 


#వనజతాతినేని

#vanajatatineni

#poetry

కామెంట్‌లు లేవు: