సంరక్షణ
రోజూ రెండు మొక్కలు నాటతాను.
రోజూ మొక్కలకు ఒక్క కవితా వాక్యమైనా
వినిపిస్తాను.
రోజూ రెండు మొక్కలైనా కానుకగా యిస్తాను.
రోజూ మూడు మొక్కలైనా చాటుకు వెళుతున్నాయి.
ఏం చేయను? ఇలా అయితే నా తోట నిండేది యెలా?
మొక్కలకు నా కవిత్వం నచ్చడం లేదా?
మీరే చెప్పండి.. తోటను యెలా సంరక్షించాలి?


కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి